Numerology: ఈ తేదీన పుట్టిన వారు ఆవేశంతో రగిలిపోతారు.. ఎందుకంటే?

న్యూమరాలజీ ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ లోని కొన్ని నెంబర్ల ద్వారా వ్యక్తుల గుణ గణాలు, లక్షణాలను తెలుసుకోవచ్చు. వారి ప్రవర్తన ఎలా ఉంటుందో ముందే తెలుసుకోవచ్చు. వీటిలో కొందరు 9వ తేదీన పుట్టిన వారు భిన్నంగా ఉంటారు.

Written By: Srinivas, Updated On : April 26, 2024 3:15 pm

Numerology

Follow us on

Numerology:  జీవితం బాగుండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇందుకోసం రోజూవారీ కార్యక్రమాలే కాకుండా ప్రత్యేకంగా దేవుళ్లను కొలుస్తూ కష్టాల నుంచి తప్పించమని అడుగుతారు. ఇదే సమయంలో న్యూమరాలజీకి సైతం జీవితాన్ని మార్చేశక్తి ఉంటుందని కొందరు చెబుతూ ఉంటారు. న్యూమరాలజీ ప్రకారం కొన్ని నెంబర్లు కలిగిన వారు తమ జీవితం బాగుండకపోతే కొత్త నెంబర్ ను యాడ్ చేసి జీవితాన్ని సంతోషమయంగా మార్చుకోవచ్చని అంటారు. ఒక వ్యక్తి పుట్టిన తేదీకి సంబంధించిన తేదీలను కలిపితే వచ్చే అంకెను పాత్ నెంబర్ అంటారు. దీని ద్వారా వ్యక్తి గుణగణాలు తెలుసుకోవచ్చు. అయితే పుట్టిన తేదీని బట్టి వారి వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

న్యూమరాలజీ ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ లోని కొన్ని నెంబర్ల ద్వారా వ్యక్తుల గుణ గణాలు, లక్షణాలను తెలుసుకోవచ్చు. వారి ప్రవర్తన ఎలా ఉంటుందో ముందే తెలుసుకోవచ్చు. వీటిలో కొందరు 9వ తేదీన పుట్టిన వారు భిన్నంగా ఉంటారు. ఈ తేదీన జన్మంచిన వారు కోపంతో ఊగిపోతారు. నిత్యం ఎమోషనల్ తో ఉంటారు. సమాజంలో జరిగే పరిస్థితులపై ఎక్కువగా ప్రభావవంతులవుతారు.

ఏ నెలలో అయినా 18న పుట్టిన వారు ఉద్రేకంగా ఉంటారు. 1,8 నెంబర్లు ఇండిపెండెంటును కలిగి ఉంటాయి. ఈ రెండు నెంబర్లు వ్యక్తులకు చికాకు, కోపాన్ని తెప్పిస్తాయి. ఈ కాంబినేషన్ నెంబర్ ఉన్న వారు కొన్ని అదనపు కష్టాలను ఎదుర్కొంటారు. ప్రతీ చిన్న విషయానికి వీరి రియాక్ట్ అవుతారు.

న్యూమరాలజీ ప్రకారం 7వ నెంబర్ ప్రేమను చూపిస్తుంది. 2వ నెంబర్ దగయల గుణం కలిగి ఉంటుంది. కానీ 27వ తేదీన జన్మించిన వారు మాత్రం కోపంతో రగిలిపోతారు. అంతర్గత సమస్యలపై ఎక్కువగా స్పందిస్తూ ఆవేశంతో ఉంటారు. సెన్సిటివ్ గా ఉంటూ ఇతరుల వల్ల ఇబ్బంది పడుతారు. వీటితో పాటు 30వ తేదీన జన్మించిన వారు వినూత్న పద్ధతుల్లో ఆవేశంతో రగిలిపోతుంటారు. ఈ నెంబర్ల కలయిక వల్ల నిరాశతో కలిగి ఉంటారు.