https://oktelugu.com/

Today Horoscope In Telugu: ఈ నాలుగు రాశుల వారికి ఈరోజు అధిక ఆదాయం.. వద్దన్నా డబ్బు..

Today Horoscope In Telugu గతంలో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. వ్యాపారులు అధిక లాభాలు పొందుతారు. ఉద్యోగులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. కుటుంబ వాతావరణం ఆనందంగా ఉంటుంది.

Written By: , Updated On : March 16, 2025 / 08:05 AM IST
Today Horoscope In Telugu

Today Horoscope In Telugu

Follow us on

Today Horoscope In Telugu: జ్యోతిష శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై హస్తా నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు సర్వార్ధ సిద్ధియోగం ఏర్పడడంతో కొన్ని రాశుల వారికి శుభ ఘడియలు ఉండనున్నాయి. మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాసిన ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1) : ఈరోజు వారు ఈరోజు చాలా కష్టపడాల్సి వస్తుంది. వ్యాపారులకు నిరుత్సాహమైన లాభాలు ఉంటాయి. బంధువుల నుంచి ధన సహాయం అందుతుంది. కొన్ని ఇష్టం లేకుండా పనులు చేయాల్సి వస్తుంది. జీవిత భాగస్వామితో వాగ్వాదం మంచిది కాదు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటారు. బంధువుల నుంచి కీలకమైన సమాచారం అందుకుంటారు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : గతంలో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. వ్యాపారులు అధిక లాభాలు పొందుతారు. ఉద్యోగులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. కుటుంబ వాతావరణం ఆనందంగా ఉంటుంది. సాయంత్రం స్నేహితులతో గడుపుతారు. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. సోదరుల సలహాలతో కొత్త పెట్టుబడులు పెడతాను. ఉద్యోగులు లక్ష్యాలను పూర్తి చేయడంతో ఆనందంగా ఉంటారు.

మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఉద్యోగులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి. తోటి వారి సహాయంతో లక్ష్యాలను పూర్తి చేస్తారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు పదోన్నతిని పొందుతారు. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. నిరుద్యోగులకు ఆఫర్లు వచ్చినట్లే వచ్చి మాయం అవుతాయి. వ్యాపారంలో కాస్త లాభాలు తక్కువగా ఉంటాయి. కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. బంధువుల ఇంటికి శుభకార్యానికి వెళ్తారు.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ప్రయాణాలు చేయాల్సి వస్తే జాగ్రత్తగా ఉండాలి. మాటలను అదుపులో ఉంచుకోకపోతే సమాజంలో గౌరవం దెబ్బతింటుంది. విద్యార్థులు కొత్త కోర్సుల్లో ప్రవేశానికి ఇదే మంచి సమయం. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. ఇతరులతో వాగ్వాదాలు చేస్తే జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. తల్లిదండ్రుల సలహాలతో వ్యాపారంలో కొత్త పెట్టుబడును పెడతారు. ఆర్థికంగా స్థిరంగా ఉంటారు. సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. పూర్వీకుల ఆస్తి విషయంలో శుభవార్తలు వింటారు. కొత్తగా ఒప్పందాలు చేసుకునే ముందు ఆలోచించాలి. ఉద్యోగులు అధికారుల నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటారు.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకునే వారు పెద్దల సలహా తీసుకోవాలి. ఆరోగ్యంపై నిర్లక్ష్యంగా ఉండడం వల్ల సమస్యలు ఎదుర్కొంటారు. ఉన్నతాధికారుల సహాయంతో ఉద్యోగులు లక్ష్యాలను పూర్తి చేస్తారు. చట్టపరమైన చిక్కులు ఉంటే ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అనుకోకుండా విహారయాత్రలకు వెళ్తారు.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయంలోనూ నిర్లక్ష్యంగా ఉండొద్దు. సోదరులతో విభేదాలు ఉంటే వెంటనే పరిష్కరించుకోవాలి. రాజకీయ నాయకులకు పదోన్నతులు వచ్చే అవకాశం ఉంది. దీంతో వీరికి సమాజంలో గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేస్తారు. ఇంటికి అనుకొని అతిథి రావడం వల్ల సందడిగా మారుతుంది.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈరోజు ఏ నిర్ణయం తీసుకున్న సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారికి పదోన్నతులు వస్తాయి. అయితే కొన్ని పనుల విషయంలో అధికారుల నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటారు. విద్యార్థుల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. డబ్బు సహాయం ఏర్పడితే బంధువుల నుంచి అందుతుంది. కొత్త వారితో ఆర్థిక లావాదేవీలు చేయాల్సి వస్తే జాగ్రత్తగా ఉండాలి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాల్సి వస్తే ఈరోజు అనుకూల సమయం

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి ఈ రోజు జీవితం సంతోషంగా ఉంటుంది. కొన్ని స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. గతంలో ఏదైనా వివాదం ఉంటే నీటితో పరిష్కారం అవుతుంది. పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతారు. కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి ఇదే మంచి సమయం. జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణాలు చేస్తారు. వాహనాలపై వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలి.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈరోజు ఇతరులపై కోపాన్ని తెచ్చుకుంటారు. అయితే మాటలు మాధుర్యంతోనే సంబంధాలు మెరుగుపడతాయి. కార్యాలయాల్లో అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. అవసరాలు తీర్చుకోవడానికి డబ్బులు ఖర్చు చేస్తారు. ఆదాయం పెరగడంతో సంతోషంగా ఉంటారు. పిల్లల కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే నిపుణుల సలహా అవసరం. ఈరోజు ఎవరిని బాధ పెట్టకుండా జాగ్రత్త పడాలి. జీవిత భాగస్వామి సహాయంతో వ్యాపారులు అధిక లాభాలను పొందుతారు. ఇతరుల వివాదాల్లో జోక్యం చేసుకోకుండా ఉండాలి. చట్టపరమైన చిక్కులు ఉంటే నీటితో పరిష్కారం అవుతాయి. విద్యార్థుల కష్టానికి తగిన ఫలితాలు వస్తాయి.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : . ఈ రాశి వారు ఈ రోజు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. జీవిత భాగస్వామితో వాగ్వాదం ఉంటుంది.. మాటలను అదుపులో ఉంచుకోకపోతే గొడవ పెద్దదిగా మారుతుంది. కుటుంబ సభ్యుల్లో ఒకరికి అనారోగ్యం ఏర్పడుతుంది. నేను నిర్లక్ష్యం చేయడం వల్ల తీవ్ర నష్టాలు ఎదుర్కొంటారు. ఇంటికి అతిథి రాకతో సందడిగా ఉంటుంది. మానసిక సమస్యల నుంచి విముక్తి పొందుతారు.