Shani Dev : శనీశ్వరుడు అనగానే చాలామంది భయపడిపోతూ ఉంటారు. ఒకసారి శనిపీడ పట్టిందంటే ఏడేళ్ల వరకు అలాగే ఉంటుంది. శనీశ్వరుడు పట్టిందంటే జీవితంలో అన్ని కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. ప్రతి పనిలో అడ్డంకులు ఏర్పడతాయి. ఆర్థిక బాధలు ఉంటాయి. కుటుంబం ఆందోళనకరంగా ఉంటుంది. దీంతో శనీశ్వరుడు తమపై దయ ఉంచాలని ఎన్నో పూజలు చేస్తూ ఉంటారు. అయితే శనీశ్వరుడికి బదులు ఈ దేవుడికి పూజ చేసిన.. లేక ఆ స్వామిని నిత్యం కలిసినా శనీశ్వరుడు వారిని టచ్ కూడా చేయలేదని జ్యోతిష్య శాస్త్రం తెలుపుతుంది. కొన్ని కారణాలవల్ల ఆ స్వామి పేరు చెప్పగానే శనీశ్వరుడు భయపడిపోతూ ఉంటారని అంటారు. ఇంతకీ ఆ స్వామి ఎవరో తెలుసా?
Also Read : ఈ మూడు రాశులపై శని దేవుడి దయ.. వీరు ఎప్పటికీ విజేతలు గానే ఉంటారు…
ప్రతి మంగళవారం రాగానే గ్రామాల్లో.. పట్టణాల్లో హనుమాన్ ఆలయాలు రామనామ జపంతో మారుమోగుతూ ఉంటాయి. దాదాపు చాలామంది భక్తులు మంగళవారం లేదా శనివారం ఆంజనేయ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. ఆంజనేయ స్వామి అనుగ్రహం ఉండడం వల్ల శనీశ్వరుడు దరి కూడా చేరడని అంటారు. అయితే ఆంజనేయ స్వామికి శని భయపడి పోవడానికి గల కారణం ఏంటి? అసలేంటి ఆ చరిత్ర?
రామాయణంలో రావణాసురుడు విసిరిన బాణాలకు లక్ష్మణుడు మూర్చ పడిపోతాడు. అయితే దిగాలితో ఉన్న రాముడిని చూసి ఆంజనేయుడు సాయం చేయాలని అనుకుంటాడు. అయితే రాముడు ఆదేశం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. దీంతో సంజీవని మొక్క ద్వారా లక్ష్మణుడికి న్యాయం అవుతుందని చెబుతారు. దీంతో సంజీవని మొక్క తెమ్మని రాముడు ఆంజనేయ స్వామికి ఆదేశాలు చేస్తారు. అయితే సంజీవని మొక్క కోసం వెళ్లిన ఆంజనేయస్వామిని అడ్డుకోవాలని శుక్రాచార్యుడు అనుకుంటాడు. ఎందుకంటే సంజీవని మొక్క ఆంజనేయ స్వామి తీసుకువస్తే మళ్ళీ వానర సైన్యం పుట్టుకొస్తుంది. దీంతో దేవతల బలం పెరిగిపోతుందని భావిస్తాడు.
ఈ క్రమంలో శుక్రాచార్యుడు తన శిష్యుడు అయిన శనీశ్వరుడిని ఆంజనేయ స్వామికి అడ్డుగా పంపిస్తాడు. శుక్రాచార్యుడు ఆదేశాల మేరకు శనీశ్వరుడు ఆంజనేయ స్వామిని అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు. తనను శుక్రాచార్యుడు పంపించారని చెప్పి సంజీవని మొక్కను తీసుకెళ్లడానికి వీలులేదని అంటాడు. అయితే సంజీవని మొక్క ఏదో తెలియని ఆంజనేయస్వామి ఆ పర్వతాన్ని ఎత్తుకొని వస్తాడు. ఈ క్రమంలో శనీశ్వరుడుతో యుద్ధం చేయడం ఇష్టం లేక.. రామనామ జపం చేస్తూ ఉంటాడు. ఇదే సమయంలో శనీశ్వరుడిని తన కాళ్లతో తొక్కి పెడతాడు. ఇది భరించలేని శనీశ్వరుడు తనని విడిచిపెట్టమని కోరుతాడు.
అయితే శనీశ్వరుని బాధ చూడలేక ఆంజనేయ స్వామి కొన్ని షరతులను విధించి విడిచిపెడతాడు. తన భక్తులను ఎప్పుడూ పట్టిపీడించరాదని.. రామనామం జపం చేసే వారి వద్దకు వెళ్లకూడదని అంటాడు. ఈ శరత్ కు ఒప్పుకున్న శనీశ్వరుడు తాను కూడా ఓ కోరిక కోరుతాడు. తను ఆంజనేయ స్వామి ఆలయంలో ఉంటానని.. తనకు కూడా అభిషేకాలు చేయించాలని చెప్తాడు. దీనికి ఒప్పుకున్న ఆంజనేయస్వామి అప్పటినుంచి తన ఆలయంలో శనీశ్వరుడు ఉండేలా చూస్తాడు.
అంటే ఆంజనేయస్వామికి వెళ్లినవారు అక్కడ శనీశ్వరుడి విగ్రహం కూడా ఉంటే అభిషేకం చేయాలని పండితులు చెప్తున్నారు. ఇలా చేయడం వల్ల శనీశ్వరుడి బాధ తొలగిపోతుందని అంటున్నారు. అంతేకాకుండా ప్రతి శనివారం శనీశ్వరుడికి ప్రత్యేకంగా పూజలు చేయడం వల్ల ఆ స్వామి అనుగ్రహం పొందవచ్చని అంటున్నారు.