https://oktelugu.com/

Mahakumbh Mela  : మహా కుంభమేళాకు ఏపీ నుంచి ప్రత్యేక రైళ్లు.. టైమింగ్స్ అవే!

ఏపీ నుంచి ప్రత్యేక రైళ్లను( special trains ) నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. కుంభమేళా కోసం ప్రత్యేక సర్వీసులు నడపనుంది.

Written By:
  • Neelambaram
  • , Updated On : January 16, 2025 / 10:24 AM IST

    Special Trains From AP

    Follow us on

    Mahakumbh Mela  : మహా కుంభమేళ( Mahakumbh Mela ) 2025 ఘనంగా జరుగుతుంది. అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. రెండో రోజు పండగ వాతావరణం నెలకొంది. మకర సంక్రాంతిని పురస్కరించుకుని లక్షలాదిమంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలను ఆచరిస్తున్నారు. మొక్కులు చెల్లించుకుంటున్నారు. పవిత్ర స్నానాలు ఆచరించడానికి భక్తులు వివిధ మార్గాల్లో ప్రయాగ్ రాజ్ చేరుకుంటున్నారు. దేశవ్యాప్తంగా రైల్వే శాఖ అదనపు రైళ్లను నడుపుతోంది. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల నుంచి ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. అందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే సైతం తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది.

    * మహా కుంభమేళాకు సంబంధించి తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ నుంచి ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది దక్షిణ మధ్య రైల్వే. వాటి రాకపోకలకు సంబంధించి తేదీలను కూడా ప్రకటించింది. గుంటూరు, విజయవాడ,కాకినాడ టౌన్, మచిలీపట్నం నుంచి ప్రయాగ్ రాజ్ మీదుగా వేరువేరు నగరాలకు ఈ రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. గుంటూరు నుంచి అజంగఢ్ వెళ్లే రైలు ఈనెల 24న శుక్రవారం రాత్రి 11 గంటలకు గుంటూరులో బయలుదేరనుంది. ఆదివారం సాయంత్రం 5:15 గంటలకు ఉత్తరప్రదేశ్లోని అజంగఢ్ చేరుకొనుంది. 26 మంగళవారం సాయంత్రం 7:45 గంటలకు అజంగఢ్ నుంచి రైలు బయలుదేరుతుంది. బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు గుంటూరు చేరుకుంటుంది.
    * గుంటూరు నుంచి గయాకు ప్రత్యేక రైలు నడవనుంది. 25 శనివారం మధ్యాహ్నం రెండు 20 గంటలకు గుంటూరులో బయలుదేరుతుంది. సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు గయా కు చేరుకుంటుంది. 27న సోమవారం మధ్యాహ్నం రెండు 15 గంటలకు గయా నుంచి బయలుదేరే ట్రైన్.. గురువారం తెల్లవారుజామున నాలుగు గంటలకు గుంటూరు చేరుకుంటుంది.
    * మచిలీపట్నం అజంగఢ్ ప్రత్యేక రైలు ఫిబ్రవరి 5న బుధవారం రాత్రి 10 గంటలకు మచిలీపట్నంలో బయలుదేరుతుంది. శుక్రవారం సాయంత్రం 5:15 గంటలకు అజంగఢ్ చేరుకుంటుంది. శుక్రవారం సాయంత్రం 7:45 గంటలకు అజంగఢ్ నుంచి బయలుదేరి ట్రైన్ ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు మచిలీపట్నం చేరుకుంటుంది.
    * కాకినాడ టౌన్ నుంచి అజంగఢ్ వెళ్లే ట్రైన్ ఫిబ్రవరి 20 రాత్రి 8 గంటలకు కాకినాడ టౌన్ లో బయలుదేరుతుంది. ఫిబ్రవరి 22న అజంగఢ్ చేరుకుంటుంది. 22 అజంగఢ్ నుంచి బయలుదేరే ట్రైన్ 24 న ఉదయం 7:30 గంటలకు విజయవాడ చేరుకుంటుందని దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు తెలిపారు.