Surya Nakshatra Change 2026 Astrology: గ్రహాల మార్పుతో కొన్ని రాశులపై ప్రభావం పడుతుంది. దీంతో అప్పటివరకు ఉన్న పరిస్థితుల్లో మార్పులు రావచ్చు. అలాగే ఆయా రాశుల వారి జీవితాల్లో కొత్త విషయాలు చూడొచ్చు. గ్రహాలకు అధిపతిగా చెప్పుకునే సూర్యుడు మార్చి 31వ తేదీ నుంచి నక్షత్రం మారనున్నాడు. ఇప్పటివరకు ఉత్తరాభాద్రపద నక్షత్రంలో ఉండగా.. ఇకనుంచి రేవతి నక్షత్రంలోకి వెళ్లనున్నాడు. సూర్యుడు నక్షత్రం మార్పు వల్ల నాలుగు రాశుల వారిపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఈ రాశుల వారికి అప్పటివరకు ఉన్న సంపాదన కంటే అధికం అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబ జీవితం కూడా సంతోషంగా ఉండే అవకాశం ఉంది. సూర్యగ్రహం అనుకూలంగా ఉంటే కొన్ని ముఖ్యమైన పనులు పూర్తయి అవకాశం ఉంటుంది. అయితే సూర్యుడి నక్షత్రం మార్పు వల్ల ఏ రాశులపై ఎలాంటి ప్రభావం పడుతుందో చూద్దాం..
సూర్యగ్రహం నక్షత్రం మారడం వల్ల మేషరాశిపై ప్రభావం పడుతుంది. ఈ రాశి వారు ఉద్యోగ ప్రయత్నాలు చేయాల్సివస్తే సక్సెస్ అవుతారు. ఇప్పటికే ఉద్యోగులు అయితే అదనపు ఆదాయాన్ని పొందేందుకు మార్గము ఏర్పడుతుంది. బంధువులతో సంతోషంగా గడుపుతారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. గతంలో కంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారులు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వీరికి కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది.
ధనస్సు రాశిపై సూర్య గ్రహం ప్రభావం ఉండనుంది. వీరు ఎప్పటికీ డబ్బుతో కనిపిస్తారు. గతంలో కంటే ఇప్పుడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. స్నేహితులతో సరదాగా ఉంటారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వీరు పెట్టుబడుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగులు కొత్త అవకాశాలను పొందుతారు. ఇప్పటివరకు ఉన్న సమస్యల నుంచి బయటపడతారు.
సింహరాశిపై సూర్యగ్రహం మార్పు ప్రభావం ఉంటుంది. దీంతో ఉద్యోగులు అదనపు ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతి వచ్చే అవకాశం ఉంటుంది. సమాజంలో గౌరవం ఉంటుంది. కుటుంబంతో సంతోషంగా ఉండగలుగుతారు. విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. ఉద్యోగుల జీతం పెరిగే అవకాశం ఉంటుంది. కొత్త పనులు ప్రారంభించేటప్పుడు పెద్దలను సంప్రదిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. పై చదువుల కోసం విదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తే సక్సెస్ అవుతుంది.
మకర రాశి వారిపై సూర్యగ్రహ మార్పు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. వీరు ఇప్పటివరకు ఉన్న కష్టాల నుంచి బయటపడతారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించడానికి ఇదే మంచి సమయం. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు. విద్యార్థులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో పోటీ పరీక్షల్లో రాణిస్తారు. కుటుంబ సభ్యులతో దూర ప్రయాణాలు చేస్తారు.