Today 5 September 2025 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై శ్రవణ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల ఉద్యోగులకు ఈరోజు అదనపు ప్రయోజనాలు ఉండలు ఉన్నాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఏదైనా కొత్త పనిని ప్రారంభించే ముందు పెద్దల సలహా తీసుకోవాలి. లేకుంటే తీవ్ర నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది. వివాదాల్లోకి తలదూర్చకుండా ఉండాలి. ఇంట్లో వివాదాలు ఏర్పడితే వెంటనే పరిష్కరించుకోవాలి. సోదరుల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో కీలక నిర్ణయం తీసుకోవాలి. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : . ఉద్యోగులకు సీనియర్ సభ్యుల మద్దతు ఉండడంతో ఈరోజు అనుకున్న పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగాల కోసం ఎదురుచూసేవారికి ఈరోజు శుభవార్తలు అందుతాయి అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఈ ప్రయాణాలతో వ్యాపారులకు ప్రయోజనాలు ఉండలు ఉన్నాయి. జీవిత భాగస్వామి కోసం ఒక వస్తువును కొనుగోలు చేస్తారు
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): కొన్ని ప్రాజెక్టులను పూర్తి చేయడంతో ఉద్యోగులు ఈరోజు ప్రశంసలు పొందుతారు. మరికొందరికి పదోన్నతులు వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారులో కొత్త వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పెద్దల సలహా పాటించాల్సిన అవసరం ఉంది. విదేశాలకు వెళ్లాలని అనుకునేవారు శుభవార్తలు వింటారు. ఇతరుల వద్ద కొత్త అప్పు చేయడం మంచిది కాదు
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వ్యాపారులకు ఈరోజు శత్రువుల బెడద ఉండే అవకాశం ఉంటుంది. అయితే వీరి నుంచి తట్టుకునేందుకు కాస్త సంయమనం పాటించాలి. ఉద్యోగులు ఎటువంటి పుకార్లను నమ్మకుండా ఉండాలి. అధికారుల నుంచి ఒత్తిడి వస్తే కాస్త ఓపికతో ఉండాలి. స్నేహితుల్లో ఒకరు మోసం చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల ఎవరిని పూర్తిగా నమ్మాల్సిన అవసరం లేదు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈ రోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. బంధువులు ఎవరైనా ఇంటికి వస్తే వారితో వాదనలకు దిగకుండా ఉండాలి. సోదరుల మధ్య ఆస్తికి సంబంధించిన చర్చలు జరుగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెంపొందించుకోవాలి.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈ రోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారులకు శత్రువులు అడ్డంకులు సృష్టిస్తారు. అయితే చాకచక్యంగా వీటి నుంచి బయటపడాలి. ఉద్యోగులు తమ బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేయడం వల్ల అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. కొన్ని విషయాల్లో ఒత్తిడికి గురైతే ఓపికతో ఉండాలి. వ్యాపారులకు గతంలో కంటే ఈరోజు లాభాలు పెరుగుతాయి.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు వ్యాపారానికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగులు తోటి వారితో సంయమనం పాటించాలి. కొన్ని పనులను పూర్తి చేయడానికి వీరి సహాయం ఉంటుంది. నిరుద్యోగులకు ఈరోజు శుభవార్తలు అందే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. విహారయాత్రలకు ప్లాన్ చేస్తారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు విద్యార్థులు అయితే ఈరోజు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయవంతంగా పూర్తి చేస్తారు. ఎటైనా ప్రయాణం చేయాలని అనుకుంటే సొంత వాహనాలపై వెళ్లొద్దు. అనవసరపు వివాదాల్లోకి తల దూర్చడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎప్పటినుంచో అనుకుంటున్నావో కోరిక ఈరోజు నెరవేరుతుంది. జీవిత భాగస్వామి కోసం ఓ వస్తువులు కొనుగోలు చేస్తారు.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈ రోజు డబ్బు విషయంలో అస్సలు రాజీ పడకుండా ఉండాలి. ఇతరుల నుంచి వచ్చే డబ్బును తీసుకునే ప్రయత్నం చేయాలి. కొత్తగా ఎవరికి అప్పులు ఇవ్వద్దు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. వీరిలో చిన్న అనారోగ్యానికి గురైన వెంటనే ఆస్పత్రికి వెళ్లాలి. కొన్ని ఆహారపు అలవాట్లు కారణంగా కాస్త అనారోగ్యానికి గురవుతారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) . ఈ రాశి వారు ఈ రోజు స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పెండింగ్ లో ఉన్న సమస్య పరిష్కరించబడుతుంది. ఆరోగ్య విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండకూడదు. విద్యార్థులకు గురువుల మద్దతు ఉండడంతో పోటీ పరీక్షల్లో రాణిస్తారు. అయితే తల్లిదండ్రులు సైతం ఈ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకోవాలి.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : . ఈ రాశి వారు ఈ రోజు ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వద్దు. ఎందుకంటే ఇవి తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. రాజకీయరంగంలో ఉండే వారికి ఈరోజు ప్రజల మద్దతు ఉంటుంది. అయితే వీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ప్రసంగంలో మాటల మాధుర్యం కనిపించాలి. ఉద్యోగులు కొత్త ప్రాజెక్టు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : . ఈ రాశి వారు ఈ రోజు కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. గతంలో కంటే వ్యాపారులకు ఈరోజు ఆదాయం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మద్దతు ఉండడంతో మరికొందరు వ్యాపారులు లాభాల పంట పండిస్తారు. పెద్దలపట్ల గౌరవంతో ఉండాలి. వారితో కలిసి మెలిసి పనులు చేయాలి.