Maha Kumbh Mela 2025: ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్సవాల్లో మహా కుంభమేళా ఒకటి. వచ్చే ఏడాది దీన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మహా కుంభమేళాను ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో 2025 జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరగనుంది. ఈ మహా కుంభమేళాలో లక్షలాది భక్తులు వెళ్తుంటారు. పవిత్ర నదులు అయిన గంగా, యమునా, సరస్వతి మూడు నదుల సంగమంలో స్నానం చేయడానికి భక్తులు ఎక్కువగా వస్తుంటారు. అయితే ఈ మహా కుంభమేళా మొత్తం నాలుగు ప్రదేశాల్లో జరుగుతుంది. అలహాబాద్ ప్రయాగ్‌రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్‌లో జరుగుతుంది. ఎంతో అంగరంగవైభవంగా జరిగే ఈ మహా కుంభమేళాను అసలు ఎందుకు 12 ఏళ్లకు ఒకసారి నిర్వహిస్తారు? దీని వెనుక ఏదైనా కారణం ఉందా? అనే పూర్తి విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఎంతో పవిత్రమైన కుంభమేళాను ఘనంగా నిర్వహిస్తారు. ఇప్పటికే వీటి గురించి అన్ని ఏర్పాట్లు కూడా జరిగాయి. ఎన్నో స్పెషల్ ట్రైన్‌లను కూడా రైల్వే శాఖ నియమించింది. అయితే మహా కుంభమేళాను 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించడానికి ఓ కారణం ఉంది. ఈ కుంభమేళా అనేది దేవతలు అమృతం కోసం చేసిన యుద్ధం అని చెప్పుకుంటారు. అయితే దేవతలు, రాక్షసులు ఈ అమతాన్ని పొందడం కోసం దాదాపుగా 12 ఖగోళ రోజులు పోరాడరని పురాణాలు చెబుతున్నాయి. ఒక్కో ఖగోళ రోజు అంటే మొత్తం 12 ఏళ్లకు మానవ లోకంలో సమానం. అందుకే దీనికి గుర్తుగా మహా కుంభమేళాను 12 ఏళ్లకు ఒకసారి నిర్వహిస్తారు. ఎంతో అంగరంగ వైభవంగా 12 ఏళ్లకు ఒకసారి ఈ కుంభమేళాను నిర్వహిస్తారు. దేవతలు, రాక్షసులకు మధ్య ఈ అమృతం కోసం జరిగిన యుద్ధంలో కొన్ని చుక్కలు 12 ప్రదేశాల్లో పడ్డాయట. అందులో నాలుగు ప్రదేశాలు భూమి మీద ఉన్నాయి. అవే ప్రయాగ్‌రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ ప్రాంతాలు. ఇక్కడే మహా కుంభమేళాను నిర్వహిస్తారు.
ఈ మహా కుంభమేళాకు భక్త జనం భారీ సంఖ్యలో వస్తుంటారు. ఈ కుంభమేళాలో నదీ స్నానం చేయడం వల్ల మంచి జరుగుతందని నమ్ముతారు. అలాగే పెద్దల అస్థికలు వంటివి కలపడానికి కూడా ఎందరో వస్తారు. ఈ మహా కుంభమేళాకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఎన్నో ఏళ్ల నుంచి దీన్ని జరుపుతున్నారు. అయితే మొత్తం 45 రోజుల పాటు జరిగే ఈ కుంభమేళాలో కొన్ని ముఖ్యమైన రోజులు కూడా ఉన్నాయి. 2025 జనవరి 13న ప్రారంభం అయ్యే కుంభమేళా మొదటి రోజు పౌష్ పూర్ణిమ అంటారు. ఆ తర్వాత జనవరి 14న మకర సంక్రాంతి, జనవరి 29న మౌని అమావాస్య, ఫిబ్రవరి 3న బసంత్ పంచమి, ఫిబ్రవరి 12న మాఘ పూర్ణిమ, ఫిబ్రవరి 26న మహా శివరాత్రితో పూర్తవుతుంది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలన్నీ కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. సూచనలు, సలహాల కోసం పండితులను సంప్రదించగలరు.