Today 9 August 2025 Horoscope: గ్రహాల మార్పు కారణంగా కొన్ని రాశులపై ప్రభావం పడనుంది. ఇందులో భాగంగా శనివారం ద్వాదశ రాశులపై శ్రవణ నక్షత్ర ప్రభావం పడనుంది. దీంతో కొన్ని రాశుల ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణము ఉండనుంది. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఇంట్లో శుభకార్యం నిర్వహించే అవకాశం ఉన్నందున బిజీగా మారిపోతారు. చుట్టాల రాకతో ఇల్లు సందడిగా మారుతుంది. బంధువులలో ఒకరి నుంచి సమస్యలు ఎదుర్కొంటారు. ఉద్యోగులు అదనపు ఆదాయాన్ని పొందుతారు. ఇంటికి సంబంధించిన కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. వ్యాపారులు రాబోయే రోజులను దృష్టిలో ఉంచుకొని కొత్తగా పెట్టుబడులు పెడతారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : వ్యక్తిగత జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. ఉద్యోగులు తమ కార్యకలాపాలపై దృష్టి పెట్టాలి. లేకుంటే అధికారుల నుంచి ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యాపారులు లాభాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. కొందరు భాగస్వాములు వ్యాపార అభివృద్ధికి అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధించి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారికి ఈరోజు వ్యాపార లాభాలు ఎక్కువగా ఉంటాయి. దూర ప్రయాణాలు చేస్తున్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ సభ్యుల మధ్య చిన్న గొడవలు ఏర్పడే అవకాశం ఉంది. వీటిని వెంటనే పరిష్కరించుకుంటే మంచిది. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. వాటిని నియంత్రించుకునే ప్రయత్నం చేయాలి. జీవిత భాగస్వామితో కలిసి ఈరోజు సంతోషంగా ఉండగలుగుతారు. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : . . ఈ రాశి వారికి ఈ రోజు అనేక విషయాల్లో అనుకూలమైన వాతావరణముంటుంది. కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటే ఇదే మంచి సమయం. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానుబంధాలు పెరిగిపోతాయి. జీవిత భాగస్వామితో ఉల్లాసంగా ఉంటారు. పిల్లల భవిష్యత్తుపై తీసుకునే నిర్ణయంతో అందరూ సంతోషిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొనడానికి ప్రయత్నాలు చేస్తారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. దీంతో బిజీగా మారిపోతారు. అయితే ఉద్యోగులు అవసరమైన ఖర్చులు మాత్రమే చేయాలి. ఈ విషయంలో జీవిత భాగస్వామితో గొడవలు ఉండే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో మౌనంగా ఉండటమే మంచిది. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమయ్యే వారు శుభవార్తలు వింటారు. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారు అదనపు ఆదాయం పొందుతారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . ఈ రాశి వారు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు. పూర్వీకుల ఆస్తికి సంబంధించి శుభవార్త వింటారు. సోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. దీంతో ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఉద్యోగులు కొన్ని పనులు పూర్తి చేయకపోవడంతో అధికారుల నుంచి ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ సమయంలో తోటి వారితో కలిసి లక్ష్యాన్ని పూర్తి చేయగలగాలి. విద్యార్థులకు మద్దతుగా గురువులు ఉంటారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారి ఉద్యోగులకు ఈరోజు అనుకూలమైన వాతావరణం ఉండనుంది. గతంలో చేసిన కొన్ని పనులకు అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. చట్టపరమైన చిక్కుల నుంచి బయటపడతారు. వ్యాపారులకు కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు ఉండడంతో వీరు అధిక లాభాలు పొందుతారు. ఏదైనా పనిని ప్రారంభించేముందు పెద్దల సలహా తీసుకోవడం మంచిది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సివస్తే జాగ్రత్తగా ఉండాలి.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) :. ఈ రాశి వ్యాపారులు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లోని రహస్యాలను వారితో చెప్పకుండా ఉండాలి. కొందరు స్నేహితులు కూడా మోసం చేసే అవకాశం ఉంది. ఉద్యోగులకు వేధింపులు ఉండే అవకాశాలు ఎక్కువ. అయితే అందరితో సంయమనం పాటించాలి. ఏదైనా కార్యక్రమం ప్రారంభించేముందు విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఆరోగ్యం పై దృష్టి పెట్టుకోవాలి.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : . ఈ రాశి వారు ఈరోజు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకునే వ్యాపారులు పెద్దల సలహా తీసుకోవాలి. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. నాణ్యమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. ఎవరైనా ఇబ్బంది కలిగిస్తే వారికి దూరంగా ఉండటమే మంచిది. అనవసరపు వివాదాల్లోకి తలదూర్చకూడదు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : . కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతారు. పిల్లల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఎటైనా ప్రయాణం చేస్తే జాగ్రత్తగా ఉండాలి. లాభాల కోసం వ్యాపారులు కాస్త కష్టపడాల్సి వస్తుంది. కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. రాజకీయాల్లో ఉండే వారికి సమాజంలో గుర్తింపు లభిస్తుంది. మీరు కొత్తగా ఏదైనా పనిని మొదలుపెడితే అనుకున్నట్లుగా పూర్తవుతుంది.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : . విదేశాలకు వెళ్లాలని అనుకునేవారు శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు అదనపు ఆదాయం సమకూరుతుంది. విద్యార్థులకు అనుకూలమైన రోజుగా ఉండనుంది. వీరు ఈరోజు పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. వ్యాపారులు ఆదాయం పెంచుకునేందుకు చేసే ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. వీరికి కుటుంబ సభ్యుల మద్దతు ఉండనుంది.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈ రోజు చాలా ఉల్లాసంగా గడుపుతారు. తమకు ఇష్టమైన వ్యక్తులతో కలిసిమెలిసి ఉంటారు. మీరు చేసే కొన్ని మంచి పనులతో సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగులు అనుకున్న పనిని పూర్తి చేయడానికి కష్టపడతారు. వ్యాపారులకు కొత్త ప్రాజెక్టులు వస్తాయి. ఏదైనా పనిని ప్రారంభించేముందు జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం మంచిది.