Makar Sankranti 2025: దక్షిణ భారత దేశంలో(India) ఎక్కువగా జరుపుకునే పండుగల్లో సంక్రాంతి(Sankranti) అతిపెద్దది. ఎంత దూరానా ఉన్నా కూడా సంక్రాంతి పండగకు అందరూ ఇళ్లు చేరుకుంటారు. పండుగ వాతావరణంతో ఇళ్లు నిండిపోతాయి. హిందూ మతంలో ఈ మకర సంక్రాంతి(Sankranti) పండుగకు ఓ ప్రత్యేకత ఉంది. ప్రతీ ఒక్కరూ కూడా ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. కొత్త దుస్తులతో, ఆట పాటలతో ఇంటిల్లిపాది సంక్రాంతిని ఆనందంగా జరుపుకుంటారు. ఈ పండుగ వస్తుందంటే నెల రోజుల నుంచే అందరూ కూడా షాపింగ్(Shopping) అంటూ మొదలు పెడతారు. ఎన్ని పనులు ఉన్నా కూడా సంక్రాంతికి తప్పకుండా ప్రతీ ఒక్కరూ ఇంటికి చేరి కుటుంబ సభ్యులతో(Family Members) ఆనందంగా జరుపుకుంటారు. ఎంతో సంతోషంగా ఆట, పాటలతో ఎంజాయ్ చేస్తారు. అయితే ఈ సంక్రాంతి పండుగ కేవలం తెలుగు రాష్ట్రాల ప్రజలు మాత్రమే కాకుండా మిగతా రాష్ట్రాల ప్రజలు కూడా జరుపుకుంటారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో సంక్రాంతి పండుగను పిలుస్తారు. అయితే ఏయే రాష్ట్రాల్లో సంక్రాంతిని ఏమని పిలుస్తారో ఈ స్టోరీలో చూద్దాం.
ఆంధ్రప్రదేశ్
ఏపీలో పండుగను మకర సంక్రాంతి అని పిలుస్తారు. మూడు రోజుల పాటు ఘనంగా ఈ పండుగను జరుపుకుంటారు. ఇంట్లో ఉన్న పాత వస్తువులు కాల్చి, ముగ్గులు వేసి, గొబ్బెమ్మలతో పండుగ జరుపుకుంటారు.
తమిళనాడు
తమిళనాడులో కూడా మకర సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఇక్కడ పొంగల్ అని పిలుస్తారు. దాదాపు నాలుగు రోజుల పాటు ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. రైతులు ఎద్దులను బాగా అలంకరించి వీటితో పాటు వ్యవసాయానికి సంబంధించిన వస్తువులను కూడా పూజిస్తారు.
కేరళ
కేరళలో మకర సంక్రాంతిని మకరవిళక్కు అని అంటారు. శబరిమలలో మకరవిళక్కుకి ఆకాశంలో మకర జ్యోతి కనిపిస్తుంది. దీన్ని చూడటానికి ప్రజలు భారీగా వెళ్తుంటారు.
కర్ణాటక
కర్ణాటకలో ఈ పండుగను ఎల్లు బిరోధు అని అంటారు. ఇక్కడ మహిళలు చెరకు, నువ్వులు, బెల్లం, కొబ్బరితో చేసిన వస్తువులను ఒకరికి ఒకరు ఇచ్చుకుంటారు.
పంజాబ్
మకర సంక్రాంతిని పంజాబ్‌లో మాఘి అని పిలుస్తారు. మాఘి పండుగ రోజు ముక్తసర్ సాహిబ్‌లో ఉత్సవం జరుగుతుంది. ఇందులో ప్రజలు నృత్యం చేసి పాటలు పాడుతారు. అలాగే కిచిడి, బెల్లం, ఖీర్ చేసి వాటిని తింటారు.
గుజరాత్
మకర సంక్రాంతిని గుజరాత్‌లో ఉత్తరాయణంగా పిలుస్తారు. రెండు రోజుల పాటు ఇక్కడ పండుగను జరుపుకుంటారు. ఈ రెండు రోజుల పాటు గాలిపటాల పండుగను ఇక్కడి ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఉండియు, చిక్కీ వంటకాలు అనేవి ఇక్కడి వాళ్లు చేసి తింటారు.
రాజస్థాన్
రాజస్థాన్‌లో ఇక్కడ సంక్రాంతి అని పిలుస్తారు. అయితే ఇక్కడ మహిళలు ఒక ఆచారాన్ని పాటిస్తారు. 13 మంది వివాహిత మహిళలకు ఇంటికి సంబంధించిన ఏవైనా వస్తువులు ఇస్తుంటారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది.