Manikaran Lord Shiva Temple: చారిత్రక ప్రాశస్త్యాలను ఎన్నో కలిగి ఉన్న మన దేశంలో.. అద్భుతాలకు కొదవేం లేదు. ఆశ్చర్యాలకు తక్కువేం లేదు. వీటిని సైన్స్ కనుగొనలేకపోయింది. వీటి వెనుక ఉన్న నిజాలను శాస్త్రవేత్తల జ్ఞానం చేదించలేకపోయింది. అయితే అలాంటి ఆశ్చర్యమే ఇప్పుడు మీరు చదవబోతున్న కథనం.. హిమాచల్ ప్రదేశ్ లోని కులుకి అనే ప్రాంతానికి 45 కిలోమీటర్ల దూరంలో మణికరణ్ అనే ప్రాంతం ఉంది. ఇది ప్రసిద్ధ శైవ క్షేత్రం. ఇక్కడ సిక్కు మతస్తులు కూడా పూజలు చేస్తుంటారు. ఇక్కడ పార్వతి నది మణికర్ణ మీదుగా ప్రవహిస్తూ ఉంటుంది. ఈ నదికి ఒకవైపున శివాలయం.. మరోవైపున మణికర్ణ సాహిబ్ అని పిలిచే గురునానక్ కు చెందిన చారిత్రాత్మకమైన గురుద్వారా ఉంటుంది. ఇక్కడ నీరు వేడిగా ఉంటుంది. శీతాకాలంలోనూ అదే స్థాయిలో నీరు వెచ్చగా ఉంటుంది. అయితే ఇక్కడ మీరు వెచ్చగా ఉండడానికి ఒక పురాణ కథ ప్రచారంలో ఉంది.. ఆ కథ ప్రకారం ఒకసారి పార్వతి దేవి ఆ నదిలో ఆడుకుంటుండగా.. ఆమె చెవి పోగుకు సంబంధించిన ముత్యం నీటిలో పడిపోతుంది. ఆ ముత్యం అలా నది ప్రవాహం ద్వారా భూలోకం నుంచి పాతాళానికి వెళ్ళిపోతుంది. దీంతో శివుడు రంగంలోకి దిగుతాడు. అతడు కూడా తన మహిమా శక్తితో వెతుకుతాడు. అయినప్పటికీ కూడా ఆ ముత్యం జాడ లభించదు. దీంతో తన మూడో కన్ను తెరుస్తాడు. దీంతో ఆ నదిలో నీరు మరగడం మొదలవుతుంది. అప్పటినుంచి ఇప్పటివరకు ఆ నీరు అలా వేడిగానే ఉంటున్నది. శివుడు మూడో కన్ను తెరిచి ఉగ్రరూపం ప్రదర్శించడంతో నైనా దేవి ప్రత్యక్షమైంది. వెంటనే పాతాళానికి వెళ్ళిపోయి పార్వతి దేవి ముత్యాన్ని తిరిగి శివుడికి ఇవ్వాలని శేషనాగును ఆదేశిస్తుంది. నైనా దేవి ఆదేశాల మేరకు శేషనాగు పాతాళానికి వెళ్లి ఆ ముత్యాన్ని తీసుకొచ్చి శివుడికి అందిస్తాడు. ముత్యాన్ని తీసుకొచ్చే క్రమంలో శేషనాగు విపరీతంగా బుసలు కొడతాడు. వాటి తాకిడికి అనేక రత్నాలు భూమి మీద పలు ప్రాంతాలలో పడ్డాయి. అయితే పార్వతి దేవికి సంబంధించిన ముత్యాన్ని మాత్రమే తీసుకున్న శివుడు.. మిగతా రత్నాలను విసిరి కొట్టాడు.
వేడి నీటితో స్నానం
ఈ నదిలో వేడి నీటితో స్నానం చేస్తే శరీర రుగ్మతలు తగ్గిపోతాయని స్థానికులు చెబుతుంటారు. ఈ వేడి నీరు 65 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను కలిగి ఉంటుందని శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో వెల్లడించారు. ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకునేందుకు వారు అనేక ప్రయోగాలు అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.. భక్తులు ఈ నీటిని ఉపయోగించి ఇక్కడ వంటలు దానివల్ల శివుడి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతుంటారు..ఇక శ్రీరాముడు ఈ ప్రాంతంలో శివుడిని పూజించాడని.. తపస్సు కూడా చేశాడని వివరిస్తుంటారు. మణి కర్ణ ప్రాంతంలో శ్రీరాముడికి సంబంధించిన పురాతన ఆలయం ఉంటుంది. నేటికీ అది అద్భుతంగా దర్శనమిస్తుంది.