Homeఆధ్యాత్మికంToday 7 November 2025 Horoscope: ఈ రాశి వారు కొత్తగా వ్యాపారం ప్రారంభిస్తున్నారా..?

Today 7 November 2025 Horoscope: ఈ రాశి వారు కొత్తగా వ్యాపారం ప్రారంభిస్తున్నారా..?

Today 7 November 2025 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై రోహిణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు కొన్ని రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇదే సమయంలో ఇతరులకు డబ్బు ఇచ్చే విషయంలో ఆలోచించాలి. మరికొన్ని రాశుల వారికి గతంలో కంటే ఇప్పుడు మెరుగైన ఆర్థిక ఫలితాలు ఉంటాయి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఉద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. వ్యాపారులకు శత్రువులు ఉండే అవకాశం ఉంది. అందువల్ల ప్రతి వారిని జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఎవరితోనైనా కొత్తగా వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటే వారితో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఒకే విషయం గురించి ఎక్కువగా ఆలోచించకుండా ముందుకు సాగాలి. సామర్ధ్యాన్ని బట్టి నిరుద్యోగులకు అవకాశాలు వస్తుంటాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటారు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారికి ఈ రోజు అనుకూలమైన ఫలితాలు ఉండనున్నాయి. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఇదే మంచి సమయం. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. మనశ్శాంతి కోసం విహారయాత్రలకు వెళ్తారు. వ్యాపారులకు విజయాలు అందుతాయి. ఊహించని దానికంటే ఎక్కువగా లాభాలు వస్తాయి. ఎవరితోనైనా వాదనలు ఉంటే దూరంగా ఉండటమే మంచిది.

మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి నిరుద్యోగులు ఈరోజు శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు అందుతాయి. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. సోదరులతో కలిసి పూర్వీకుల ఆస్తి విషయంపై చర్చిస్తారు. ఇతరులకు డబ్బు సహాయం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారికి ఈ రోజు అడ్డంకులు తొలగిపోతాయి. దీంతో అనుకున్న దానికంటే ఎక్కువగా ధన లాభం ఉంటుంది. పెండింగ్ సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆగిపోయిన డబ్బు తిరిగి వసూలు అవుతుంది. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. వీరికి గురువుల మద్దతు ఉంటుంది. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఉద్యోగులకు తోటి వారు మోసం చేసే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. తాత్కాలిక ఆనందాల కోసం కొన్ని తప్పులు చేయకుండా ఉండడమే మంచిది. కొందరు పక్కనే ఉంటూ మోసం చేసే అవకాశం ఉంది. అందువల్ల ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈ రోజు శుభవార్తలో అందుకుంటారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణము ఉండడంతో మనశ్శాంతి ఉంటుంది. వ్యాపారులకు కొత్త ప్రాజెక్టులు అందుతాయి. దానధర్మాల కోసం ప్రత్యేకంగా డబ్బులు కేటాయిస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి పిల్లలు సరదాగా ఉంటారు.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు శత్రువుల బెడదను ఎదుర్కోవాల్సి వస్తుంది. అదనపు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఆదాయాన్ని బట్టి ఖర్చులు చేస్తూ ఉండాలి. కొన్ని పనుల కారణంగా బిజీ వాతావరణం లో ఉంటారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వ్యాపారులు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు కొన్ని పనులు పూర్తి చేయడానికి కష్టపడాల్సి వస్తుంది. బంధువుల నుంచి ధన సహాయమందుతుంది. వ్యాపారులు కొత్త ఒప్పందాలను చేసుకుంటారు. ఎవరైనా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకుంటే ఇదే మంచి సమయం. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. కొందరికి పదోన్నతి వచ్చే అవకాశం ఉంటుంది.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి ఈ రోజు సోదరుల నుంచి మద్దతు ఉండే అవకాశం ఉంది. పిల్లల చదువులపై ప్రత్యేకంగా దృష్టి పెడతారు. ఇంటి నిర్మాణం కోసం వస్తువులను కొనుగోలు చేస్తారు. కొత్తగా పెట్టుబడులు పెట్టే వారికి భవిష్యత్తులో లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందర పడొద్దు. పెద్దల సలహాతో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలి. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారి వైవాహిక జీవితం ఈరోజు సంతోషంగా ఉంటుంది. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. అనుకోకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వస్తుంది. ఎవరితోనైనా వాదనలు ఉంటే మాట్లాడకపోవడమే మంచిది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడతాయి. ఇలాంటి సమయంలో మౌనంగా ఉండడమే మంచిది. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వ్యాపారులు ఈరోజు ఊహించని మార్పులు చేసుకుంటారు. గతంలో కంటే ఇప్పుడు ఆదాయం పెరుగుతుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టాలని అనుకునే వారికి ఇదే మంచి సమయం. సమాజంలో గౌరవం లభిస్తుంది. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. జీవిత భాగస్వామితో వాదనలో ఉంటే కోపాన్ని నియంత్రించుకోవాలి.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారి ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. తల్లిదండ్రులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. ఉద్యోగులు కొత్త ప్రాజెక్టులను చేపడతారు. కొన్ని పూర్తి చేయడానికి కష్టపడాల్సి వస్తుంది. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు లాభాలు ఉంటాయి. అయితే ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version