‘Today horoscope in telugu ‘: జ్యోతిష శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశరాసులపై చిత్రా నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు ధనలక్ష్మి యోగం ఏర్పడడంతో కొన్ని రాశుల వారికి విశేష ఫలితాలు ఉండాలు ఉన్నాయి. మరి కొన్ని రాశుల వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాసిన ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారు ఈ రోజు చాలా ఉత్సాహంగా ఉంటారు. ఉద్యోగులు గతంలో చేపట్టిన పనులు ఈరోజు పూర్తి చేయడంతో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. పిల్లల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. దూర ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తగా ఉండాలి. వివాహితులు సంతోషంగా గడుపుతారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే రాణించే అవకాశం ఉంది. వ్యాపారులకు మెరుగైన లాభాలు ఉంటాయి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : . ఈ రాశి వారు గతంలో అనారోగ్యంతో ఉంటే నేటితో ఉపశమనం పొందుతారు. వ్యాపారులకు మదనపు లాభాలు ఉంటాయి. కొందరు శత్రువులు అడ్డంకులు సృష్టించిన వాటి నుంచి బయటపడతారు. ఉద్యోగులకు అనుకున్న ఫలితాలు పొందుతారు. సమయం వృధా చేయకుండా చేపట్టిన లక్ష్యాలపై దృష్టి పెట్టాలి. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): . ఈ రాశి వారు ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. కష్టానికి తగిన ఫలితాలు ఉంటాయి. జీవిత భాగస్వామితో సమయాన్ని గడపడానికి విచిస్తారు. కార్యాలయాల్లో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే రాణించే అవకాశం ఉంది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : . ఈ రాశి వారు ఈ రోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మానసికంగా ఒత్తిడి కలిగితే విశ్రాంతి తీసుకోవాలి. స్థాయికి మించిన పనులు చేయవద్దు. ఇతరులకు డబ్బు ఇవ్వకుండా జాగ్రత్తపడాలి. ప్రియమైన వారితో విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే వారితో సంయమనం పాటించడం వల్ల సమస్య పెద్దది కాకుండా ఉంటుంది. జీవిత భాగస్వామితో వాగ్వాదం ఉండే అవకాశం ఉంది.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . ఈ రాశి వారు ఈ రోజు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరిస్థితి అంతంతా మాత్రంగానే ఉంటుంది. ఉద్యోగులు తమ కార్యకలాపాల్లో అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. విదేశాల్లో ఉండేవారి నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈ రోజు డబ్బులు జాగ్రత్తగా కాపాడుకోవాలి. విలాసాలకు ఖర్చు చేయడం వల్ల ధనం తక్కువగా అయ్యే అవకాశం ఉంది. ఇంటికి చుట్టాల రాకతో సందడిగా ఉంటుంది. జీవిత భాగస్వామిని సంతోష పెట్టడానికి ప్రత్యేక వస్తువులను కొనుగోలు చేస్తారు. అనుకోకుండా చేసే ప్రయాణం సంతృప్తికరంగా ఉంటుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా అప్పు ఇవ్వాల్సి వస్తే కాస్త ఆలోచించాలి. ఇతరులతో మాట్లాడేటప్పుడు కోపాన్ని తెచ్చుకోకూడదు. ఉద్యోగులకు పని భారం ఎక్కువగా ఉంటుంది. అయితే సామరస్యంగా వాటిని పూర్తి చేయాలి. కొన్ని పనుల వల్ల అధికారుల నుంచి ప్రశ్నించాలి వస్తాయి. వ్యాపారులు ఊహించిన దాని కంటే ఎక్కువ లాభాలు వస్తాయి.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు కుటుంబంతో సమయం కేటాయించాలి. లేకుంటే విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక రంగాల్లో పాల్గొంటారు. శక్తి సామర్థ్యాలతో వ్యాపారాలను అభివృద్ధి చేసుకుంటారు. ప్రియమైన వారికి దూరంగా ఉండాల్సి వస్తుంది. నీతో మానసికంగా ఆందోళనగా ఉంటారు. విద్యార్థుల కెరియర్ పై ప్రత్యేక దృష్టి పెడతారు. పిల్లల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈ రోజు ప్రతికూల పరిస్థితులను ఎదురుకోవాల్సి వస్తుంది. వ్యాపారులు ఆర్థికంగా ప్రయోజనాలు పొందుతారు. ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఉద్యోగులు తమాశక్తి సామర్ధ్యాలకు మించి కష్టపడి లక్ష్యాలను పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో మాట్లాడే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రశాంతమైన వాతావరణం కోసం ఇతర ప్రదేశాలకు వెళ్తారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈ రోజు ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నాణ్యమైన ఆహారాన్ని మాత్రమే తీసుకునేందుకు ప్రయత్నించాలి. జీవిత భాగస్వామితో వాగ్వాదం ఉండే అవకాశం ఉంది. అందువల్ల మాటలు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో ఏదైనా సమస్య ఉంటే వెంటనే దాని పరిష్కారాం కోసం ప్రయత్నించాలి. వ్యాపారులు లాభాల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారి జీవితం ఈరోజు కాస్త ఆందోళనకరంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు జరిపేవారు జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో ఏదైనా విషయం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి ఉద్యోగులు ఈరోజు కార్యాలయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని విషయాలు అధికారుల నుంచి వేధింపులు ఉండే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో కూడా నిర్లక్ష్యంగా ఉండదు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో గుర్తింపు వస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.