Sravanamasam 2024 : శ్రావణమాసం ఆరంభం.. ఏ రోజు.. ఏ పూజ చేయాలో తెలుసా?

ఇవే కాకుండా ఆగస్టు 16న శుద్ధ ద్వాదశి. ఈరోజు పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం. అందువల్ల ఈరోజు వరలక్ష్మీ వ్రతం నిర్వహించుకుంటారు. ఇక 19న సోమవారం శ్రావణ పౌర్ణమి.

Written By: Chai Muchhata, Updated On : August 5, 2024 10:11 am

Sravanamasam 2024

Follow us on

Sravanamasam 2024 : : హిందూ క్యాలెండర్ ప్రకారం ఆషాఢ మాసం తరువాత వచ్చేది శ్రావణ మాసం.12 తెలుగు మాసాల్లో శ్రావణమాసం ప్రత్యేకమైనది. ఈ మాసంలో పూజలు, వ్రతాలు, నోములు ఉంటాయి. ముఖ్యంగా మహిళలు అత్యంత శ్రద్ధలతో కొన్ని వ్రతాలను ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కొందరు ఈనెల మొత్తం ఉపవాసంగా ఉంటారు. సాత్విక భోజనం చేస్తూ ఆధ్యాత్మిక వాతావరణంలో గడుపుతారు. ఈ ఏడాదిలో శ్రావణమాసం సోమవారం నుంచి ప్రారంభం అయింది. శ్రావణ మాసం కొన్ని కార్యాలకు శుభకరంగా భావిస్తారు. శంకుస్తాపనలు, పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలను ఈ మాసంలో నిర్వహించుకుంటారు. శ్రావణమాసంలో మంచి రోజులు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు శుభకార్యాలు ఈనెలలోనే ఎక్కువగా నిర్వహిస్తారు. శ్రావణ మాసంలో పండుగలు, వ్రతాలు ఎక్కువగా చేస్తారు. ఈ నెలలో ముందుగా నాగపంచమి, ఆ తరువాత వరలక్ష్మీ వత్రం, రాఖీ పండుగ వస్తాయి. ఇదే మాసంలో మంగళ గౌరీ వ్రతం కూడా నిర్వహించుకుంటారు. ప్రతీరోజూ ఉదయం నుంచి సాయంత్రం వకు ఈ నెలలో ఆలయాల్లో నామస్మరణలో మారుమోగుతూ ఉంటాయి. ఆధ్యాత్మిక వాతావరణంలో గడపాలని ఇష్టపడేవారికి ఈ మాసం అనుకూలమైనదిగా చెబుతారు. అంతేకాకుండా కొందరు తీర్థ యాత్రలకు కూడా ఈ మాసంలో చేయడానికి ఇష్టపడుతారు. పుణ్యక్షేత్రాలను దర్శించి తమ కోరికలను నెరవేర్చాలని కోరుకుంటారు. అయితే శ్రావణమాసం అనగానే నాగుల పంచమి, వరలక్ష్మీ వ్రతం, మంగళ గౌరీ వ్రతం మాత్రమే తెలుసు. కానీ ఈ నెలలో ప్రతీ రోజుకు ఒక ప్రత్యేకత ఉందని కొందరు పండితులు చెబుతున్నారు. దీంతో సోమవారం నుంచి శనివారం వరకు పూజలు చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని అంటున్నారు. అయితే ఎలాంటి పూజలు చేయాలో ఒకసారి చూద్దాం..

క్రోధినామ సంవత్సరంలో శ్రావణ మాసం 2024 ఆగస్టు 5 నుంచి ప్రారంభం అవుతుంది. ఈనెలలో మొదటి 15 రోజుల పాటు తిథల ప్రకారం దేవతలకు ప్రత్యేకగా పూజలు నిర్వహిస్తూ ఉంటారు అయితే శ్రావణ మాసం ప్రారంభం చివరి వారాలను మరింత ప్రత్యేకమైన పూజలు చేస్తారు.

ఈ శ్రావణ మాసం సోమవారం నుంచి ప్రారంభం అవుతుంది. అంటే మొదటి రోజు అయినా సోమవారం శుద్ధ పాడ్యమి. ఈ రోజున పరమేశ్వరుడిని పూజించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని కొందరు పండితులు చెబుతున్నారు. శ్రావణ మాసం రెండో రోజు శుద్ధ విది. ఈ రోజు వాసుదేవుడితో పాటు మంగల గౌరీని పూజిచాలి. మూడో రోజు శుద్ద తదియ. ఈ రోజున నార్త్ దేశంలో మధు శ్రావణీవ్రతాన్ని ఆచరిస్తారు. సౌత్ లో మాత్రం విఠలేశ్వరుడిని పూజించాలి. నాలుగో రోజు గురువారం శుద్ధ చవితి. ఈరోజు రాయలసీమ ప్రాంతంలో నాగులకు పూజలు చేస్తారు. అలాగే గురుదేవుడికి పూజలు చేయాలని చెబుతున్నారు.

శ్రావణంలో ఐదో రోజు శుక్రవారం శుద్ధ పంచమి. ఇదే రోజు నాగుల పంచమి, గరుడ పంచమి అని అంటారు. శ్రావణమాసంలో వచ్చే మొదటి పండుగ కూడా ఇదే. ఈరోజు నాగుల పంచమి వేడుకలు నిర్వహిస్తారు. మరోవైపు లక్ష్మీ అమ్మవారిని కొలుస్తారు. శ్రావణ మాసం ఆరో రోజు శనివారం శుద్ధ షష్టి. ఈరోజు వేంకటేశ్వస్వామితో పాటు శనీశ్వరుడికి ప్రత్యేక పూజలు చేస్తారు.

ఇవే కాకుండా ఆగస్టు 16న శుద్ధ ద్వాదశి. ఈరోజు పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం. అందువల్ల ఈరోజు వరలక్ష్మీ వ్రతం నిర్వహించుకుంటారు. ఇక 19న సోమవారం శ్రావణ పౌర్ణమి. ఈరోజు హయగ్రీవ జయంతి. ఈరోజు అన్నా చెల్లెళ్ల బంధం తెలిపే ఈ పండుగ ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇలా శ్రావణమాసం ఆధ్యాత్మిక వాతావరణంలో ఉంటుంది.