Homeఆధ్యాత్మికంToday 31 March 2026 Horoscope: ఈ రాశి వ్యాపారులకు ఈరోజు అన్నీ విజయాలే..

Today 31 March 2026 Horoscope: ఈ రాశి వ్యాపారులకు ఈరోజు అన్నీ విజయాలే..

Today 31 March 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశ రాశులపై పూర్వ పాల్గుణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు అందుతాయి. మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారు ఈ రోజు కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉండడంతో పదోన్నతి వచ్చే అవకాశం ఉంటుంది. బ్యాంకింగ్ రంగంలో ఉండేవారు డబ్బు వ్యవహారంలో జాగ్రత్తగా ఉండాలి. వివాహానికి సంబంధించిన కీలక నిర్ణయం తీసుకుంటారు. ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంటుంది. విద్యార్థుల్లో పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : వ్యాపారులకు ఈరోజు అనుకూలంగా ఉండడంతో అధిక లాభాలను పొందుతారు. పెట్టుబడుల విషయంలో నిర్ణయం తీసుకునేటప్పుడు పెద్దలను సంప్రదించడం మంచిది. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. దీంతో అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. ఒక కార్యక్రమంలో పాల్గొంటారు.

మిథున రాశి( మృగశిర 3,4 ): . ఈ రాశి వారు ఈ రోజు లక్ష్యాలను చేరుకుంటారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. బంధువుల నుంచి ధన సహాయం అందుతుంది. కోరికలు నెరవేరడంతో సంతృప్తిగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు పెద్దలను సంప్రదించాలి.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారి కుటుంబ జీవితం ఈరోజు సంతోషంగా ఉంటుంది. పూర్వికులు ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు. తల్లిదండ్రుల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఉద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి. బంధువుల నుంచి శుభవార్తను వింటారు. వ్యాపారాలు శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడులు అనుకూలంగా ఉంటాయి.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారికి ఈ రోజు సానుకూల ఫలితాలు ఉండే అవకాశం ఉంది. దీంతో గతంలో కంటే అధికంగా లాభాలు పొందుతారు. అయితే మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నాణ్యమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇతరుల సలహాలు పాటించవచ్చు.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని శుభ ఫలితాలే ఉండనున్నాయి. ఖర్చులు అవసరమైన మేరకే పెట్టాలి. కొందరి వ్యక్తుల నుంచి ప్రతికూల వాతావరణం ఉండే అవకాశం ఉంది. అందువల్ల ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది. బంధువుల మధ్య విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : . ఈ రాశి వారు ఈ రోజు ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. వ్యాపారిలో కొత్త పెట్టుబడులు పెడతారు. రాజకీయాల్లో ఉండే వారికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగులకు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. విద్యార్థులు చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. పై చదువుల కోసం దూర ప్రయాణాలు చేస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారి మనసు ఈరోజు ప్రశాంతంగా ఉంటుంది. సాయంత్రం కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. వ్యాపారులు ప్రత్యర్థులను ఓడించడంలో సక్సెస్ అవుతారు. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. గతంలో కంటే ఇప్పుడు వ్యాపారాలు అధిక లాభాలు పొందే అవకాశం ఉంటుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు జాగ్రత్తగా ఉండాలి.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగులు కొత్త ప్రాజెక్టులను చేపడతారు. పూర్వీకుల ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. నాణ్యమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. గతంలో కంటే ఇప్పుడు మెరుగైన ఫలితాలు సాధిస్తారు. పెట్టుబడుల విషయంలో పెద్దల ప్రోత్సాహం ఉంటుంది.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు విలువైన వస్తువులు అందే అవకాశం ఉంటుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు. వ్యాపారులకు కొత్త వ్యక్తులు పరిచయమవుతారు వీరితో అనేక లాభాలు ఉంటాయి.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల సహకారం పొందవచ్చు. సమాజంలో గౌరవం లభిస్తుంది. సన్నిహితులను కలవడం వల్ల మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉండే అవకాశం ఉంది. పెండింగు పనులను పూర్తి చేస్తారు.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారికి గతంలో ఉన్న సమస్యల నుంచి ఇప్పుడు పశమనం లభించే అవకాశం ఉంటుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. వ్యాపారులకు లాభాలు ఉంటాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంటుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version