https://oktelugu.com/

Makar Sankranti 2025: మకర సంక్రాంతికి, కిచిడికి ఉన్న లింక్ ఏంటి? ఎందుకు తప్పనిసరిగా తింటారు?

మకర సంక్రాంతి రోజున స్నానం, దానం వంటివి చేస్తుంటారు. పితృ దేవతలకు ఇష్టమైన వంటలు చేసి పూజిస్తారు. కొన్ని వంటలను చేసి పితృ దేవతలకు పెట్టడం వల్ల వారి ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. అయితే మకర సంక్రాంతి పండుగకి, కిచిడికి (Kichidi) కూడా ఓ లింక్ ఉంది. ఈ పండుగ రోజు కిచిడిని (Kichidi) నైవేద్యంగా (Prasadam) పెడతారు. అసలు పండుగ రోజు కిచిడి నైవేద్యంగా పెట్టడానికి గల కారణం ఏంటి? పూర్తి వివరాల్లో తెలుసుకుందాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 12, 2025 / 09:38 PM IST

    Khicidi

    Follow us on

    Makar Sankranti 2025: సూర్యుడు నెలకి ఒక రాశి చొప్పున మొత్తం 12 రాశుల్లో సంచరిస్తాడు. ఇలా ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించినప్పుడు సంక్రాంతి (Sankranti) పండుగను ఘనంగా జరుపుకుంటారు. మొత్తం మూడు రోజులు పాటు ఈ పండుగను (Festival) ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ పండుగను ఎక్కువగా తెలుగు రాష్ట్ర ప్రజలు ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. కొత్త దుస్తులు, హరిదాసులు, గాలి పటాలు, పిండి వంటలు ఇలా ఎంతో సంతోషంగా (Happy) కుటుంబ సభ్యులతో ఘనంగా చేస్తారు. సంక్రాంతి (Sankranti) పండుగకి సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు. దీంతో ఇకపై అన్ని మంచి రోజులే అని భావిస్తారు. ఏ శుభకార్యాన్ని అయిన తలపెట్టాలని చూస్తారు. ఈ పండుగ తర్వాత నుంచి అన్ని మంచి కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు. మకర సంక్రాంతి రోజున కూడా స్నానం, దానం వంటివి చేస్తుంటారు. పితృ దేవతలకు ఇష్టమైన వంటలు చేసి పూజిస్తారు. కొన్ని వంటలను చేసి పితృ దేవతలకు పెట్టడం వల్ల వారి ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. అయితే మకర సంక్రాంతి పండుగకి, కిచిడికి (Kichidi) కూడా ఓ లింక్ ఉంది. ఈ పండుగ రోజు కిచిడిని (Kichidi) నైవేద్యంగా (Prasadam) పెడతారు. అసలు పండుగ రోజు కిచిడి నైవేద్యంగా పెట్టడానికి గల కారణం ఏంటి? పూర్తి వివరాల్లో తెలుసుకుందాం.

    దాదాపు మూడు ఏళ్ల తర్వాత జనవరి 14న మకర సంక్రాంతి పండుగ వస్తోంది. ఈ సంక్రాంతి పండుగ రోజు చాలా మంది గంగా స్నానం, దానం వంటివి చేస్తుంటారు. అలాగే కొత్త దుస్తులు ధరించి ప్రత్యేకమైన వంటలు దేవుడికి నైవేద్యంగా పెడతారు. అయితే మకర సంక్రాంతి రోజు దేవుడికి కిచిడిని నైవేద్యంగా పెడుతుంటారు. ఇలా కిచిడి పెట్టడం వల్ల పాపాలు అన్ని కూడా తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా శని, రాహు, కేతు వంటి గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయని పండితులు అంటున్నారు. కిచిడి అనేది నవ గ్రహాలకి సంబంధించినదని పండితులు అంటున్నారు. కిచిడిని తయారు చేయడానికి పప్పు వంటివి వాడుతారు. వీటికి శని, రాహు, కేతువులకు చిహ్నంగా పరిగణిస్తారు. అలాగే పసుపును గురువుకి చిహ్నంగా, పచ్చి కూరగాయలను బుద్ధునికి చిహ్నంగా భావిస్తారు. ఇన్ని ఉన్న కిచిడిని తయారు చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టడం వల్ల గ్రహా దోషాలతో పాటు శత్రు బాధలు అన్ని కూడా తొలగిపోతాయని పండితులు అంటున్నారు. సంక్రాంతి రోజున సూర్య భగవానుడు, శని దేవుడు, లడ్డూ గోపాలుడిని పూజించాలి. వారికి ఈ కిచిడిని నైవేద్యంగా పెడితే గ్రహ దోషాలు అన్ని కూడా తొలగిపోయి ఆరోగ్యంగా ఉంటారని పండితులు అంటున్నారు.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. పూర్తి వివరాలు కోసం పండితులను సంప్రదించగలరు.