Homeఆధ్యాత్మికంToday 18 April 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి ఈరోజు ధనమే...

Today 18 April 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి ఈరోజు ధనమే ధనం..

Today 18 April 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై అశ్విని నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో ఐదు రాశుల వారికి ఈరోజు ధనమే ధనం. మిగతా రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారు రాజకీయాల్లో ఉన్నట్లయితే వారికి ప్రజా మద్దతు ఎక్కువగా ఉంటుంది. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి పెద్దల ప్రోత్సాహం ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. విద్యార్థుల పోటీ పరీక్షలకు తల్లిదండ్రుల సపోర్ట్ ఉంటుంది. ఆరోగ్యంపై నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు తమ పనులను పూర్తి చేయడానికి కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఉద్యోగులు కార్యాలయాల్లో తోటి వారి సహాయం పొందుతారు. డబ్బు వ్యవహారాలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు కొత్త బాగా స్వాములకు అప్పుడే ఆర్థిక వ్యవహారాలు అప్పజెప్పకూడదు. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడతాయి.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారు ఈరోజు చేసే పనులన్నింటిలో శుభ ఫలితాలు పొందుతారు. ఎవరి దగ్గర నుంచి అయినా అప్పు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తిరిగి చెల్లించే సత్తా ఉండకపోవచ్చు. విద్యార్థులకు గురువుల మద్దతు ఉంటుంది. డబ్బు వ్యవహారం జరిపినప్పుడు కుటుంబ సభ్యుల సహాయం తీసుకోవాలి. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారికి ఈ రోజు ఇంట్లో శుభకరమైన వాతావరణ ఉంటుంది. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. పిల్లల కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. అనుకున్న పనులలో ఒకదానిని నెరవేర్చుకుంటారు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి. ఆరోగ్య విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలి.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారికి ఈ రోజు ఊహించని లాభాలు ఉంటాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమవుతారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. ఎవరి దగ్గర నుంచి అయినా అప్పు తీసుకోవాల్సి వస్తే ఆలోచించాలి. తిరిగి చెల్లించడానికి ఇబ్బందులు ఎదురవుతాయి.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు కొన్ని పనులు పూర్తికాకపోవచ్చు. దీంతో నిరాశ చెందుతారు. అయితే కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో పదోన్నతులు వచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారికి ఈరోజు అన్నీ కలిసి రానున్నాయి. ఆర్థిక వ్యవహారాల్లో అద్భుతమైన ఫలితాలను పొందుతారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. ప్రియమైన వారితో సంతోషంగా గడుపుతారు. గతంలో కంటే ఇప్పుడు ఆరోగ్యం మెరుగుగా ఉంటుంది. గ్రహాలు అన్ని కలిసి రావడంతో గతంలో మొదలు పెట్టిన పనులు ఎప్పుడు పూర్తి చేస్తారు.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : . ఈ రాశి వారికి ఈ రోజు కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు ప్రణాళిక ప్రకారంగా ముందుకు వెళ్లడంతో అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే పెద్దలను సంప్రదించాలి. విదేశాలతో వ్యాపారం చేసేవారికి అధిక లాభాలు ఉంటాయి.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వ్యాపారులకు ఈరోజు ధన లాభం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగులకు అదనపు ఆదాయం చేకూరుతుంది. గతంలో మొదలు పెట్టిన పనులు ఈరోజు పూర్తి చేస్తారు. పిల్లల భవిష్యత్తు గురించి కీలక నిర్వహించడం తీసుకుంటారు. పెద్దల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సివస్తే జాగ్రత్తగా ఉండాలి.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి మద్దతు ఉండడంతో పదోన్నతులు వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని ముఖ్యమైన పనులను ఈరోజు పూర్తి చేయడంతో సంతృప్తిగా ఉంటారు. పెద్దల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు ప్రశంసలు అందుతాయి. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. కొత్త భాగస్వాములను చేర్చుకుంటారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. విద్యార్థులకు కలిసి రావడంతో పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. కొన్ని ముఖ్యమైన పనులను ఈరోజు పూర్తి చేస్తారు.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారి జీవితం ఈరోజు సంతోషంగా గడుస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో మొదలుపెట్టిన ప్రయత్నాలన్నీ సక్సెస్ అవుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. విద్యార్థులకు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం అందుతుంది. వాహనాలపై ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular