Shri Krishna Janmashtami : ఈ రోజు దేశవ్యాప్తంగా శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను జరుపుకుంటున్నారు. అయితే తిథి, గ్రహాల్లో మార్పులు ఎప్పటికప్పుడు జరుగుతుంటాయి. దీంతో కొన్ని రాశుల వారికి అదృష్టం పడితే.. మరికొన్ని రాశుల వారికి దురదృష్టం పడుతుంది. ఈ అదృష్టం వల్ల ఆనందం, ఆరోగ్యం, సుఖమైన జీవితం లభిస్తుందని చాలామంది నమ్ముతారు. గ్రహాల మార్పులతో సమాజంలో గౌరవం కూడా వస్తుందని అంటారు. అయితే దాదాపు 30 ఏళ్ల తర్వాత ఈరోజు ఓ అద్భుతమైన కాంబినేషన్ రాబోతుంది. దీంతో ఈ రాశుల వారికి రాజయోగం పట్టబోతుందని వేద పండితులు చెబుతున్నారు. ఇంతకీ ఆ రాశులేవో తెలుసుకుందాం.
మేష రాశి
ఈ ఏడాది మేష రాశి వారికి చాలా బాగుంటుంది. రాజయోగం వల్ల సమాజంలో పేరు ప్రతిష్ఠలు ఏర్పడతాయి. అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు. ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. ఆదాయ వనరులు ఎక్కువగా ఏర్పడతాయి. డబ్బుకు కొరత ఉండదు. సుఖాన్ని అనుభవిస్తారు. ఎలాంటి సమస్యలు ఉండవు. సంతోషంగా ఉంటారు. ఏదైనా పని ప్రారంభించిన ఎలాంటి ఆటంకాలు లేకుండా అంతా సవ్యంగా జరుగుతుంది.
వృషభ రాశి
జన్మాష్టమి పండుగ నుంచి వృషభ రాశి వారికి అంతా సక్రమంగా జరుగుతుంది. ఎప్పటి నుంచో అనుకున్న పనులు తీరిపోతాయి. వివాహ సమస్యలతో బాధపడుతున్న వాళ్లు ఈ రోజు శుభవార్తలు వింటారు.
కర్కాటక రాశి
రాజయోగం వల్ల కర్కాటక రాశి వాళ్లకి అదృష్టం రాబోతుంది. అన్ని రంగాల వారికి లాభం వస్తుంది. ముఖ్యంగా ఉద్యోగ, వ్యాపారాల్లో ఆశించిన దాని కంటే ఎక్కువగా లాభాలున్నాయి. ఈ ఏడాది మీరు డబ్బులు ఎక్కువగా ఆదా చేసుకోవచ్చు. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కలలు నెరవేరుతాయి. సమాజంలో మీకు గుర్తింపు లభిస్తుంది. కన్న కలలన్నీ సాకారం అయ్యే సమయం వచ్చింది. జీవితం విలాసవంతంగా ఉంటుంది. దేవుడిపై భక్తి పెరుగుతుంది. మీ సంపద కూడా అకస్మాత్తుగా పెరుగుతుంది.
సింహ రాశి
ఈరోజు నుంచి సింహ రాశి వారికి అదృష్టం పట్టబోతుంది. జీవితంలో సాధించాల్సిన పెద్ద పెద్ద విజయాలు సాకారం అవుతాయి. మీకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంటారు. ఇకపై మీకు సుఖాలకు, సౌకర్యాలకు అసలు లోటు కూడా ఉండదు. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది సరైన సమయం.
కుంభ రాశి
శ్రీ కృష్ణుని ఆశీస్సులతో కుంభ రాశి వారికి ఇకపై అంతా మంచే జరుగుతుంది. డబ్బు, ఆనందంతో చాలా సంతోషంగా ఉంటారు. ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్లకి ఇకపై ఎలాంటి సమస్యలు ఉండవు. ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనుకుంటే ఇకపై సరైన సమయం అని చెప్పవచ్చు. అన్ని విధాలా ఆనందంగా ఉంటారని వేద పండితులు చెబుతున్నారు.