Today 7 January 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై మాఘ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. మరి కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి ఉద్యోగులు ఈరోజు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించడంతో అధికారుల నుంచి ప్రశంసాలు పొందుతారు. వ్యాపారులకు అదనపు ఆదాయం అందుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. బంధువుల నుంచి ధనసహాయం అందుతుంది. కుటుంబ సంబంధాలు బలపడతాయి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈ రోజు ఏ పని చేపట్టిన దానిని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణఉండడంతో కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేయగలుగుతారు. విద్యార్థులకు గురువుల మద్దతు ఉంటుంది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. విద్యార్థుల కెరీర్ పై తల్లిదండ్రులు కీలక నిర్ణయం తీసుకుంటారు. ఎవరికైనా డబ్బులు ఇచ్చే ముందు ఆలోచించాలి.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): వ్యాపారులు కొత్త భాగస్వాములను చేర్చుకోవడం ద్వారా తమ వ్యాపార అభివృద్ధిని చేయగలుగుతారు. అయితే వీరితో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది గతంలో కంటే ఇప్పుడు ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. విదేశాల నుంచి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు ఆఫర్ లెటర్ అందుతుంది.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : . ఈ రాశి వారికి ఈ రోజు అన్ని శుభవార్తలే అందుతాయి. గతంలో కంటే ఇప్పుడు శక్తివంతంగా మారుతారు. చట్టపరమైన చిక్కులు ఉంటే అవి తొలగిపోతాయి. విదేశాలకు వెళ్లాలని ప్రయత్నించే వారికి ముఖ్యమైన సమాచారం అందుతుంది. తల్లిదండ్రుల అండదండలతో విద్యార్థులు పోటీ పరీక్షలు విజయం సాధిస్తారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారి ఆరోగ్యం పట్ల ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు సీనియర్ల నుంచి మద్దతు ఉండడంతో కొన్ని పనులు పూర్తి చేయగలుగుతారు. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెట్టడానికి పెద్దలను సంప్రదిస్తారు. అయితే కొత్తవారితో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . ఈ రాశి వారికి ఈ రోజు సమాజంలో గౌరవం పెరుగుతుంది. దీంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేయగలుగుతారు. వ్యాపారులకు ఘననీయంగా లాభాలు రానున్నాయి. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో పదోన్నతులు వచ్చే అవకాశం ఉంటుంది. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. విద్యార్థుల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు స్నేహితులతో ఈరోజు సంతోషంగా ఉండగలుగుతారు. సమాజంలో గౌరవం ఉండడంతో సంతృప్తిగా ఉంటారు. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి కావడంతో వ్యాపారులు సంతోషంగా గడుపుతారు. వీరికి కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. అయితే గతంలో చేపట్టిన పనులు పూర్తి చేయడానికి కష్టపడాల్సి వస్తుంది.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : . ఈ రాశి వారు కోర్టు సంబంధిత సమస్యలు ఉంటే వాటి నుంచి బయటపడతారు. విద్యార్థులు ఆహ్లాదంగా గడుపుతారు. ఉద్యోగులకు సీనియర్ల మద్దతు ఉండడంతో ముఖ్యమైన పనులు పూర్తి చేయగలుగుతారు. విద్యార్థులు పోటీ పరీక్షల కారణంగా బిజీగా మారిపోతారు. వీరికి గురువుల మద్దతు ఉంటుంది. కుటుంబంతో సంతోషంగా ఉండగలుగుతారు.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) :. ఈ రాశి వారి వైవాహిక జీవితం ఈరోజు సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే పెద్దలను సంప్రదించాలి. ఉద్యోగులు ప్రమోషన్ కోసం తీవ్రంగా కష్టపడాల్సి వస్తుంది. అనుకోకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇలాంటి సమయంలో మనసు ప్రశాంతంగా మారుతుంది.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : . ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థికంగా అనేక ప్రయోజనాలు ఉండనున్నాయి. ఉద్యోగులకు అదనపు ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెడితే వాటి నుంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దలను సంప్రదించడం మంచిది. విద్యార్థులకు తల్లిదండ్రుల మద్దతు ఉండడంతో పోటీ పరీక్షల్లో రాణిస్తారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారి కుటుంబ జీవితం ఈరోజు సంతోషంగా ఉండగలుగుతుంది. కొన్ని పనులు పూర్తి చేయడానికి కష్టమవుతుంది. అయితే తోటి వారి సహకారాన్ని పొందుతారు. ఉద్యోగులు గతంలో కంటే ఇప్పుడు మెరుగైన ఫలితాలు సాధిస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారికి అకస్మాత్తుగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. అయితే కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. సోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. స్నేహితులతో విహారయాత్రలకు వెళ్లి ఎందుకు ప్లాన్ చేస్తారు. ఉద్యోగులకు అదనపు ఆదాయం ఉండడంతో సంతృప్తిగా ఉంటారు.