https://oktelugu.com/

Today horoscope in telugu : ఈరోజు ఈ రాశుల వారికి శని దేవుడి ఆశీస్సులు.. ఏ పని ప్రారంభించిన విజయవంతమే..

Today horoscope in telugu : విదేశాల్లో ఉండేవారి నుంచి వచ్చే సమాచారంతో సంతోషంగా ఉంటారు. ఉద్యోగులు కార్యాలయంలో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. వ్యాపారులకు అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది.

Written By: , Updated On : March 15, 2025 / 08:08 AM IST
Horoscope Today

Horoscope Today

Follow us on

Today horoscope in telugu  : జ్యోతిష్య శాస్త్ర ప్రకారం శనివారం ద్వాదశరాసులపై హస్తా నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు గురుడు చంద్రుడు కలయికతో నవపంచమియోగం ఏర్పడడం వల్ల కొన్ని రాశుల వారు ఆర్థికంగా ఉంచుకుంటారు. మరికొన్ని రాశుల వారికి శత్రువుల బెడద ఎక్కువగా ఉంటుంది. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1) : ఈ రాశి వారు భవిష్యత్తు గురించి కీలక నిర్ణయం తీసుకుంటారు. కొత్తగా పెట్టుబడిలో పెట్టాలనుకుంటే పెద్ద సలహా తీసుకోవాలి. పిల్లల భవిష్యత్తు కోసం డబ్బులు కూడా పెడతారు. విద్యార్థులను దూర ప్రాంతాలకు పంపాలంటే ఆలోచించాలి. పెండింగ్ సమస్యలను పరిష్కరించుకుంటారు. బంధువుల్లో ఒకరితో వాగ్వాదం ఉంటుంది. జీవిత భాగస్వామితో ప్రయాణాలు చేస్తారు. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈరోజు శుభవార్తలు వింటారు. ఆదాయం పెరగడంతో ఖర్చులు పెరిగిన సమస్య ఉండదు. పిల్లల కెరీర్ కు సంబంధించి శుభవార్తలు వింటారు. ఉద్యోగులు ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ సభ్యులకు కొన్ని వస్తువులను కొనుగోలు చేస్తారు. కొత్త వారితో ఆర్థిక లావాదేవీలు జరిపినట్లైతే వారితో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా అప్పు ఇవ్వాల్సి వస్తే ఆలోచించాలి. వాహనాలపై ప్రయాణించేవారు జాగ్రత్తగా ఉండాలి.

మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వ్యాపారులో ఈరోజు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. అయితే పెద్దల సలహాలతో వాటిని పరిష్కరించుకుంటారు. భాగస్వామితో విభాగాలు ఉంటే వెంటనే పరిష్కరించుకోవాలి. సమస్యలను పెండింగ్లో ఉంచుకోవడం వల్ల అనేక కష్టాలను ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యుల్లో ఒకరి నుంచి శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యుల్లో ఒకరి అనారోగ్యం పై ఆందోళన చెందుతారు.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : వివాహానికి సంబంధించి కొన్ని శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామితో ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తగా ఉండాలి. భవిష్యత్తుపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు పెట్టుబడును పెడితే లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అకస్మాత్తుగా డబ్బులు ఖర్చు అవుతాయి. అందువల్ల సాధ్యమైనంత వరకు ఖర్చులు తగ్గించుకోవాలి.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఆరోగ్యం పై ప్రత్యేకత వహించాలి. ఏ చిన్న అలసట అనిపించినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. పెట్టుబడుల కోసం అప్పులు తీసుకోవాల్సి వస్తుంది. కానీ ఆ పరిస్థితి తెచ్చుకునే ప్రయత్నం చేయవద్దు. ఎందుకంటే ఈ సమయంలో చేసిన అప్పు తిరిగించడం కష్టమవుతుంది. తల్లిదండ్రుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేస్తారు. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. విహారయాత్రలకు వెళ్లి ఎందుకు ప్లాన్ చేస్తారు.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని రకాలుగా శుభప్రదంగా ఉంటుంది. పరుగులకు వివాహ ప్రతిపాదనలు వస్తాయి. పిల్లలతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. విద్యార్థులు ఎంత కష్టమైనా పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగులు తోటి వారితో సంయవనం పాటించాలి. వారితో వాగ్వాదం పెట్టుకుంటే కష్టాలు ఎదుర్కొంటారు. వ్యాపారులకు కొందరు శత్రువులు అడ్డుకట్ట వేస్తారు. అయినా వారిని అధిగమించుకుంటూ ముందుకు వెళ్తారు.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : కుటుంబ సభ్యుల్లో ఒకరి అనారోగ్యం ఉంటుంది. బంధువులను కలవడం వల్ల లాభంగా ఉంటారు. ఉద్యోగులు ఉన్నతాధికారులతో సంప్రదింపులు చేస్తారు. లక్ష్యాలను పూర్తి చేయడంతో ప్రశంసలు అందుకుంటారు. ఈ సమయంలో అధికారులతో ఎటువంటి వాదనలకు దిగకుండా ఉండాలి. సాయంత్రం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈ రోజు స్నేహితులతో ఉల్లాసంగా గడుపుతారు. కుటుంబ సభ్యులకు కస్తూరి చేస్తారు. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. స్నేహితులతో కలిసి ఉయ్యాల యాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా డబ్బులు కూడా పెడతారు. పిల్లల ఖరీదు విషయంపై చిలక నిర్ణయం తీసుకుంటారు. విదేశాల్లో ఉండేవారి నుంచి శుభవార్తలు వింటారు.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈరోజు ఒకరితో కోపంగా ఉండవచ్చు. అయితే మాటలను అదుపులో ఉంచుకోవడమే మంచిది. మందుల నుంచి ధన సహాయ మంధితుంది. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకొని ఖర్చులు పెట్టాలి. కొందరు శత్రువులు వ్యాపారులకు ఇబ్బందులు కలిగిస్తారు. అలాంటివారు ఎదురైనప్పుడు ధైర్యంగా ఎదుర్కొనే శక్తి తెచ్చుకోవాలి. కొత్త భాగస్వాములతో ఎటువంటి ఆర్థిక వ్యవహారాలు జరపొద్దు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈరోజు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. చుట్టూ ఉన్న వాతావరణం ఆహ్లాదంగా ఉండడంతో సంతోషంగా గడుపుతారు. పిల్లల కెరీర్ విషయంలో కీలక సమాచారం అందుకుంటారు. ప్రియమైన వారి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇంటికి చుట్టాల రాధా తో సందడిగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. స్నేహితులను కలవడం వల్ల ఉల్లాసంగా ఉంటారు.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు పదోన్నతులు పొందే అవకాశం ఉంటుంది. వ్యాపారులకు శత్రువుల పెడితే ఎక్కువగా ఉంటుంది. తల్లిదండ్రులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. విదేశాల్లో ఉండే వారి నుంచి శుభవార్తను వింటారు. సాయంత్రం స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. బంధువుల నుంచి తన సహాయం పొందుతారు. వ్యాపారాలు కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే పెద్దలు సలహా తీసుకోవాలి.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : . విదేశాల్లో ఉండేవారి నుంచి వచ్చే సమాచారంతో సంతోషంగా ఉంటారు. ఉద్యోగులు కార్యాలయంలో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. వ్యాపారులకు అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. కొన్ని పనులు ఇష్టమైతేనే చేయాలి. జీవిత భాగస్వామి వద్ద విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరికైనా అప్పులు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఉద్యోగులు అధికారంలో సూచనలను తప్పకుండా పాటించాలి. లేకుంటే వారితో వాగ్వాదం ఏర్పడుతుంది.