Samba Shiva Temple: భారతదేశంలో ప్రాచీన ఆలయాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని ఆలయాలు ఎవరు? ఎప్పుడు నిర్మించారో తెలియని పరిస్థితి. కానీ అవి ఇప్పటికీ ప్రముఖ ఆలయాలుగా కొనసాగుతున్నాయి. అయితే చరిత్రకారులు ఎప్పటికప్పుడు పరిశోధనలు చేసి ఆలయాల చరిత్రను బయటపెడుతున్నారు. ఇలా వీరు చేసిన పరిశోధనలు చూస్తే షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎందుకంటే కొన్ని ఆలయాలు వెయ్యేళ్ల కిందట నిర్మించినట్లు కొన్ని శాసనాల ద్వారా తెలుస్తోంది. మరికొన్ని ఆలయాల నిర్మాణ తీరు, కట్టడ శైలిని బట్టి అవి ఎప్పుడు నిర్మించారో బయటపెడుతున్నారు. ఇలాంటి ఆలయం తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలో ఉంది. ఈ ఆలయం పురాతమైనది మాత్రమే కాకుండా ఇక్కడ కొలువైన శివుడు భక్తులు ఎటువంటి కోరిక కోరినా నెరవేరుస్తున్నాడని స్థానికులు అంటున్నారు. దీనిని వెయ్యేళ్ల కిందట నిర్మించగా ఇప్పుడు శిథిలావస్థకు చేరుకుంటోంది. దీనిని పునర్నిర్మిస్తున్నారు. అయితే ఈ ఆలయ చరిత్రలోకి వెళితే..
తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలోని కొలనుపాక గ్రామంలో ఉన్న సాంబశివాలయం అతి పురాతన క్షేత్రంగా చెప్పవచ్చు. ఇది సాధారణ శివాలయం కాదని, ఇక్కడికి భక్తులు వచ్చి ఎటువంటి కోరికలు కోరినా ఆ శివుడు అనుగ్రహిస్తాడని భక్తులు నమ్ముతారు. అయితే ఈ ఆలయానికి వెయ్యేళ్లకు పైగా చరిత్ర ఉంది. దీనిని దాదాపు 1200 ఏళ్ల కింద కాకతీయులు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఆ కాలంలో రాజకీయ, మతపరమైన కేంద్రంగా ఉండేందుకు దీనిని నిర్మించారని తెలుస్తోంది. ఈ ఆలయం పక్కను నూరు కొలనులు ఉండేవట. అందుకే ఈ గ్రామానికి కొలనూరు అని పేరు వచ్చినట్లు చెబుతున్నారు.
సాధారణంగా ప్రతీ శివాలయంలో లింగంతో సమానంగా పానవట్టం ఉంటుంది. కానీ తెలంగాణలో ఎక్కడా లేని విధంగా ఈ శివాలయంలో అతిపెద్ద పానవట్టాన్ని కలిగి ఉంది. ఈ ఆలయం పురాతనమైనది కావడంతో శిథిలావస్థకు చేరింది. దీంతో ఉప ఆలయంలో శివలింగాన్ని ఉంచి పూజలు నిర్వహిస్తున్నారు. శివుడికి ఒకవైపు అమ్మవారు.. మరోవైపు విఘ్నేశ్వరుడు పూజలు అందుకుంటున్నారు. ప్రతీ అమావాస్య రోజున ఈ ఆలయానికి నాగుపాము వచ్చి శివలింగాన్ని దర్శించుకుంటుందని భక్తులు చెబుతున్నారు. ఏ ఆలయంలోనూ లేని విధంగా ఇక్కడ సప్తమాత్రుక విగ్రహాలు కనిపిస్తాయి. అలాగే పురాతనమైన విఘ్నేశ్వరుడి విగ్రహాన్ని ఇక్కడ చూడొచ్చు.
పండుగలు, పర్వదినాల్లో సాంబశివాలయంలో పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తారు. శివుడికి అభిషేకాలు నిర్వహిస్తారు. సంతానం లేని వారు ఉద్యోగం పొందాలని అనుకునేవారు కొలనూరు సాంబశివాలయానికి వచ్చి స్వామివారిని వేడుకుంటే నెరవేరుతుందని భక్తులు నమ్ముతారు. అందుకే ప్రతీ సోమవారం ఇక్కడికి భక్తులు తరలివస్తారు. అయితే తమ కోరికలు నెరవేర్చాలని శివుడి కంటే ముందు నందీశ్వరుడికి చెప్పడం వల్ల వెంటనే తీరిపోతాయని నమ్ముతున్నారు.
కొలనూరు సాంబశివాలయంలో పురాతమైనది కావడంతో శిథిలావస్థకు చేరింది. ఇలాంటి అపురూప కట్టడాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని గ్రహించి ప్రభుత్వం ఇప్పుడు దీనిని పునర్నిర్మిస్తున్నారు. త్వరలోనే కొత్త రకమైన గుడి భక్తులకు అందుబాటులోకి వస్తుందని అంటున్నారు. ఈ ఆలయానికి చేరుకోవాలంటే పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో ఉన్న కొలనూరు సాంబశివాలయానికి చేరుకోవాలంటే కరీంనగర్ నుంచి సుల్తానాబాద్ కు చేరుకోవాలి. అక్కడి నుంచి క్రాస్ చేసి ఓదెల వైపు వెళ్లే మార్గంలో కొలనూరు గ్రామం వస్తుంది.