Gita Jayanti: ప్రతి హిందువు భగవద్గీత గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలని కొందరు పండితులు చెబుతూ ఉంటారు. కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతను ఉపదేశించాడు. దీనినే భగవద్ఘీత అంటారు. జీవిత మోక్ష మార్గం, తత్వ శాస్త్రం, కర్మ తదితర విషయాలను ఈ గీత ద్వారా తెలియజెప్పాడు. అయితే కొన్నేళ్లుగా చాలా మంది భగవద్గీత పఠనం చేస్తూ మోక్ష మార్గంలో వెళ్తున్నారు. అయితే నేటి కాలంలో చాలా మంది బిజీ లైఫ్ కారణంగా దీనిని పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన గీత రోజున గీత జయంతిని నిర్వహిస్తూ వస్తున్నారు. గీత జయంతి రోజున ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అయితే ఈరోజు కొన్ని పనులు చేయడం వల్ల శుభ ఫలితాలు ఉంటాయని పంచాంగం చెబుతోంది. అదేంటంటే?
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి మార్గశిర మాసంలో గీత జయంతిని నిర్వహించుకుంటారు. 2024 సంవత్సరంలో డిసెంబర్ 11న గత జయంతిని నిర్వహించుకోనున్నారు. డిసెంబర్ 11న ఉదయం 3.42 గంటలకు తిథి ప్రారంభం కానుంది. ఆ తరువాత డిసెంబర్ 12న తెల్లవారుజామున 1.09 గంటలకు ముగుస్తుంది. అందువల్ల డిసెంబర్ 11నే గత జయంతిని నిర్వహిస్తారు. ప్రతీ మార్గశిర మాసంలోని శుక్లపక్షం రోజున గత జయంతి నిర్వహిస్తూ వస్తున్నారు.
కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు బోధించిన భగవద్గీతను చదవడం వల్ల జీవితానికి సంబంధించిన అనేక విషయాలు తెలుసుకుంటూ ఉంటారు. ప్రతి మనిషి తన జీవితం బాగుండాలని ఏవేవో తప్పులు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా కొందరు స్వార్థ బుద్ధితో పనులు చేయడం వల్ల తాత్కాలికంగా వారు ఆనందం పొందినా.. ఆ తరువాత కష్టాలను ఎదుర్కొంటారు. అయితే గీత సారాంశం తెలుసుకోవడం వల్ల మనుషుతు తమ జీవితాలను సక్రమ మార్గంలో నడిపించుకుంటారు. శాంతితో మెదులుతూ సహానాన్ని అలవరుచుకుంటారు. గీత అధ్యయనం ద్వారా ఆధ్యాత్మికత పెంపొందుతుంది. భగవంతునితో అనుసంధానం అయ్యే మార్గం దొరుకుతుంది. అందువల్ల ప్రతి రోజూ కాకపోయినా కనీసం గీత జయంతి రోజున గీత సారాంశం తెలుసుకోవాలని పండితులు చెబుతున్నారు.
అయితే గీత జయంతి రోజున కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు చేయడం వల్ల జీవితం ఆనందంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం తెలుపుతుంది. ఈరోజు తప్పనిసరిగా గీతా పారాయణం చేయాలి. దీంతో జీవితంలో ఎవరైనా కష్టాలను ఎదుర్కొంటే వాటి నుంచి బయటపడడానికి గీత మార్గం చూపుతుంది. ఈరోజు తప్పనిసరిగా శ్రీకృష్ణుడిని ఆరాధించాలి. సూర్యోదయానికి ముందే స్నానం చేసిన తరువాత శ్రీకృష్ణుడి చిత్రపటం వద్ద దీపం వెలిగించి, దూపం, పువ్వులు వేసి పూజలు చేయాలి. ఈరోజంతా నియమ నిష్టలతో ఉండాలి. గీత జయంతి రోజున ఉపవాసం ఉండడం వల్ల శ్రీకృష్ణుడి అనుగ్రహం తప్పకుండా ఉంటుందని చెబుతున్నారు.
అలాగే ఈరోజు ఉపవాసం చేయడానికి వీలు లేని వారు సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. శరీరం, మనస్సు దైవ చింతన కలిగి ఉంటే ఆరోగ్యంగా ఉండగలుగుతారు. సాధ్యమైనంత వరకు ఇతరులకు దానం చేయాలి. మిగతా రోజుల్లో కంటే ఈరోజు దానం చేయడం వల్ల శ్రీకృష్ణుడి అనుగ్రహం పొందే అవకాశం ఉంటుంది. ఓ వైపు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూనే ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అనే మంత్రాన్ని జపించాలి. ఇలా చేయడం వల్ల ఆ భగవానుడు వారి వెంటే ఉంటారని అంటారు.