https://oktelugu.com/

Makar sankranti 2025: సంక్రాంతికి పతంగులు ఎగర వేయడం వెనుక ఉన్న కారణం ఏంటి?

సంక్రాంతి పండుగ అంటే కేవలం భోగి మంటలు, కొత్త దుస్తులు, పిండి వంటలు, ఆట పాటలు అనే కాకుండా గాలిపటాలు కూడా గుర్తు వస్తాయి. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరూ కూడా గాలి పటాలు ఎగర వేయడానికి ఇష్టపడతారు. అయితే ఎక్కువగా సంక్రాంతికి గాలి పటాలు ఎగర వేయడానికి కొన్ని శాస్త్రీయ కారణాలు ఉన్నాయని పండితులు అంటున్నారు. గాలి పటాలు ఎగర వేయడం వెనుక ఉన్న కారణం ఏంటి? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 12, 2025 / 09:02 PM IST
    Follow us on

    Makar sankranti 2025: దక్షిణ భారత దేశంలో(India) ఎక్కువగా జరుపుకునే పండుగల్లో సంక్రాంతి(Sankranti) అతిపెద్దది. ఎంత దూరానా ఉన్నా కూడా సంక్రాంతి పండగకు అందరూ ఇళ్లు చేరుకుంటారు. పండుగ వాతావరణంతో ఇళ్లు నిండిపోతాయి. హిందూ మతంలో ఈ మకర సంక్రాంతి(Sankranti) పండుగకు ఓ ప్రత్యేకత ఉంది. ప్రతీ ఒక్కరూ కూడా ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. కొత్త దుస్తులతో, ఆట పాటలతో ఇంటిల్లిపాది సంక్రాంతిని ఆనందంగా జరుపుకుంటారు. ఈ పండుగ వస్తుందంటే నెల రోజుల నుంచే అందరూ కూడా షాపింగ్(Shopping) అంటూ మొదలు పెడతారు. ఎన్ని పనులు ఉన్నా కూడా సంక్రాంతికి తప్పకుండా ప్రతీ ఒక్కరూ ఇంటికి చేరి కుటుంబ సభ్యులతో(Family Members) ఆనందంగా జరుపుకుంటారు. ఎంతో సంతోషంగా ఆట, పాటలతో ఎంజాయ్ చేస్తారు. అయితే సంక్రాంతి పండుగ అంటే కేవలం భోగి మంటలు, కొత్త దుస్తులు, పిండి వంటలు, ఆట పాటలు అనే కాకుండా గాలిపటాలు కూడా గుర్తు వస్తాయి. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరూ కూడా గాలి పటాలు ఎగర వేయడానికి ఇష్టపడతారు. అయితే ఎక్కువగా సంక్రాంతికి గాలి పటాలు ఎగర వేయడానికి కొన్ని శాస్త్రీయ కారణాలు ఉన్నాయని పండితులు అంటున్నారు. గాలి పటాలు ఎగర వేయడం వెనుక ఉన్న కారణం ఏంటి? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

    సంక్రాంతికి గాలి పటాలు ఎగర వేయడం వెనుక ఓ కారణం ఉందని పురాణాలు చెబుతున్నాయి. సంక్రాంతి అనేది ఒక వ్యవసాయ పండుగ. పంటలు పండాలంటే వర్షాలు కురవాలి. దీనికి సూర్యుడు కూడా ఓ కారణమే. అయితే సూర్య భగవానుకి కోరుతూ గాలి పటాలు ఎగురవేస్తారట. అలాగే సూర్యరశ్మిలో గాలి పటాలు ఎగర వేయడం వల్ల శరీరానికి విటమిన్ డి అందుతుంది. దీనివల్ల చర్మ సమస్యలు, వ్యాధులు రాకుండా ఉంటాయి. అందుకే గాలి పటాలను ఎగర వేస్తారని పండితులు చెబుతున్నారు. సంక్రాంతి పండుగ అంటే సరదా. ప్రజలందరూ కూడా సరదాగా సంక్రాంతి పండుగను జరుపుకోవాలని గాలి పటాలను ఎగర వేసే పద్ధతిని తీసుకొచ్చారట. అయితే గాలి పటానికి మరోక కారణం ఉందట. ఆకాశంలో ఎగిరే గాలి పటంతో జీవితాన్ని చూస్తారు. ఆకాశంలో గాలి పటం ఎగరాలంటే పట్టు, ఆధారం, ఆలోచనలు ఉండాలి. వీటివల్ల గాలి పటం సరిగ్గా ఎగురుతుంది. జీవితంలో కూడా ఇలానే ఒక ప్లానింగ్ మీద సరైన ఆలోచనలతో ముందుకు వెళ్లాలని భావిస్తూ గాలి పటాలను ఎగురవేస్తుంటారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మిగతా రాష్ట్ర ప్రజలు కూడా సంక్రాంతి పండుగకి ఎక్కువగా గాలి పటాలు ఎగర వేస్తుంటారు. ఎంతో సరదాగా చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ కూడా గాలి పటాలను ఎగర వేస్తారు.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది.