Srirangam: సౌత్ స్టార్ హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అతిథి నిన్న పెళ్లి చేసుకున్నారు. కొంతకాంగా వీరు ప్రేమలో ఉన్నారు. తాజాగా వీరు తెలంగాణ జిల్లాలోని వనపర్తి జిల్లాలోని రంగనాథ స్వామి ఆలయంలో దండలు మార్చుకున్నారు. అయితే వీరు ఈ ఆలయంలోనే ఎందుకు పెళ్లి చేసుకున్నారు? అని కొందరు సందేహం వ్యక్తం చేయగా.. ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉందని, ఉత్తర శ్రీ రంగంగా వెలుగొందుతుందని కొందరు చెబుతున్నారు. దీంతో ఈ ఆలయం గురించి తెలుసుకోవాలని చాలా మందికి ఆసక్తి కలిగింది. ఈ నేపథ్ంయలో ఈ ఆలయం గురించి వివరాల్లోకి వెళితే..
తమిళనాడులోని శ్రీరంగం ఆలయం గురించి అందరికీ తెలుసు. 108 పవిత్ర క్షేత్రాల్లో శ్రీరంగం ఒకటి. సౌత్ టూర్ కు వెళ్లినప్పుడు శ్రీరంగం ఆలయాన్ని తప్పనిసరిగా దర్శిస్తుంటారు. ఇలాంటి ఆలయమే తెలంగాణలోనూ కొలువై ఉంది. ఈ ఆలయం గురించి ఎక్కువగా బయటికి రాకపోవడంతో ఎవరికీ తెలియకుండా మారింది. దాదాపు 500 ఏళ్ల కింద నిర్మాణం జరుపుకున్న ఈ ఆలయంలో శ్రీ రంగనాథ స్వామి కొలువై ఉన్నాడు. అలాగే ఆలయ చరిత్ర చూసిన తరువాత ఒక్కసారైనా చూడాలని కోరుకుంటున్నారు.
15వ శతాబ్దంలో వనపర్తి సంస్థానాధీశుడైన బహిరి అష్టబాషి గోపాలరావు ఈ ఆలయాన్ని కట్టించాడని చెబుతున్నారు. గోపాలరావు తరుచూ తమిళనాడులోని శ్రీరంగ ఆలయానికి తరుచూ వెళ్లి వస్తుండేవారు. ఓ ఏడాది తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో రంగనాథ స్వామిని దర్శించుకోలేదు. దీంతో ఆసమయంలో రాజుగారి కలలో రంగనాథ స్వామి కనిపించి సంకిరెడ్డి పల్లి గ్రామ అడవిలోని పుట్టలో తాను కొలువై ఉంటానని చెప్పాడు. దీంతో మరునాడే వెళ్లిన రాజు స్వామి వారిని బయటకు తీసి అక్కడ ఆలయాన్ని నిర్మించాడట.
అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఆలయ బ్రహ్మోత్సవాలు ఆ సంస్థాన వారసులే నిర్వహిస్తున్నారు. ఈ ఆలయ నిర్మాణానికి తంజావూరు, తిరుచునాపల్లి, కంచి, తిరువనంతపురం నుంచి శిల్పులను తీసుకొచ్చి నిర్మించారట. ఆలయం ఐదు అంతస్తులతో 60 అడుగుల ఎత్తు, 20 అడుగుల ద్వారంతో నిర్మించారు. ఈ ఆలయం చుట్టూ నీరు ఉండాలని నదిలాంటిది తవ్వించారు. వైకుంఠ ఏకాదశి తరువాత పదిరోజుల పాటు ఇక్కడ అధ్యయనోత్సవాలు జరుగుతాయి.