https://oktelugu.com/

Sri Kalahasti: శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయానికి వెళ్ళిన తర్వాత.. నేరుగా ఇంటికి ఎందుకు చేరుకోవాలి?

Sri Kalahasti: కలియుగ దైవంగా పిలవబడే శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. దేశ విదేశాల్లో నుంచి ఈ స్వామివారి దర్శనం కోసం పరితపిస్తూ ఉంటారు. అయితే వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న సమయంలో చుట్టుపక్కల ఆలయాలను కూడా దర్శించుకుంటారు. వీటిలో శ్రీకాళహస్తీశ్వర స్వామి టెంపుల్ కూడా ఒకటి ఉంది. తిరుపతికి సమీపంలో ఉన్న ఈ ఆలయం ప్రత్యేకత చాటుకుంటుంది. అంతేకాకుండా ఈ ఆలయానికి వెళ్లిన తర్వాత.. మరో ఆలయానికి వెళ్లకుండా ఇంటికి చేరుకోవాలని అంటారు. […]

Written By: , Updated On : April 1, 2025 / 12:18 PM IST
srikalahasti temple

srikalahasti temple

Follow us on

Sri Kalahasti: కలియుగ దైవంగా పిలవబడే శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. దేశ విదేశాల్లో నుంచి ఈ స్వామివారి దర్శనం కోసం పరితపిస్తూ ఉంటారు. అయితే వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న సమయంలో చుట్టుపక్కల ఆలయాలను కూడా దర్శించుకుంటారు. వీటిలో శ్రీకాళహస్తీశ్వర స్వామి టెంపుల్ కూడా ఒకటి ఉంది. తిరుపతికి సమీపంలో ఉన్న ఈ ఆలయం ప్రత్యేకత చాటుకుంటుంది. అంతేకాకుండా ఈ ఆలయానికి వెళ్లిన తర్వాత.. మరో ఆలయానికి వెళ్లకుండా ఇంటికి చేరుకోవాలని అంటారు. అసలు అలా ఎందుకు అంటారు? శ్రీకాళహస్తికి వెళ్ళిన తర్వాత ఇంటికి మాత్రమే ఎందుకు చేరుకోవాలి?

ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో ఈ ఆలయం కొలువై ఉంది. ఇక్కడ మహాశివుడు భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు. ఇక్కడ శ్రీ అనే పేరు గల సాలీడు, కాల అనే పేరు గల పాము, హస్తి అనే పేరు గల ఏనుగు అనే మూడిటితో శివలింగం ఏర్పడిందని చరిత్ర తెలుపుతుంది. భారతదేశంలోని అతిపెద్ద దేవాలయాల్లో శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయం ఒకటిగా నిలిచింది. ఇక్కడ మహా శివుడికి రుద్రాభిషేకం, పాలాభిషేకం, పచ్చ కర్పూర అభిషేకం జరుగుతూ ఉంటాయి. మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తూ ఉంటారు.

అయితే తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకుంటారు. ఈ ఆలయం వెళ్లిన తర్వాత నేరుగా ఇంటికే వెళ్లాలని అంటూ ఉంటారు. శ్రీకాళహస్తీశ్వర టెంపుల్ లో పంచభూతాలు అయిన గాలి, నీరు, నిప్పు, నేల, నింగి కలిగిన శివలింగాలు ఇక్కడ ఉన్నాయి. అయితే ఇక్కడున్న గాలి శివలింగం తాగిన తర్వాత మరో ఆలయాన్ని సందర్శించవద్దని కొందరు పండితులు చెబుతున్నారు.

జాతకంలో దోషం ఉన్నవారు.. కుజదోషం కలిగిన వారు.. ఇక్కడున్న రాహు కేతువులకు పూజలు చేయడం వల్ల తొలగిపోతాయని చెబుతూ ఉంటారు. అంటే తమ జాతకంలో ఉన్న దోషాలను ఇక్కడ వదిలేసుకుంటారు. అయితే ఇక్కడ వదిలేసిన తర్వాత మరో ఆలయానికి వెళ్తే అవి అలాగే ఉంటాయని నమ్ముతారు. అందువల్ల ఇక్కడ పూజలు చేసిన తర్వాత నేరుగా ఇంటికి వెళ్లాలని అంటూ ఉంటారు. అలా వెళ్లడం ద్వారా తాము చేసిన పూజలకు ఫలితం ఉంటుందని చెబుతారు.

అలాగే గ్రహణాల సమయంలో దేశంలోని అన్ని ఆలయాలను మూసివేస్తారు. కానీ శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయం మాత్రం తెరిచే ఉంటుంది. అందుకు కూడా కారణం ఉందని అంటున్నారు. గ్రహణం సమయంలో శనీశ్వరుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ ప్రభావం మహాశివుడిపై చూపించదని అంటున్నారు. మహాశివుడికి ఎలాంటి గ్రహణాలు, శని ప్రభావాలు ఉండవు. అందువల్ల సూర్యగ్రహణం, చంద్రగ్రహణం సమయంలో ఇక్కడి ఆలయం తెరిచే ఉంచుతారు. అంతేకాకుండా ఆ సమయంలో ఇక్కడున్న రాహు కేతువులకు ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు.

అయితే శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయం ఎంతో సుందరంగా ఉంటుంది. పురాతన కాలంలో నిర్మించిన ఈ ఆలయం అప్పటి నిర్మాణ శైలిని తెలుపుతుంది. ఇక్కడ ఆలయంలో ఉన్న ఇటుకలపై ఆనాటి లిపిని కూడా చూడవచ్చు. ప్రత్యేక ప్లానింగ్ తో నిర్మించిన ఈ ఆలయం లోని చూడని దర్శించుకున్న తర్వాత ఎన్నో దోషాలు పోతాయని అంటూ ఉంటారు.