Gold Prices: బంగారం ధరుల రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. సామాన్యుడు పసిడి కొనలేని పరిస్థితి ఏర్పడింది. గత మూడు రోజులుగా వరుసగా ధరలు పెరుగుతుండడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.
బులియన్ మార్కెట్ ప్రకారం.. డిసెంబర్ 5న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,850గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.64,200 గా ఉంది. డిసెంబర్ 2న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.58,450తో విక్రయించారు. సోమవారం కంటే మంగళవారం బంగారం ధరలు రూ.400 పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.59,750 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.63,180గా నమోదైంది. ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.58,850 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.64,200 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.59,750 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.65,180తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.58,850 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.64,200తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.58,850తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.64,200తో విక్రయిస్తున్నారు.
బంగారం ధరలు పెరిగినా వెండి ధరలు స్థిరంగా కొనసాగాయి. మంగళవారం ఓవరాల్ గా కిలో వెండి రూ.80,500గా నమోదైంది. సోమవారంతో పోలిస్తే మంగళవారం వెండి ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.80,500గా ఉంది. ముంబైలో రూ.80,500, చెన్నైలో రూ.83,500, బెంగుళూరులో 79,000, హైదరాబాద్ లో రూ.83,500తో విక్రయిస్తున్నారు.