spot_img
Homeఆధ్యాత్మికంToday 1 April 2026 Horoscope: ఈ రాశుల వ్యాపారులకు ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం.. వద్దన్నా...

Today 1 April 2026 Horoscope: ఈ రాశుల వ్యాపారులకు ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం.. వద్దన్నా డబ్బు..

Today 1 April 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై ఉత్తర పాల్గుణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి గ్రహాల అనుగ్రహం ఉండడంతో అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు. మరికొన్ని రాశుల వారు కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారికి ఈ రోజు మెరుగైన ఫలితాలు ఉంటాయి. గతంలో కంటే ఇప్పుడు వ్యాపారాలు లాభాలు పొందుతారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో పదోన్నతులు వచ్చే అవకాశం ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొనే విజయం సాధిస్తారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు జాగ్రత్తగా ఉండాలి.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారికి ఈ రోజు సమాజంలో గౌరవం లభిస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు ఉండడంతో వ్యాపారులు లాభాలు పొందుతారు. డబ్బు వ్యవహారంలో జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణాలు చేస్తే సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి. కుటుంబ యజమానికి అదనపు బాధ్యతలు ఏర్పడతాయి. ఇలాంటి సమయంలో జాగ్రత్తగా ఉండాలి.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంటుంది. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. స్నేహితులతో విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. గతంలో ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. విద్యార్థుల కోటి పరీక్షలో పాల్గొంటారు. వ్యాపారులకు అండదండలు ఉంటాయి.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉంటుంది. దీంతో అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. కొందరికి పదోన్నతి వచ్చే అవకాశం ఉంటుంది. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంటుంది. ఎవరికైనా డబ్బు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారికి సమాజంలో గౌరవం లభిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. దీంతో కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగులకు కార్యాలయాల్లో తోటి వారి సహకారం ఉంటుంది. అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయడంతో అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. విద్యార్థులకు గురువుల మద్దతు ఉంటుంది.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారి ఈ రోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో కొత్త ప్రాజెక్టులను చేపడతారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. ఎవరితోనూ అనవసరమైన వివాదాల్లోకి తలదూర్చకూడదు.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి విద్యార్థులు ఈరోజు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. కొత్తగా ప్రాజెక్టులను చేపడతారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండడమే మంచిది. డబ్బు వ్యవహారంలో వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈ రోజు శుభవార్తలు వింటారు. బంధువుల నుంచి ధన సహాయం అందుతుంది. విద్యార్థులు పై చదువుల కోసం దూర ప్రయాణాలు చేస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. పూర్వీకుల ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఉద్యోగులు అదనపు ప్రాజెక్టులను చేపడతారు. దీంతో బిజీగా ఉండి అవకాశం ఉంటుంది.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు. వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉండడంతో అధిక లాభాలు పొందుతారు. దూర ప్రయాణాలు చేయడం వల్ల అనుకున్న పనులను పూర్తి చేస్తారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. గతంలో కంటే ఇప్పుడు వ్యాపారాలు ఎక్కువ లాభాలు పొందుతారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో పదోన్నతి వచ్చే అవకాశం ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటారు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి. కొత్తగా పెట్టుబడులు పెట్టేటప్పుడు పెద్దలను సంప్రదించాలి.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాష్ట్ర ఉద్యోగులకు ఈరోజు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అయితే వ్యాపారులు కొత్త భాగస్వాములను చేర్చుకుంటారు. వీరి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంటుంది. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. వ్యాపారులకు ఈరోజు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఇప్పటివరకు ఉన్న సమస్యల నుంచి బయటపడతారు. కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే పెద్దలను సంప్రదించాలి. తల్లిదండ్రుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. పిల్లల కెరీర్ పై కీలక గ నిర్ణయం తీసుకుంటారు. అనవసరపు వివాదాల్లోకి తలదూర్చకుండా ఉండాలి. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular