సూర్యగ్రహం నక్షత్రం మార్పు.. జూన్ 23 నుంచి ఈ రాశుల వారికి శుభాలే..

సూర్యుడు మృగశిర నుంచి అర్ద్ర నక్షత్రంలోకి మార్పు అవుతున్న క్రమంలో మిథున రాశిపై ప్రభావం పడనుంది. దీంతో ఈ రాశి వారి జీవితంలో అనేక మార్పులు జరనున్నాయి.

Written By: Srinivas, Updated On : June 11, 2024 4:15 pm

Five Grahe horoscope

Follow us on

గ్రహాల మార్పుల్లో సూర్యుడు అత్యంత కీలకంగా వ్యవహరిస్తారు. రాశి చక్రంలో బాగంగా సూర్యుడు జూన్ 23 నుంచి మృగశిర నక్షత్రం నంచి అర్ధ్ర నక్షత్రానికి మారిపోనున్నాడు. ఈ ప్రభావం 5 రాశులపై పడనుంది. దీంతో ఆ రాశుల వారి జీవితాల్లో అనూహ్య మార్పులు రానున్నాయి. వీటిలో తుల, మిథున, సింహంతో పాటు మరో రెండు రాశులు ఉన్నాయి. ఆ రాశులపై ఎలాంటి ప్రభావం ఉందో చూద్దాం.

సూర్యుడు మృగశిర నుంచి అర్ద్ర నక్షత్రంలోకి మార్పు అవుతున్న క్రమంలో మిథున రాశిపై ప్రభావం పడనుంది. దీంతో ఈ రాశి వారి జీవితంలో అనేక మార్పులు జరనున్నాయి. మిథున రాశికి చెందిన ఉద్యోగులు కొత్త ఉద్యోగంలో చేరుతారు. కొత్త అవకాశాలు లభిాస్తాయి. వ్యాపారులు అనూహ్య లాభాలు పొందుతారు. విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారు.

సింహా రాశిపై సూర్యుడి మార్పు ప్రభావం పడనుంది. ఈ సమయంలో ఉద్యోగులకు కార్యాలయంలో మంచి పొజిషన్ ఏర్పడుతుంది. కొందరికి పదోన్నతులు లభిస్తాయి. వివాహితులకు అనుకూల సమయం. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. కటుుంబ జీవితం సంతోషంగా ఉంటుంది.

తులా రాశి వారి జీవితంలో కొత్త మార్పులు కనిపిస్తాయి. జూన్ 23 నుంచి వీరి ఆదాయం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల నుంచి సంతోషకరమైన వార్తలు వింటారు. ఇప్పటి వరకు ఉన్న సమస్యలు తొలగిపోతాయి. కొత్త సంబంధాలు ఏర్పడుతాయి. వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి.

సూర్య సంచారం వల్ల ధనుస్సు రాశిపై ప్రభావం పడతుంది. దీంతో ఈ రాశి వారి జీవితంలో కొన్ని మార్పులు ఉంటాయి. ఉద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు. దీంతో అనుకోని లాభాలు వస్తాయి. అప్పటి వరకు ఉన్న అనారోగ్యం తొలగిపోతుంది.

కుంభ రాశిపై సూర్య సంచార ప్రభావం పడుతుంది. ఈ రాశి వారు ఏ ప్రాజెక్టు చేపట్టినా సక్సెస్ అవుతుంది. అయితే కొన్ని పనులు చేయడానికి కృషి అవసరం. ఒత్తిడి నుంచి దూరమవుతారు. ఆదాయం రెట్టింపు అవుతుంది. ఉన్నత విద్యను చదవాలనుకునేవారికి అవకాశాలు వస్తాయి.