భారతదేశంలోని కొన్ని ఆలయాలు వేల చరిత్రను కలిగి ఉన్నాయి. ఒకప్పుడు ఆ సమయంలో ఉన్న వాతావరణ పరిస్థితులను ఆధారంగా చేసుకొని నైపుణ్యంతో ఆలయాలు నిర్మించేవారు. దీంతో అవి ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంటున్నాయి. వీటిలో కొన్నింటిలో అద్భుతమైన ఆలయాలు ఉన్నాయి. కొన్ని విషయాల్లో సైన్స్ కు సైతం తెలియని విధంగా నిర్మాణం చేసుకున్నాయి. బీహార్ లోని ఓ రామాయలంలో ఉన్న నీటి కొలనులో నీరు ఎప్పటికీ వేడిగా ఉంటుంది. ఈ నీరు ఇలా ఎందుకు వేడిగా ఉంటుందని ఎన్నో పరిశోధనలు జరిగినా కనుగొనలేకపోయారు. ఇంతకీ ఆ ఆలయం ఎక్కడుందంటే?
బీహార్ లోని సీతాకుండ్ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. ముంగేర్ లో ఉన్న ఈ ఆలయంలో రామాయణం మొత్తం చూడొచ్చు. ఇక్కడ రామాయణానికి సంబంధించిన అనేక ప్రదేశాలు ఉన్నాయి. సీతాదేవి ఇక్కడే అగ్ని పరీక్ష చేసిందని, అందుకే ఈ ప్రదేశాన్ని సీతా కుండ్ అని పిలుస్తారని అంటున్నారు. అయితే ఇక్కడున్న సీతాకుండ్ ఈ ఆలయంలో ఎప్పటికీ నీరు వేడిగా ఉంటుంది. దీంతో ఈ కొలనును పవిత్రంగా భావిస్తారు. ఇందులో నీరు ఎందుకు వేడిగా ఉంటుందని ఎవరూ కనుగొనలేకపోయారు.
సీతాకుండ్ లో ఆకర్షించే అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. ఈ ఆలయంలో మరో నాలుగు కొలనులు ఉన్నాయి. వీటిని రాముడు, లక్ష్మణుడు, భరత్ శత్రజ్ఒ అనే పేర్లతో పిలుస్తారు. అయితే సీతాకుండ్ ఆలయంలో ఉన్న కొలను కంటే మిగతా చెరువులోనీ నీరు మాత్రం చల్లగా ఉంటుంది. చాలా మంది సీతాకుండ్ కొలను వేడి నీరుపై పరిశోధనలు చేశారు. కొంత మంది శాస్త్రవేత్తలు ఇప్పటికీ వచ్చి పరిశోధనలు చేస్తుంటారు. కానీ ఇప్పటీ వరకు ఈ వేడి నీరు విషయాన్ని కనుగొనలేకపోయారు.
కాగా ఈ కొలను పొడవు 20 అడుగులు, 12 అడుగుల లోతు ఉంటుందని చెప్పారు. వసంత కాలంలో సాధారణంగా నీరు చల్లగా ఉంటుంది. కానీ ఈ కొలను నీరు వెచ్చగా ఉండడం గమనార్హం. ఈ ఆలయంలో ప్రతీ ఏడాది మాఘమాసంలో ప్రతీ మాఘమాసంలో ప్రత్యేక జాతర నిర్వహిస్తారు. ఈ సమయంలో భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది. సంక్రాంతి సమయంలో ఈ కొలనులో స్నానం చేయడానికి వస్తుంటారు.