Rashi Phalalu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. డిసెంబర్ 4న సోమవారం ద్వాదశ రాశులపై మాఘ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు ఉండనున్నాయి. 12 రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.
మేషరాశి:
కొన్ని పనుల్లో చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతాయి. అయినా వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగాలి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. పెద్దల సహకారంతో ఒక పని పూర్తవుతుంది.
వృషభం:
స్నేహితుల నుంచి ఒక శుభవార్త వింటారు. బంధువులతో ప్రేమగా మెదలాలి. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
మిథునం:
ఇంతకాలం పెండిగులో ఉన్న ఒక ముఖ్యమైన పనిని పూర్తి చేస్తారు. కొన్నింటిని బాధ్యతాయుతంగా పూర్తి చేయాల్సి ఉంటుంది. వ్యాపారం చేసేవారికి పెట్టుబడులకు అనుకూలం.
కర్కాటకం:
ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఏ విషయంలోనైనా జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుండ సభ్యులతో ఉల్లాంగా గడిపేందుకు ప్రయత్నించాలి.
సింహం:
ఉద్యోగులకు అనుకూలం. కార్యాలయాల్లో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు.దైవానుగ్రహం ఈరోజు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఒత్తిడిలకు తలొగ్గకుండా ముందుకు సాగాలి.
కన్య:
సమస్యలను పరిష్కరించగలుగుతారు. కుటుంబం సభ్యులతో అనుబంధాలను పంచుకుంటారు. వ్యాపారులు పెట్టుబడి విషయంలో ఇతరుల సలహా తీసుకోవడం మంచిది.
తుల:
ఉద్యోగులకు అనుకూలమైన రోజు. కార్యాలయాల్లో పనిచేసేవారికి పదోన్నతి వచ్చే అవకాశం. ఖర్చులను అదుపులో ఉంచాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
వృశ్చికం:
ఈరోజంతా ఉల్లాసంగా ఉంటారు. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎవరితో ఎక్కువగా వాదనలు చేయొద్దు. పెండింగు పనులపై నిర్లక్ష్యంగా ఉండకూడదు.
ధనస్సు:
ముఖ్యమైనవిషయాలపై శ్రద్ధ చూపుతారు. వివాదాల్లో ఇరుక్కునే ప్రమాదం ఉంది. అందువల్ల శత్రువలతో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారం చేసేవారికి మాత్రం అనుకూల సమయం.
మకరం:
బంధుమిత్రుల సహకారంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. సాయంత్రం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వివాదాలకు పోగుండా ప్రేమతో మాట్లాడాలి.
కుంభం:
తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శత్రువులు మీపై ఆధిపత్యానికి ప్రయత్నిస్తారు. అలాంటి వారికి దూరంగా ఉండడమే మంచిది.
మీనం:
సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొన్ని రంగాల వారికి అనుకూల ఫలితారు. దైవానుగ్రహం పొందడానికి ఇష్టమైన దైవాన్ని పూజించండి..