Today 15 February 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై ఉత్తరాషాడ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే రోజు మహాశివరాత్రి సందర్భంగా కొన్ని రాశుల వారికి అనుకూలమైన వాతావరణం ఉండి లాభాల పంట పండుతుంది. మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) ఈ రాశి వారికి ఈ రోజు మహాశివుడి ఆశీస్సులు ఉంటాయి. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులకు కలిసి వస్తుంది. పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. వ్యాపారులకు గణనీయమైన లాభాలు ఉంటాయి. ఆరోగ్యం కుదుటపడడంతో ఉత్సాహంగా ఉంటారు. ఉద్యోగులు అనుకున్న పనులను పూర్తి చేస్తారు. దీంతో అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు కొత్తగా వ్యాపారం ప్రారంభించేందుకు సిద్ధమవుతారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు వస్తాయి. ఉద్యోగులకు తోటి వారి సహాయం ఉండడంతో ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. కార్యాలయాల్లో అదనపు బాధ్యతలను చేపడతారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. అనుకోకుండా దూర ప్రయాణం చేయాల్సివస్తుంది.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారికి మహాశివరాత్రి సందర్భంగా శుభ ఫలితాలు జరగనున్నాయి. వ్యాపారులకు అధిక లాభాలు ఉండనున్నాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. నాణ్యమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. బంధువుల నుంచి ధన సహాయమందుతుంది. ఇతరుల వద్ద ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : . ఈ రాశి వారికి గ్రహాల అనుగ్రహం ఉండడంతో అన్ని పనులు పూర్తి చేయగలుగుతారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే రాణిస్తారు. వీరికి గురువుల మద్దతు ఉంటుంది. సోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. పూర్వీకుల ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . ఈ రాశి వారికి సమాజంలో గౌరవం లభిస్తుంది. వ్యాపారులకు మెరుగైన లాభాలు ఉండనున్నాయి. కుటుంబ వాతావరణం సంతోషంగా గడుస్తుంది. ఉద్యోగులు సంతోషకరమైన వార్తలు వింటారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. విద్యార్థులకు తల్లిదండ్రుల మద్దతు ఉండడంతో పోటీ పరీక్షల్లో రాణిస్తారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం ఉండడంతో అనుకున్న పనులను పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా ఉంటారు. వ్యాపారులు గతంలో కంటే ఇప్పుడు మెరుగైన ఫలితాలు సాధిస్తారు. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కొత్తగా పెట్టుబడును పెట్టడానికి ఇదే మంచి సమయం. కుటుంబ సభ్యుల మద్దతు ఉండడంతో వ్యాపారులు లాభాలు పొందుతారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మార్కెటింగ్ రంగంలో ఉండే వారికి ఎక్కువ లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. మహా శివుడి ఆశీస్సులతో ఉద్యోగులు ప్రాజెక్టులను పూర్తిచేస్తారు. దీంతో అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈ రోజు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి కావడంతో మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. కొత్తగా పెట్టుబడులు పెట్టేముందు పెద్దలను సంప్రదించడం మంచిది.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : మీ రాశి వారు పెండింగ్లో ఉన్న పనులను ఈరోజు పూర్తి చేస్తారు. అనేక విషయాల్లో లాభాలు జరగనున్నాయి. విదేశాలకు వెళ్లాలని అనుకునే వారికి ఇదే మంచి తరుణం. ఆరోగ్య విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలి. గతంలో కంటే ఇప్పుడు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు జాగ్రత్తగా ఉండాలి.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : . ఈ రాశి వారు ఈ రోజు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఉండే అవకాశం ఉంటుంది. మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎవరితోనూ అనవసరపు వివాదాల్లోకి తల దూర్చకుండా ఉండాలి. పిల్లలతో కలిసి సరదాగా ఉంటారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు కుటుంబ సభ్యుల ఆశీస్సులతో వ్యాపారులు లాభాలు పొందుతారు. స్నేహితులతో సరదాగా ఉంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఉద్యోగులకు పదోన్నతి విషయంలో శుభవార్తలు అందుతాయి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : . ఈ రాశి వారు ఈ రోజు లక్ష్యాన్ని చేరేందుకు తీవ్రంగా కష్టపడతారు. ఉద్యోగులకు పని భారం ఉంటుంది. అధికారుల నుంచి వేధింపులు ఉంటాయి. కుటుంబానికి తగినంత సమయం కేటాయిస్తారు. కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు.