Today 14 August 2025 Horoscope: గ్రహాల మార్పుతో కొన్ని రాశులపై ప్రభావం పడుతుంది. గురువారం కొన్ని రాశుల ఫలితాల మార్పుతో కొందరు జీవితాల్లో అనుకొని సంఘటనలు జరగనున్నాయి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాసిన ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
Also Read: ‘వార్ 2’ ఫుల్ మూవీ రివ్యూ… హిట్టా..? ఫట్టా..?
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారికి ఈరోజు అన్ని శుభాలే జరుగుతాయి. ఉద్యోగులు గతంలో చేపట్టిన కొన్ని పనులు ఈరోజు పూర్తి చేస్తారు. దీంతో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. అనుకోకుండా వ్యాపారులకు ధన లాభం వస్తుంది. వివాహ ప్రయత్నాలు బిజీగా ఉంటారు. విదేశాలకు వెళ్లేందుకు ఉద్యోగులు ప్రయత్నిస్తారు. అయితే స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : పెండింగ్ సమస్యలను పరిష్కరించుకుంటారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. వ్యాపారులకు అధిక ధన లాభం ఉండనుంది. బంధువుల నుంచి కొన్ని శుభవార్తలు వింటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఊహించని ధన లాభం ఉండరు ఉంది. ఉద్యోగులకు అదనపు ఆదాయం అందుతుంది. వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. పదోన్నతి కోసం ఎదురుచూసే వారికి శుభవార్తలు అందుతాయి. ఆన్లైన్లో పెట్టుబడులు పెట్టే వారికి మంచి పరిణామం. ఉద్యోగం కోసం ఎదురుచూసే వారికి ఒక కంపెనీ నుంచి సమాచారం అందుతుంది.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఆర్థిక లాభాలు పుంజుకుంటాయి. వ్యాపార కార్యకలాపాలు విస్తరిస్తాయి. కుటుంబ జీవితం సంతృప్తికరంగా ఉంటుంది. బంధువుల నుంచి తన సహాయం అందుతుంది. ఓ శుభకార్యంలో పాల్గొంటారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. తోటి వారితో మాట్లాడేటప్పుడు సంయమను పాటించాలి.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . వ్యాపారులకు ఆశించిన లాభాల కంటే ఎక్కువగా వస్తాయి. ఉద్యోగులు అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు పలుస్తాయి. వ్యాపారులు భాగస్వాములతో కలిసి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ విషయంలో తీసుకునే నిర్ణయాలు బెడిసి కొడతాయి. ఆరోగ్యంపై ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఉద్యోగులు అదనపు ఆదాయం గురించి కీలక సమాచారం అందుకుంటారు. మానసికంగా కొన్ని ఒత్తిడిలు ఎదుర్కొంటారు. విద్యార్థుల పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం వారిదే ఉంటుంది. వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. అనుకోకుండా శుభకార్యం లో పాల్గొనాల్సి వస్తుంది. పెద్దల సలహాతో పెట్టుబడులు పెట్టడం మంచిది. దూర ప్రయాణాలు చేయాల్సివస్తే జాగ్రత్తగా ఉండాలి.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : వ్యక్తిగతంగా ఆదాయం పెరుగుతుంది. పెండింగ్ సమస్యల పరిష్కరించుకుంటారు. వ్యాపారులు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో లభిస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. వ్యాపారాలు ఉత్సాహంగా కొత్తగా పెట్టుబడిన పెడతారు. బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) :. అనుకోకుండా ఇంట్లో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అయితే ఇలాంటి సమయంలో కాస్త ఓపికగా ఉండాలి. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఎవరైనా కొన్ని మాటలు చెప్పినప్పుడు వాటిని జాగ్రత్తగా గమనించాలి. అర్హులైన వారికి వివాహం కుదురుతుంది. ఇతరులకు డబ్బు ఇస్తానని మాట ఇవ్వకూడదు. ఉద్యోగుల్లో ఆకస్మిక సమస్యలు ఎదురవుతాయి.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : . కొన్ని పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. దూర ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. అధికారుల అండతో ఉద్యోగులు లక్ష్యాలను పూర్తి చేస్తారు. ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. అనుకున్న స్థాయిలోనే ఆదాయం పెరుగుతుంది. దీంతో వ్యాపారాలు సంతృప్తిగా ఉంటారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈ రోజు బంధువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. డబ్బు విషయం మాట్లాడేటప్పుడు ఎవరికి హామీ ఇవ్వకూడదు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఆర్థిక పరిస్థితి సాధారణంగానే ఉంటుంది. అయితే అదనపు ఆదాయం కోసం ఉద్యోగులు చేసే ప్రయత్నాలు పలిస్తాయి. పోటీ పరీక్షల్లో విజయం కోసం విద్యార్థులు కష్టపడాల్సి వస్తుంది.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : వ్యాపారులకు ఊహించిన దానికంటే ఎక్కువ రాబడి ఉంటుంది. గతంలో కంటే ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. జీవిత భాగస్వామితో వాదనలు ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు శుభవార్తలు వింటారు. ఆగిపోయిన డబ్బు చేతికి అందుతుంది. ఆరోగ్య విషయంలో అత్యధిక శ్రద్ధ తీసుకోవాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఉద్యోగులు అదనపు బాధ్యతలను చేపడుతారు. దీంతో కొత్త ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. వ్యాపారులు లాభాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న సంబంధాలు మెరుగవుతాయి. ఆర్థిక వ్యవహారాలు సవ్యంగా సాగుతాయి.