Today 26 August 2025 Horoscope: గ్రహాల మార్పుతో కొన్ని రాశులపై ప్రభావం పడుతుంది. ఈ నేపథ్యంలో ఆయా రాశులు కలిగిన వారి జీవితాల్లో అనేక సంఘటనలు జరుగుతాయి. మంగళవారం మేషం నుంచి మీనం వరకు మొత్తం రాసిన ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండగలుగుతారు. పట్టుదలతో పెండింగ్ పనులను పూర్తిచేస్తారు. ఉద్యోగులు గతంలో చేపట్టిన పనులను ఈరోజు పూర్తిచేస్తారు. వ్యాపారులకు ఆశించిన లాభాలు ఉంటాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఆన్లైన్లో పెట్టుబడింది పెట్టిన వారికి లాభాలు ఉంటాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఆర్థిక వ్యవహారాలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులకు ఈరోజు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. చిన్నపాటి ప్రయత్నం చేస్తే ఘనమైన లాభాలు పొందుతారు. ఎవరితో రాజీ పడడానికి ప్రయత్నించవద్దు. ఇతరుల వద్ద డబ్బులు పెండింగ్లో ఉంచవద్దు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారికి ఈ రోజు ఊహించిన దానికంటే ఎక్కువ లాభం ఉంటుంది. ఆదాయం పెరిగిన కొద్ది ఖర్చులు కూడా ఉంటాయి. అయితే దుబారా ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. వీరితో వ్యాపారులు ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగులు అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. వ్యక్తిగతంగా ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : కొన్ని సంవత్సరాల నుంచి బయటపడతారు. విదేశాల్లో ఉండే పిల్లలనుంచి శుభవార్తను వింటారు. ఉద్యోగులు ఈరోజు ఒత్తిడి ఎదుర్కునే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉన్నప్పటికీ ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండకూడదు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటారు. డబ్బు చేతికి రాగానే కొన్ని ఖర్చులు పెడతారు. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కునే అవకాశం ఉంది. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామి పట్టింపులతో కొంత ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. విదేశాల నుంచి శుభవార్తలు వింటారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారికి సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగులు కొంత టెన్షన్ వాతావరణంలో ఉంటారు. అధికారుల నుంచి ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడతారు. అయితే ఈ సమయంలో పెద్దల సలహా తీసుకోవడం మంచిది. వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వ్యాపారాలు కుటుంబ సభ్యుల మద్దతు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వ్యాపారులకు ఈరోజు అనుకున్న లాభాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. పాత మిత్రులు కలవడంతో వారితో సంతోషంగా ఉంటారు. పెళ్లి ప్రయత్నాలు చేస్తారు. ఇంట్లో శుభకార్యం కోసం సందడిగా ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడంతో మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ ఉంచుతారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఎవరికి హామీ ఇవ్వకుండా ఉండాలి. దూర ప్రయాణాల వల్ల లాభాలు జరిగే అవకాశం ఉంది. ఉద్యోగులకు ఒత్తిడి ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. వ్యాపారాలు కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే పెద్దలు సలహా తీసుకోవాలి. జీవిత భాగస్వామితో కలిసి చాటింగ్ చేస్తారు. నిరుద్యోగులకు ఆఫర్ వచ్చే అవకాశం ఉంది.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈ రోజు అదనపు ఆదాయం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. కుటుంబ సభ్యుల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ పెడతారు. పెద్దల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. లాభాల కోసం వ్యాపారం చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వ్యాపారులకు ఈరోజు లాభాలు అధికంగా ఉంటాయి. ఉద్యోగులు కొన్ని లక్ష్యాలను పూర్తి చేయడంతో ప్రశంసలు పొందుతారు. కొందరు పదోన్నతి పొందే అవకాశం కూడా ఉంటుంది. కుటుంబ సభ్యుల కు వస్తువుల కొనుగోలుకు ఖర్చులు చేస్తారు. పిల్లల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. అనవసరపు వస్తువులను కొనుగోలు చేయకుండా ఉండాలి.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వ్యాపారులకు ఈరోజు ఆశ జనకమైన లాభాలు ఉంటాయి. అన్ని రకాల నష్టాలనుంచి బయటపడతారు. ఆరోగ్యం పర్వాలేదు అనిపిస్తుంది. విదేశాల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగులు ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఆస్తి వ్యవహారాల్లో కీలక నిర్ణయం తీసుకుంటారు. కొన్ని పనులు విజయవంతంగా పూర్తి కావడంతో సంతోషంగా ఉంటారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు బంధువుల నుంచి కీలకమైన సమాచారం అందుకుంటారు. చిన్ననాటి స్నేహితులు కలవడంతో ఉల్లాసంగా ఉంటారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వీటితో లాభాలు ఉంటాయి. విద్యార్థుల పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధించడం ఖాయం.