Tamarind tree
Plants: ఇంటి పెరటిలో పచ్చని మొక్కలు (Plants) ఉంటే ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. స్వచ్ఛమైన గాలి (Pure Hair) కూడా ఇంట్లో ఉంటుంది. ప్రస్తుతం జీవనశైలి (habits) మారిపోవడంతో అంతా కూడా కాలుష్యం (Pollution) అయిపోయింది. దీంతో కొందరు ఇంటి పెరటిలోనే కాకుండా బయట కూడా మొక్కలు (Plants) పెంచుతున్నారు. అయితే అన్ని మొక్కలు కూడా ఆరోగ్యానికి మేలు చేయవు. ఇంట్లో అన్ని రకాల మొక్కలను నాటకూడదు. కేవలం కొన్ని మొక్కలను మాత్రమే నాటాలి. ఎందుకంటే కొన్ని మొక్కలను ఇంట్లో ఆవరణంలో పెంచడం వల్ల ప్రతికూల శక్తులకు ఆకర్షణ అవుతుందని పండితులు చెబుతున్నారు. ఇంట్లో కానీ పెరటిలో కొన్ని మొక్కలను పెంచడం వల్ల కుటుంబంలో సమస్యలు వస్తాయి. ఇంట్లో ఎల్లప్పుడూ గొడవలు, ఏ పని కూడా సక్రమంగా చేయలేకపోవడం, తలపెట్టిన ప్రతీ పనిలో కూడా ఆటంకం ఏర్పడుతుంది. సంపాదించినా డబ్బు అంతా కూడా నీరులా ఖర్చు అవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే జీవితమే నాశనం అయిపోతుందని పండితులు చెబుతున్నారు. అయితే ఇంటి ఆవరణంలో పెంచకూడని ఆ మొక్కలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
చింత చెట్టు
చాలా మంది నీడ లేదా చింత కోసం ఇంటి పెరటిలో నాటుతుంటారు. అయితే దీన్ని నాటడం వల్ల ఇంటి చుట్టూ ఎక్కువగా దెయ్యాలు ఉంటాయని భావిస్తారు. అలాగే ఇంట్లో కూడా సమస్యలు ఎక్కువ అవుతాయి. సంతోషంగా ఉండాలంటే ఇంట్లో ఈ మొక్కను పెంచవద్దు.
రబ్బరు మొక్క
కొందరు అందం కోసం రబ్బరు మొక్కను ఇంట్లో పెంచుతారు. దీన్ని ఇంట్లో పెంచడం వల్ల నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది. దీంతో ఏ పని తలపెట్టినా కూడా ఆటంకాలు ఏర్పడతాయి. ఎల్లప్పుడు ఇంట్లో కష్టాలు ఏర్పడతాయి. అసలు సంతోషమే ఉండదు. కాబట్టి రబ్బరు మొక్కను ఇంట్లో ఉంచవద్దు.
బ్రహ్మజెముడు
ఇంటి ఆవరణంలో బ్రహ్మజెముడు మొక్కలను నాటకూడదని పండితులు అంటున్నారు. ఎందుకంటే ఈ మొక్కను ఇంట్లో లేదా ఆవరణంలో నాటడం వల్ల కుటుంబంలో కలహాలు వస్తాయని చెబుతున్నారు. ఎంత సంతోషంగా ఉందామని అనుకున్నా కూడా ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. ఇంట్లో ఏదో విధంగా గొడవలు పెరుగుతూనే ఉంటాయి. అసలు సంతోషమే ఉండదు. కాబట్టి ఈ మొక్కను ఇంట్లో పెంచవద్దు.
తుమ్మ చెట్టు
ఇంటి ఆవరణంలో తుమ్మ చెట్టును ఉంచడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు పెరిగిపోతాయి. డబ్బు ఎంత సంపాదించినా కూడా ఇంట్లో ఉండదు. అలాగే కుటుంబంలో అనారోగ్య బాధలు ఎక్కువ అవుతాయి. ఈ చెట్టును ఇంట్లో పెంచకపోవడం ఉత్తమం.
ముళ్లు మొక్కలు
కొందరు అందం కోసం ముళ్ల మొక్కలను పెడుతుంటారు. అయితే వీటి వల్ల ఇంట్లో అసౌకర్య వాతావరణం ఉంటుంది. ప్రతికూల శక్తులు ఉంటాయని చాలా మంది భావిస్తారు. ఇలాంటి మొక్కలను ఇంట్లో పెంచడం వల్ల ఎల్లప్పుడూ కూడా అనారోగ్య సమస్యలు వస్తాయని పండితులు అంటున్నారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది.