Makara Sankranathi 2025: దక్షిణ భారత దేశంలో(India) ఎక్కువగా జరుపుకునే పండుగల్లో సంక్రాంతి(Sankranthi) అతిపెద్దది. ఎంత దూరాన ఉన్నా కూడా సంక్రాంతి పండగకు అందరూ ఇళ్లు చేరుకుంటారు. పండుగ వాతావరణంతో ఇళ్లు నిండిపోతాయి. హిందూ మతంలో ఈ మకర సంక్రాంతి(Sankranthi) పండుగకు ఓ ప్రత్యేకత ఉంది. ప్రతీ ఒక్కరూ కూడా ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. కొత్త దుస్తులతో, ఆట పాటలతో ఇంటిల్లిపాది సంక్రాంతిని ఆనందంగా జరుపుకుంటారు. ఈ పండుగ వస్తుందంటే నెల రోజుల నుంచే అందరూ కూడా షాపింగ్(Shopping) అంటూ మొదలు పెడతారు. ఎన్ని పనులు ఉన్నా కూడా సంక్రాంతికి తప్పకుండా ప్రతీ ఒక్కరూ ఇంటికి చేరి కుటుంబ సభ్యులతో(Family Members) ఆనందంగా జరుపుకుంటారు. ఎంతో సంతోషంగా ఆట, పాటలతో ఎంజాయ్ చేస్తారు. అయితే కొందరు తెలియక ఈ సంక్రాంతి పండుగ సమయంలో కొన్ని తప్పులు చేస్తుంటారు. చిన్న తప్పుల వల్ల వారి జీవితంలో కొన్ని అనుకున్న పనులు జరగవు. అలాగే కొన్ని సమస్యలు కూడా వస్తాయి. అయితే ఈ సంక్రాంతి సమయంలో చేయకూడని ఆ పనులేంటో ఈ స్టోరీలో చూద్దాం.
చెట్లను నరకకూడదు
మకర సంక్రాంతి నాడు చెట్లను నరకకూడదని పండితులు చెబుతున్నారు. ఎవరైతే తెలిసో తెలియక సంక్రాంతి రోజు ప్రాణం లేని చెట్లను నరుకుతారో వారికి అన్ని పనుల్లో ఆటంకం ఏర్పడుతుంది. ఏ పని తలపెట్టిన కూడా విజయం లభించదు. అలాగే ఇంట్లో సమస్యలు వస్తాయని పండితులు అంటున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా సంక్రాంతి రోజు చెట్లను నరక వద్దు.
బ్రహ్మచర్యం పాటించాలి
సంక్రాంతి సమయంలో బ్రహ్మచర్యం పాటించాలని పండితులు చెబుతున్నారు. అలాగే సంక్రాంతి నాడు దేవుడిని అవమానించకూడదు. నమ్మకం లేకపోయిన కొందరు దేవుడిని అవమానిస్తారు. ఇలా చేస్తే పాపం చుట్టుకుంటుందని పండితులు చెబుతున్నారు.
మత్తు పానీయాలు సేవించకూడదు
మద్యం, ధూమపానం వంటివి సేవించకూడదని పండితులు చెబుతున్నారు. వీటివల్ల ఇంట్లో దరిద్రం చుట్టుకుంటుందని పండితులు అంటున్నారు. సంక్రాంతి నాడు మాంసాహారం కూడా తినకూడదు. అలాగే ఉల్లిపాయలు, వెల్లుల్లి, పనస, మసాలా వంటివి తినకూడదని పండితులు చెబుతున్నారు.
జుట్టు కత్తిరించకూడదు
కొందరు పండగ సమయాల్లో అందంగా కనిపించాలని జుట్టు, గోళ్లు కత్తిరించుకుంటారు. అయితే ఇలా చేయకూడదని పండితులు చెబుతున్నారు. గోళ్లు, జుట్టు ఎట్టి పరిస్థితుల్లో కూడా సంక్రాంతి నాడు కత్తిరించకూడదని పండితులు అంటున్నారు. కాబట్టి సంక్రాంతి సమయాల్లో ఈ నియమాలు తప్పకుండా పాటించండి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది.