Today Horoscope In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే రోజు కుజుడు, బుధుడు, శుక్రుడు కలిసి త్రికోణ యోగం ఏర్పాటు చేయనున్నారు. దీంతో కొన్ని రాశుల వ్యాపారులకు అదృష్టం వరించనుంది. మరికొందరు ప్రయాణాలు చేయాల్సి వస్తే జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారికి ఈ రోజు ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది. కానీ ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. అందువల్ల ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కొత్తగా ఏదైనా పనులు ప్రారంభిస్తే పెద్దల సలహా తీసుకోవాలి. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : . ఈ రాశి వారికి ఈ రోజు అదృష్టం కలిసి వస్తుంది. ఖర్చులు పెరిగిన ఆదాయం రావడంతో ఇబ్బందులు ఉండవు. ఉద్యోగులు తమ కార్యకలాపాలలో అలసిపోతారు. లక్ష్యాల కోసం తీవ్రంగా కష్టపడతారు. అయితే అధికారుల మద్దతుతో అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. కొత్తగా ప్రాజెక్టులో ప్రారంభించే వారు పెద్దల సలహా తీసుకోవాలి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తే జాగ్రత్తగా ఉండాలి.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): . కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఉండే అవకాశం ఉంటుంది. భావోద్వేగాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. జీవిత భాగస్వామి కోసం సమయానికి కేటాయించాలి. పిల్లల కెరీర్ పై దృష్టి పెట్టాలి. ఉద్యోగులు లక్ష్యాలను పూర్తి చేయడానికి తీవ్రంగా శ్రమిస్తారు. స్నేహితుల నుంచి ధన సహాయం పొందుతారు. కొత్త ప్రాజెక్టుల కోసం చేసే ప్రణాళికలు ఫలితాలను ఇస్తాయి. వ్యాపారులు కొత్త భాగస్వాములను చేర్చుకుంటారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని రంగాల్లో కలిసి వస్తుంది. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. స్నేహితులతో ఉల్లాసంగా గడుపుతారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. వ్యాపారులు కొత్త ప్రణాళికలు చేపడతారు. జీవిత భాగస్వామితో వ్యాపారం చేసేవారికి కలిసి వస్తుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . ఈరోజు వారు ఈ రోజు అనేక సమస్యలు ఎదుర్కొంటారు. స్నేహితులను కలవడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. ఆర్థిక వ్యవహారాలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారిలో కొత్త భాగస్వాములతో అప్పుడు ఆర్థిక వ్యవహారాలు జరపొద్దు. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు పెద్దల సలహా తీసుకోవాలి. విద్యార్థుల కెరియర్ పై ప్రత్యేక దృష్టి పెడతారు. పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . ఈరోజు వారు ఈరోజు ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉద్యోగులు లక్ష్యాలను పూర్తి చేయడానికి తీవ్రంగా కష్టపడాల్సి వస్తుంది. అడుగడుగునా ఆటంకాలు ఎదురుకోవడంతో తీవ్ర నిరాశ చెందుతారు. అయితే కొందరు ఉద్యోగుల సహకారంతో అనుకున్న పనులు సమయానికి పూర్తి చేస్తారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు ఆర్థికంగా ప్రయోజనాలు పొందుతారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. వ్యాపారుల మధ్య భాగస్వామ్య ఒప్పందం బలపడుతుంది. కొందరు కొత్త భాగస్వాములు చేరుతారు. జీవిత భాగస్వామితో కలిసి వ్యాపారం చేసే వారికి కలిసి వస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇవి ఆర్థికంగా లాభాలను తీసుకొస్తాయి.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : . ఈ రాశి వారికి కొన్ని విషయాల్లో ఆందోళనకరమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగులు కార్యాలయాల్లో ఒత్తిడిని ఎదుర్కొంటారు. మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. అయితే కుటుంబంలో కొన్ని సమస్యలు ఎదురుగా అవడంతో ఆందోళనగా ఉంటారు. వ్యాపారులు కొన్ని వర్గాల నుంచి విమర్శలను ఎదుర్కొంటారు. అయినా కొన్ని చర్యల వల్ల సమాజంలో గుర్తింపు వస్తుంది. కుటుంబ సభ్యులాండతో కొత్తగా పెట్టుబడులు పెడతారు.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : . ఈ రాశి వారు ఈ రోజు స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి. కొందరు మోసం చేసే అవకాశం ఉన్నది. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేస్తారు. విహార యాత్రలకు వెళ్ళేందుకు ప్లాన్ చేస్తారు. ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సి వస్తే కొన్ని రోజులపాటు వెయిట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువ. జీవిత భాగస్వామితో విభేదాలు ఉండే అవకాశం.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : మకర రాశి వారికి ఈ రోజు అన్ని రంగాల్లో కలిసి వస్తుంది. మీరు ఏదైనా కొత్తగా పెట్టుబడులు పెడితే అవి భారీగా లాభాలు వస్తాయి. అనవసరపు వివాదాల్లో జోక్యం చేసుకోవడం మానుకోవాలి. అర్హత కలిగిన ఉద్యోగులకు పదోన్నతులు వస్తాయి. లక్ష్యాలను పూర్తి చేయడంతో కొందరికి జీతం పెరుగుతుంది. వ్యాపారంలో కొత్తగా పెట్టుబడులు పెడతారు. వీరికి కుటుంబ సభ్యుల అండ ఉంటుంది.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) :. ఈ రాశి వారు ఈ రోజు మానసికంగా దృఢంగా ఉంటారు. తమశక్తి ఇతర ద్వారా వ్యాపారాలలో లాభాలను తెచ్చుకుంటారు. ఉద్యోగులు లక్ష్యాలను పూర్తి చేస్తారు. దీంతో ప్రమోషన్ పొందే అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యమైన జీవితాన్ని గడుపుతారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. కుటుంబంలో ఏదైనా వివాదం ఉంటే వెంటనే పరిష్కరించుకోవాలి.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : . ఈ రాశి వారు ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అదనపు ఖర్చులు ఉంటాయి. అయితే ఆదాయం రావడంతో పెద్దగా ఇబ్బంది ఉండదు. కుటుంబ సభ్యుల్లో ఒకరి చర్యల వల్ల మనసు ఆందోళనగా మారుతుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం పై ప్రత్యేకత వహించాలి. స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు.