Narmada Nadi Pushkaralu 2024: నదీజలంలో స్నానం ఎంతో పుణ్యం. మానవుడు చేసిన పాపాలను తొలగించుకునేందుకు అప్పుడప్పుడు నదీ స్నానం చేయాలని కొందరు పండితులు చెబుతారు. ఇక పుష్కర సమయంలో నదీస్నానం చేయడం ఎంతో మంచిదని అంటారు. అందుకే పుష్కారాల సమయంలో భక్తులు నదీ స్నానం చేయడానికి తరలివస్తారు. పుష్కరం అంటే 12 ఏళ్లు. ప్రతీ నదీకి 12 సంవత్సరాలకొకసారి పుష్కరాలు జరుగుతూ ఉంటాయి. పుష్కరాల సమయంలో నదిలో కోటి దేవతలు ఉంటారని మానవులకు పాపాలను తొలగించేందుకు వారు సహకరిస్తారని చెబుతారు. ప్రస్తుతం నర్మదానది పుష్కరాలు మే 1 నుంచి ప్రారంభం అయ్యాయి. ఈ నదీ ఆవశ్యకత, పుష్కరాల్లో పాటించే పద్ధతుల గురించి తెలుసుకుందాం..
మనుషులకు పట్టిన మలినాన్ని కడ్డుక్కోవడానికి నీరే ఆధారం. ఈ నీరు నదీది అయితే ఎంతో మంచింది. పూర్వకాలంలో పుష్కరుడు అనే దేవుడు బ్రహ్మ కోసం తపస్సు చేసి తనకు ఒక పవిత్రమైన క్షేత్రాన్ని ప్రసాదించాలని కోరుతాడు. దీంతో బ్రహ్మ కరుణించి గ్రహాలకు గురువైనా బృహస్పతి ఒక్కో రాశిలో ప్రవేశించిన సమయంలో ఆ రాశిని తనకు అనుసంధానమైన నదిలో ఏడాది పాటు ఉండాలని చెబుతాడు. ప్రస్తుతం బృహస్పతి వృషభ రాశిలో ప్రవేశించాడు. దీంతో 2024 సంవత్సరంలో నర్మదా నదిలో పుష్కరుడు ఉన్నాడని అర్థం.
భారతదేశంలోని మధ్యప్రదేశ్ లోని మర్ కంఠక్ లో నర్మదా నది నడక మొదలవుతుంది. ఆ తరువాత ఛత్తీస్ గఢ్, మమారాష్ట్ర, గుజరాత్ గుండా వెళ్లి సూరత్ తరువాత అరేబియా సముద్రంలో కలుస్తుంది. నర్మదానదిలో స్నానం చేయాలనుకునేవారు అమర్ కంఠక్ కు ఎక్కువగా భక్తులు తరలి వస్తారు. మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో పుష్కర సమయంలో భక్తులు కిక్కిరిపోతారు. ఇక్కడ నదీ స్నానం చేసిన తరువాత హనుమంతల్ బడా జైన్ మందిర్, మదన్ మహల్, దుమ్మా ప్రకృతి వంటి ప్రదేశాలు చూడొచ్చు. ఇవే కాకుండా హోషంగా బాద్, ఖండ్వా జిల్లాలోని ఓంకారేశ్వర్, మహేశ్వర్, గుజరాత్ రాష్ట్రంలోని భరూచ్ లు ప్రముఖ క్షేత్రాలుగా కొనసాగుతున్నాయి.
పుష్కరాలు 12 రోజుల పాటు కొనసాగుతాయి. పుష్కర స్నానం చేయడం ఎంతో పుణ్యఫలం అని భక్తులు భావిస్తారు. అందుకే పుష్కరాలు ఉండే నదిలో స్నానం చేయడానికి ఎక్కడినుంచో తరలి వస్తారు. ఈ నదిలో స్నానం చేయడం వల్ల ఇన్ని రోజులు చేసిన పాపాలు తొలగిపోతాయని నమ్మకం. మే 1 నుంచి 12 రోజుల పాటు ఈ పుష్కరాలు సాగనున్నాయి.