Bathukamma 2024: తెలంగాణలో ముఖ్యమైన పండుగ బతుకమ్మ. రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మ వేడుకలు ఈ ఏడాది బుధవారం(అక్టోబర్ 2న) ప్రారంభమయ్యాయి. చిన్న పెద్ద తేడా లేకుండా ఆడపడచులంతా జరుపుకునే పండుగ. పూలనే అమ్మవారిగా పూజించే పండుగలో భాగంగా ప్రతీ ఇల్లు పూల రంగులతో కళకళలాడుతున్నాయి. ఎటు చూసినా జానపద గీతాల సందడులే. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మకు ప్రజలంతా స్వాగతం పలికారు. సాయంత్రం కూడళ్లలో బతుకమ్మలను ఉంచి ఆడిపారు. ఇక రెండో రోజు గురువారం(అక్టోబర్ 3న) నుంచి దేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇక పూల పండుగలో భాగంగా రెండో రోజు గురువారం అటుకుల బతుకమ్మను తయారు చేస్తారు. ఈ నేపథ్యంలో అటుకుల బతుకమ్మ ప్రత్యేకత, అమ్మవారికి సమర్పించే నైవేద్యం గురించి తెలుసుకుందాం. బతుకమ్మ పూలలో ప్రధానమైన గునుగు, తంగేడు, బంతి, చామంతి, గుమ్మడి, బీర, కట్ల పూలతో అటుకుల బతుకమ్మను తీర్చిదిద్దుతారు. గౌరమ్మ పాటలతో పూలను కీర్తిస్తారు. అయితే అటుకుల బతుకమ్మ పండుగను చిన్నారులే ఎక్కువగా చేసుకుంటారు. పిల్లలు అటుకులు, పప్పులు, బెల్లం నైవేద్యంగా అమ్మవారికి సమర్పిస్తారు. సాయంత్రం బతుకమ్మ ఆట పూర్తయ్యాక ప్రసాదంగా స్వీకరిస్తారు.
9 రోజులు.. 9 రకాల బతుకమ్మలు..
ఇక బతుకమ్మ వేడుకలు తొమ్మిది రోజులు సాగుతాయి. తొమ్మిది రోజులు బతుకమ్మను తొమ్మిది రకాలుగా తయారుచేస్తారు. పూల పండుగ జరుపుకుంటారు. రకరకాల పాటలు పాడుతూ బతుకమ్మ ఆడతారు. పూలను కీర్తిస్తాను. బంధాలు, అనుబంధాలను గుర్తుచేసే పాటలను పాడుతారు. ఇటీవలి కాలంలో కోలాటం, దాండియా ఆటలు కూడా బతుకమ్మ వేడుకల్లో కీలకంగా మారాయి. పట్టణాల్లో డీజే పాటలకు యువతులు స్టెప్పులు వేస్తున్నారు. తొమ్మిదో రోజు నిర్వహించే సద్దుల బతుకమ్మ వేడుకలను వైభవంగా నిర్వహిస్తారు. పెద్ద బతుకమ్మ పండుగగా పిలుస్తారు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: On the second day atukula bathukamma do you know what is special and special
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com