Homeఆధ్యాత్మికంToday 28 December 2025 Horoscope: ఈ రాశి వ్యాపారులు ఈరోజు అదృష్టవంతులు..

Today 28 December 2025 Horoscope: ఈ రాశి వ్యాపారులు ఈరోజు అదృష్టవంతులు..

Today 28 December 2025 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై ఉత్తరాభాద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో ఈరోజు వ్యాపారులకు అదృష్టం వెంటపడుతుంది. ఉద్యోగులకు పదోన్నతులు వచ్చే అవకాశం ఉంటుంది. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈరోజు వారు ఈరోజు కొత్త వ్యక్తులను కలుస్తారు. దీంతో వ్యాపార అభివృద్ధి చెందే అవకాశం. ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే వారికి జీతాలు పెరిగే అవకాశం ఉంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈ రోజు స్నేహితులతో కలిసి విహార యాత్రలకు వెళ్తారు. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు మెరుగైన లాభాలు ఉండే అవకాశం ఉంది. నాణ్యమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. కొత్తగా ఏదైనా పనిని ప్రారంభించే ముందు పెద్దల సలహా తీసుకోవడం మంచిది. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈరోజు వారు ఈరోజు అనుకున్న పనులను పూర్తి చేయగలుగుతారు. వ్యాపారులు కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. కొందరు పనులకు అడ్డంకులు సృష్టించే అవకాశం ఉంది. రాజకీయాలకు అనుకూలమైన వాతావరణం ఉండరుంది. మాటల మాధుర్యంతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. అవసరం వివాదాల్లోకి తల దూర్చొద్దు.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈ రోజు ముఖ్యమైన ప్రయోజనాలను పొందుతారు. వ్యాపారులకు కొత్త వ్యక్తులు పరిచయం కావడంతో అధిక లాభాలు వచ్చే అవకాశం ఉంది. దూర ప్రయాణాలు చేయాల్సివస్తే జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా పెట్టుబడులు పెడతారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈ రోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. ఉద్యోగులకు శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు కాల్ లెటర్ వస్తుంది. కొత్తగా గృహప్రవేశం చేసేందుకు అన్ని రకాలుగా ఏర్పాటు చేసుకుంటారు. వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. దీంతో లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . ఈ రాశి వారు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులను వెంటనే పూర్తి చేయడం మంచిది. కష్టానికి తగిన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులు కొన్ని పనులు పూర్తి చేయడానికి తోటి వారి సహకారం తీసుకుంటారు. ఇతరులకు ధన సహాయం చేస్తారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉండగలుగుతారు. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అయితే సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు వచ్చే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. ఖర్చుల విషయంలో జాగ్రత్తలు ఉండాలి. జల్సా లకు డబ్బు ఖర్చు చేయకుండా ఉండడం మంచిది. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈ రోజు ఆర్థికంగా నిలదొక్కు ఉంటారు. గతంలో ఏర్పడిన నష్టాలను పోల్చుకుంటారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వ్యాపారులకు ఈరోజు కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. గతంలో కంటే ఇప్పుడు లాభాలు పెరిగిపోతాయి. కొత్త వ్యక్తులు కలవడంతో వ్యాపారాన్ని విస్తరిస్తారు. ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి డబ్బు ఇచ్చే ప్రయత్నం చేయొద్దు.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటారు. పాత స్నేహితులను కలవడం వల్ల ఉల్లాసంగా గడుపుతారు. కుటుంబంతో కలిసి దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వాహనాలపై ప్రయాణం చేస్తే జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొందరు పక్కనే ఉండి చీటింగ్ చేసే అవకాశం ఉంటుంది. కొత్త వ్యక్తులతో డబ్బు వ్యవహారాలు జరపకుండా ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడతాయి. ఇలాంటి సమయంలో మౌనంగా ఉండటమే మంచిది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version