Today 28 March 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై పుష్య నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి శని దేవుడి అనుగ్రహం ఉండడం వల్ల అనుకున్న ఫలితాలు పొందుతారు. మరికొన్ని రాశుల వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారికి ప్రేమను రాగాలు బలపడతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. వ్యాపారులకు అనుకున్న పనులు పూర్తవుతాయి. గతంలో కంటే ఇప్పుడు లాభాలు పెరుగుతాయి. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో ప్రాజెక్టులను సక్సెస్ గా పూర్తి చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈ రోజు కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. నిరుద్యోగులకు ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్లు అందుకుంటారు. ఇరుగుపొరుగు వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. కొత్తగా పెట్టుబడులు పెట్టే వారికి ఇదే మంచి సమయం. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారి కుటుంబ జీవితం ఈరోజు సంతోషంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. శని దేవుడు అనుగ్రహం వల్ల ఉద్యోగులకు సానుకూల ఫలితాలు ఉంటాయి. అధికారుల నుంచి మద్దతు ఉండడంతో పదోన్నతి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెడతారు. అయితే ఇదే సమయంలో పెద్దలను సంప్రదించడం మంచిది.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈ రోజు చురుగ్గా పాల్గొని పూర్తి చేసుకుంటారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. ఎవరికైనా డబ్బు ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం వల్ల ఏ పనులైనా ఆటంకం లేకుండా పూర్తవుతాయి.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారి వైవాహిక జీవితం ఈరోజు సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామి కోసం కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులు కార్యాలయాల్లో తోటి వారితో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులకు ప్రత్యర్థుల బెడద ఉండే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల అండదండలతో కొందరు అధిక లాభాలు పొందుతారు. కొత్త వ్యక్తులను పరిచయం చేసుకునే ముందు జాగ్రత్తగా ఉండాలి.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈ రోజు కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. జీవిత భాగస్వామితో దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. సమాజంలో మంచి పేరు ఉండడం వల్ల కొన్ని పనుల విషయంలో అన్ని శుభ ఫలితాలే ఉంటాయి. కొత్త వస్తువులు కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాజు వారు ఈరోజు సంతోషంగా గడుపుతారు. వ్యాపారులు ఎక్కువగా లాభాలు పొందే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు. ఇంటికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఉద్యోగులు ముఖ్యమైన పనులను పూర్తి చేసుకుంటారు. వ్యాపారులకు తోటి వారి సహాయం ఉండడంతో అనుకున్న పనులను పూర్తి చేస్తారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు లాభాలు వచ్చే అవకాశం ఉంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. స్నేహితుల ద్వారా ధన సహాయం పొందే అవకాశం ఉంది. కొత్తగా పెట్టుబడులు పెట్టే వారికి కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. ఏదైనా వస్తువు కొనుగోలు చేసే విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. వ్యాపారులు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈరోజు దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఈ సమయంలో సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి. ఉద్యోగులు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా డబ్బు ఖర్చయే అవకాశం ఉంది. వ్యాపారులు ఒప్పందం చేసుకునే విషయంలో పెద్దలను సంప్రదించడం మంచిది. కుటుంబ సభ్యుల ఆశీస్సులు పొందితే వ్యాపారులు లాభాలు పొందే అవకాశం ఉంది.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి విద్యార్థులు ఈ రోజు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. వీరికి శని దేవుడి అనుగ్రహం ఉండడం వల్ల అనుకున్న ఫలితాలు పొందుతారు. గతంలో కంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. సంబంధాలు మెరుగుపడతాయి. గతంలో మొదలు పెట్టిన పనులను ఇప్పుడు పూర్తి చేస్తారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈ రోజు కొత్త వ్యక్తులను కలుస్తారు. అయితే వీరితో ఆర్థిక వ్యవహారాలు జరపాల్సి వస్తే జాగ్రత్తగా ఉండాలి. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. కొన్ని ఆగిపోయిన పనులను ఈరోజు పూర్తి చేస్తారు. స్నేహితులతో సరదాగా ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్య అవగాహన ఒప్పందం ఏర్పడుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.