https://oktelugu.com/

Tirumala : శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు ఇది ముఖ్య గమనిక.. తెలుసుకొని వెళ్లకపోతే మీకే నష్టం

తిరుమలలో ప్రతిరోజు పర్వదినమే. అయితే జనవరిలో వచ్చే వైకుంఠ ద్వార దర్శనం ప్రత్యేకంగా నిలుస్తుంది. ఆ రోజుల్లో లక్షలాదిమంది భక్తులు తిరుమల శ్రీవారి సందర్శనకు వస్తారు. ఈసారి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది టిటిడి.

Written By:
  • Dharma
  • , Updated On : December 18, 2024 / 01:32 PM IST

    Tirumala

    Follow us on

    Tirumala :  కలియుగ వైకుంఠం తిరుమల..వైకుంఠ ఏకాదశి పర్వదినానికి ముస్తాబవుతోంది. 19 వరకు శ్రీనివాసుడి ఉత్తర ద్వారం గుండా దర్శించుకునే భాగ్యం లక్షలాదిమంది భక్తులకు కలగనుంది.దీనికోసం టిటిడి విస్తృత ఏర్పాటు చేస్తోంది.ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే 62,112 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 22,541 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న ఒక్కరోజే హుండీ ద్వారా రూ.3.36 కోట్ల రూపాయల ఆదాయం సమకూరినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 25 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 నుంచి 14 గంటల సమయం పడుతోంది. కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు టీటీడీ సిబ్బంది అన్నప్రసాదాలు,మజ్జిగ,మంచినీరు,అల్పాహారం పంపిణీ చేశారు.

    * కీలక నిర్ణయాలు
    అయితే వైకుంఠ ద్వార దర్శనం సమయం సమీపిస్తుండడంతో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. టీటీడీ కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంది. టోకెన్లు/ టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనాలకు అనుమతిస్తారు.టోకెన్లు లేని భక్తులు తిరుమల వెళ్లొచ్చు కానీ.. శ్రీవారిని దర్శనం చేసుకునే అవకాశం లభించదు. చంటి బిడ్డలు, వృద్ధులు, దివ్యాంగులు, రక్షణ శాఖ, ఎన్నారై మొదలైన విశేష దర్శనాలు ఆ పది రోజులు పాటు రద్దు అవుతాయి.వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాట్లకు సంబంధించి టీటీడీ ఈవో శ్యామలరావు,అదనపు ఈవో వెంకయ్య చౌదరి సమీక్షించారు.టీటీడీలోని అన్ని విభాగాల అధికారులు హాజరయ్యారు. చాలా రకాల నిర్ణయాలు తీసుకున్నారు.

    * ఆ తేదీల్లో టిక్కెట్ల జారీ
    వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి టికెట్ల జారీ ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. ఈనెల 23న ఉదయం 11 గంటలకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి పది రోజుల శ్రీవాణి కోటా కింద టికెట్లను ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. అలాగే 24న ఉదయం 11 గంటలకు ఆ పది రోజుల ఎస్ ఈడీ టికెట్లను సైతం ఆన్లైన్లో విడుదల చేస్తారని తెలుస్తోంది. జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లను సామాన్య భక్తుల కోసం అందుబాటులోకి తీసుకొస్తారు టీటీడీ అధికారులు. ప్రస్తుతం తిరుపతిలో స్లాటెడ్ సర్వదర్శనం టికెట్లను జారీ చేస్తున్న 8 కేంద్రాల్లో టోకెన్ల జారీ ప్రక్రియ ఉంటుంది. కాగా వైకుంఠ ద్వార దర్శనం రోజుల్లో చాలా రకాల సేవలను రద్దు చేశారు. వేద ఆశీర్వచనాలు కూడా రద్దయ్యాయి. కాగా గోవింద మాల భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శన సదుపాయం ఉండదు. అశేష భక్తజనం కోసం తెల్లవారుజాము 6 నుంచి రాత్రి 12 గంటల వరకు నిరంతరాయంగా అన్నప్రసాదాల పంపిణీ ఉంటుంది. ఇంకోవైపు భక్తులకు సంబంధించి లడ్డు ప్రసాదం కొరత లేకుండా ప్రతిరోజు 3.50 లక్షల లడ్డూలను అదనంగా అందుబాటులో ఉంచనున్నారు.