Manasa Devi Temple : మానసాదేవి అమ్మవారు ఎంత శక్తివంతమైన అమ్మవారు. దేశవ్యాప్తంగా అనేక ఆలయాలు ఉన్నా.. ప్రపంచంలో స్వయంభూ ఆలయాలు రెండే ఉన్నాయి ఆ దేవాలయాల్లో దేవతలు స్వయంఆ మన సమస్యలు పరిష్కరిచండంతోపాటు కోరికలు తీరుస్తారని ప్రతీతి. మానసాదేవి స్వయంభూ ఆలయాల్లో మొదటిది హరిద్వార్‌లో ఉండగా, రెండోది కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం కాశింపేట గ్రామంలో ఉంది. ఈ మానసాదేవి ఆలయం ప్రాముఖ్యత ఏమిటి, ఆలయ చరిత్ర ఏంటి ఎలా చేరుకోవాలి. ఆలయాన్ని సందర్శిస్తే ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి అనేది తెలుసుకుందాం.
ఆలయ చరిత్ర..
ప్రపంచంలో రెండు మానసాదేవి స్వయంభూ ఆలయాలు ఉన్నాయి. అలాంటి ఆలయాల్లో ఒకటి కాశింపేటలో ఉంది. కొన్నేళ్ల క్రితం కాశింపేట గ్రామ పొలిమేరలో దేవతలకు పూజలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా.. భూమిని తవ్వుతున్నప్పుడు మానసాదేవి అమ్మవారి విగ్రహం, మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం బయటపడ్డాయి. ఈ విగ్రహాలు సుమారు 800 ఏళ్లనాటివిగా గుర్తించారు. ఈ ఆలయంలో శ్రీమానసదేవి అమ్మవారు చాలా ప్రశాంతమైన రూపంలో, వెండి నాఉల కవచం కింద సేదతీరుతూ దర్శనమిస్తారు.
గంటలో కోరికలు తీరుతాయి..
ఈ ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని, నమస్కరించి మడుపు కడితే ఎలాంటి సమస్య అయినా తీరుతుందట. పెళ్లి కానివారు, సంతానం లేనివారు అమ్మవారిని మొక్కుకుని ముడుపు క డితే నెరవేరుతాయని విశ్వసిస్తారు. మనసుపెట్టి మొక్కితే గంటలోనే కోరిక నెరవేరుతుందని భక్తులు చెబుతారు.
పూజలు ఇలా..
మానసాదేవి అమ్మవారికి ప్రతీ మంగళవారం అభిషేకం నిర్వహిస్తారు. కుంకుమ పూజ, చండీహోమం చేస్తారు. భక్తులు సామూహికంగా ఈ పూజల్లో పాల్గొని అమ్మవారి ఆశీర్వాదం పొందుతారు. ఈ ఆలయంలోనే శ్రీఅపురూప మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం కూడా ఉంఇ. ప్రతీ శుక్రవారం మహాలక్ష్మి అమ్మవారికి కూడా పూజలు చేస్తారు అమ్మవారిని దర్వించుకుంటే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.
108 శివలింగాలు..
ఇక మానసాదేవి ఆలయంలో 108 నాగ ప్రతిమ శివలింగాలు ప్రతిష్టించారు. కోనేరు చుట్టూ ఆ శివలింగాల ప్రతిమలు దర్శనమిస్తాయి. ఈ లింగాలను ధర్మగుండం నుంచి నీటిని అభిషేకం చేస్తే 108 శివలింగాలకు అభిషేకం చేసినట్లు అవుతుంది. శివయ్య అనుగ్రహం లభిస్తుంది. ఇక్కడ నిత్యం అన్నదానం కూడా చేస్తారు.
ఆలయానికి ఇలా వెళ్లాలి..
ఈ ఆలయం కరీంనగర్ జిల్లా కేంద్రానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సిద్దిపేట నుంచి 40 కిలోమీటర్లు ఉంటుంది. హైదరాబాద్ నుంచి 140 కిలోమీటర్లు ఉంటుంది. కరీంనగర్ నుంచి లేదా సిద్ధిపేట నుంచి లేదా హైదరాబాద్ నుంచి ఆలయానికి చేరుకోవచ్చు. కరీంనగర్ నుంచి నిత్యం ఉదయం 7 గంటలకు, 10 గంటలకు బస్సులు ఈ ఆలయానికి వస్తాయి.