‘Today horoscope in telugu ‘: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై ఉత్తరభాద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో అపర ఏకాదశి ఉండడంతో కొన్ని రాశుల వారికి అనుకూలమైన ఫలితాలు ఉండనున్నాయి. మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారు ఈ రోజు జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు. స్నేహితుల నుంచి ధన సహాయమందుతుంది. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఏదైనా వివాదం ఉంటే వెంటనే దానిని పరిష్కరించుకోవాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే రాణిస్తారు. వ్యాపారులకు లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణ ఉంటుంది.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారికి ఈ రోజు అనేక రంగాల్లో పురోగతి లభిస్తుంది. వ్యాపారులకు అనుకూలమైన వాతావరణ ఉండనుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణిస్తారు. కొన్ని పనుల కారణంగా బీసీ వాతావరణం లో ఉంటారు. ఇంట్లో సమస్యల గురించి కుటుంబ సభ్యులతో చర్చిస్తారు. బంధువుల నుంచి తన సహాయం అందుతుంది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేస్తారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి విద్యార్థులు ఈ రోజు పోటీపరీక్షల్లో పాల్గొంటారు. ఉద్యోగులు కార్యాలయాల్లో అనుకున్న పనులను పూర్తి చేయగలుగుతారు. దీంతో అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. విదేశాలకు వెళ్లాలని అనుకునే వారికి ఇదే మంచి సమయం. అనుకోకుండా దూర ప్రయాణాలు. బ్యాంకు నుంచి రుణం తీసుకుంటారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారికి ఈరోజు ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. కొత్తగా పెట్టుబడులు పెట్టాలనికునే వారికి ఇదే మంచి సమయం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. వ్యాపారులకు కొన్ని నిరాశ వార్తలు ఎదురవుతాయి.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈ రోజు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఎవరి దగ్గర నుంచి అయినా అప్పు తీసుకుంటే దానిని తిరిగి చెల్లించాలి. కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. అనవసరపు వివాదాలకి తల దూర్చదు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సివస్తుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వ్యాపారులకు ఈరోజు అనుకున్న ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు అదనపు ఆదాయం అందుతుంది. అధికారులు సీనియర్ సభ్యుల నుంచి మద్దతు పొందుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. గతంలో చేసిన తప్పులకు సమస్యలు ఎదుర్కొంటారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఈ వ్యాపారులకు లాభాలు ఉంటాయి.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాజు వారు ఈరోజు ముఖ్యమైన పనులను పూర్తి చేయగలుగుతారు. విద్యార్థులు పోటీ పరీక్షల కోసం సిద్ధమైతే వాటిని విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధువుల నుంచి ధన సహాయం అందుతుంది. ఎవరికైనా అప్పు ఇవ్వాల్సి వస్తే తిరిగి వచ్చే అవకాశం గురించి ఆలోచించాలి. జీవిత భాగస్వామితో ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు. ఆత్మవిశ్వాసం తో పనులు చేస్తారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారికి ఈ రోజు అనుకూలమైన ఫలితాలు ఉండనున్నాయి. మనసులో ప్రతికూల ఆలోచనలు రానివ్వకుండా ఉండాలి. పిల్లల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. వ్యాపారులకు లాభాలు వస్తాయి. సామాజిక రంగాల్లో పాల్గొనే వారికి అనుకూలమైన వాతావరణ ఉంటుంది.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈ రోజు పిల్లల కెరీర్ పై ప్రత్యేక దృష్టి పెడతారు. ఉద్యోగులు కార్యాలయాల్లో ప్రశంసలు అందుకుంటారు. జీవిత భాగస్వామితో ఒక విషయంలో విభేదాలు రావచ్చు. వ్యాపారులు మెరుగైన ఫలితాలు పొందుతారు. ఉద్యోగులు లక్ష్యాలను పూర్తి చేయడంతో అనుకున్న ఫలితాలను పూర్తిచేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణిస్తారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈరోజు వారు ఈరోజు కార్యాలయంలో ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలి. బదిలీలు ఉండే అవకాశం ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటారు. వ్యాపారులకు అనుకున్న లాభాలు వచ్చే అవకాశం ఉంది. ప్రియమైన వారితో సంతోషంగా ఉండగలుగుతారు. మనసులో ఎటువంటి ప్రతికూల ఆలోచనలను అనువకుండా ఉండాలి. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు అధికారుల నుంచి ఉద్యోగులకు ప్రశంసలు అందుతాయి. వ్యాపారులు తోటి వారితో సంయమనం పాటించాలి. లాభాల విషయంలో కష్టపడాల్సి వస్తుంది. పిల్లల కెరియర్ పై ప్రత్యేక దృష్టి పెడతారు. అనుకోకుండా ధన లాభం వస్తుంది. పిల్లల నుంచి సంతోషకరమైన వార్తలు వింటారు. ఎవరితోనైనా వాగ్వాదం చేసుకునే సమయంలో జాగ్రత్తగా ఉండాలి.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారికి ఈ రోజు కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. మానసికంగా ఒత్తిడితో ఉంటారు. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. విద్యార్థుల్లో పోటీ పరీక్షల్లో పాల్గొంటే రాణించే అవకాశం ఉంది. వ్యాపారులకు మెరుగైన ఫలితాలు నానున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య వాదనలు ఉండవచ్చు. తల్లిదండ్రులకు సేవ చేయడంలో ముందుంటారు.