Today 17 February 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశ రాశులపై ధనిష్ట నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు సూర్యగ్రహణం సందర్భంగా కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మరి కొన్ని రాశుల వారు సూర్య భగవానుడి ఆశీస్సులతో శుభ ఫలితాలు పొందుతారు. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారు ఈ రోజు శుభవార్తలు వింటారు. వ్యాపారులు కొత్తగా పెట్టుబడును పెడతారు. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారు శుభవార్తలు వింటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఏదైనా వివాదాలు జరిగితే ఓపికతో ఉండాలి. కోపంలో నిర్ణయాలు తీసుకోకూడదు. జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. పెద్దల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈ రోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఇంటికి చుట్టాల రాకతో సందడిగా మారుతుంది. పోటీ పరీక్షలో పాల్గొన్న వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. స్నేహితులతో సరదాగా ఉంటారు. కొత్తగా పెట్టుబడులు పెట్టే ముందు పెద్దలను సంప్రదించడం మంచిది.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి ఉద్యోగులకు ఈరోజు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. పదోన్నతి విషయంలో శుభవార్తలు వినే అవకాశముంది. అయితే వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే పెద్దలను సంప్రదిస్తారు. జీవిత భాగస్వామితో కలిసి వ్యాపారం చేసే వారికి ఈ రోజు లాభాలు ఉంటాయి. ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. అనవసరపు వివాదాల్లోకి తలదురుచకుండా ఉండాలి.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : . ఈ రాశి వారు ఈ రోజు శుభవార్తలు వింటారు. శత్రువుల పట్ల వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలి. కొందరు పక్కనే ఉండి మోసం చేసే అవకాశం ఉంటుంది. స్నేహితుల నుంచి ధన సహాయమందుతుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడతాయి. వీటి నుంచి బయటపడడానికి పరిష్కారం కనుక్కుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . ఈ రాశి వారు ఈ రోజు మెరుగైన లాభాలు పొందనున్నారు. ఉద్యోగులకు తోటి వారి సహకారం ఉండటంతో అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. వ్యాపారులు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. వీటి పరిష్కారం కోసం కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. ఉద్యోగులు అనుకున్న ఆదాయాన్ని పొందుతారు. అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . ఈ రాశి వారికి ఈ రోజు కొత్తగా లాభాలు రానున్నాయి. నిరుద్యోగులకు అవకాశాలు వస్తాయి. కష్టపడిన వారికి తగిన ఫలితం ఉంటుంది. పోటీ పరీక్షలో పాల్గొనే వారికి నిరుత్సాహం కలుగుతుంది. అయితే వీరికి గురువుల మద్దతు ఉండడంతో మరోసారి ప్రయత్నిస్తే విజయం సాధించే అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు కొన్ని సమస్యలలో ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అయితే వీరికి పెద్దల అండ ఉంటుంది. వ్యాపారాలు కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఎదుటివారికి రహస్యాలు చెప్పకుండా ఉండడమే మంచిది.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : . ఈ రాశి వారు ఈ రోజు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. ఉద్యోగులకు ఆదాయం పెరిగే అవకాశం ఉంది. గతంలో చేపట్టిన పనులన్నీ సకాలంలో పూర్తి చేయగలుగుతారు. అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : . ఈ రాశి వారు ఈరోజు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. విద్యార్థుల కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. ఇంటి నిర్మాణానికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు. కొత్త వాహనాలు కొనుగోలు చేయాల్సివస్తే జాగ్రత్తగా ఉండాలి. అప్పుల నుంచి బయటపడి ఎందుకు మార్గం ఏర్పడుతుంది. వ్యాపారులకు కొత్త భాగస్వాములు పరిచయమవుతారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : . ఈ రాశి వారికి ఈ రోజు అనుకూలమైన వాతావరణం ఉండడంతో కొత్తగా పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయి. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన విషయంలో శుభవార్తలు వింటారు. రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెడతారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. దూర ప్రయాణాలు చేసేటప్పుడు సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండడమే మంచిది.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు ఆరోగ్య విషయంలో శ్రద్ధ ఉంచాలి. ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. గతంలో చేపట్టిన పనులు ఈరోజు పూర్తి చేయగలుగుతారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించే వారు అవసరమైన వస్తువులను సమకూర్చుకుంటారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని శుభ ఫలితాలే ఉండనున్నాయి. వ్యాపారులకు కుటుంబ సభ్యులు కలిసి రావడంతో లాభాల పంట పంట పండుతుంది. ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. ఎవరికి డబ్బు ఇచ్చే ప్రయత్నం చేయొద్దు.