Maha Kumbh Mela 2025: ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్సవాల్లో ఒకటైన మహా కుంభమేళా (Maha kumbh Mela) జరుగుతోంది. ఫిబ్రవరి 26 వరకు ఈ మహా కుంభమేళాను ఘనంగా నిర్వహించనున్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని (Uttar Pradesh) ప్రయాగ్ రాజ్‌లో (Prayagraj) జరుగుతున్న ఈ మహా కుంభమేళాకి లక్షలాది భక్తులు వెళ్తుంటారు. పవిత్ర నదులు అయిన గంగా, యమునా, సరస్వతి మూడు నదుల సంగమంలో స్నానం చేయడానికి భక్తులు ఎక్కువగా మక్కువ చూపిస్తారు. మొత్తం నాలుగు ప్రదేశాల్లో ఈ మహా కుంభమేళా (Maha kumbh Mela) జరుగుతుంది. అలహాబాద్ ప్రయాగ్‌రాజ్ (Prayagraj), హరిద్వార్ (Haridwar), ఉజ్జయిని (Ujjayini), నాసిక్‌లో(Nasik) జరుగుతుంది. వివిధ దేశాల నుంచి కూడా ఈ కుంభమేళాలో పవిత్ర స్నానం చేయడానికి భక్తులు (Maha kumbh Mela) వెళ్తుంటారు. ఇందులో స్నానం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. అయితే మహా కుంభమేళాలో కేవలం భక్తులు మాత్రమే కాకుండా నాగ సాధువులు కూడా వెళ్తుంటారు. అయితే వీరిని ఎప్పుడు చూసిన కూడా చేతిలో ఏదో ఒక ఆయుధం పట్టుకుని కనిపిస్తారు. అసలు వీరు చేతిలో ఆయుధాలు పట్టుకోవడానికి గల కారణాలు ఏంటి? పూర్తి వివరాలు కూడా ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మహా కుంభమేళాలో అమృత స్నానం కోసం ఎందరో నాగ సాధువులు వచ్చారు. ఈ సమయంలో చాలా మంది చేతుల్లో ఈటె, ఖడ్గం, గదా వంటి ఆయుధాలు పట్టుకుని కనిపించారు. దీంతో వారు ఎందుకు చేతిలో ఆయుధాలు పట్టుకుంటారనే సందేహం చాలా మందిలో మెదిలింది. ఎంతో కఠినంగా వారు నాగ సాధువులుగా మారుతారు. దాదాపుగా కొన్నేళ్ల పాటు శ్రమిస్తారు. అప్పుడే వారు నాగ సాధువులుగా మారుతారు. అయితే నాగ సాదువులకు కొన్ని సంప్రదాయాలు ఉన్నాయి. అందులో ఒకటి ఆయుధ సంప్రదాయం, మరొకటి గ్రంధాల సంప్రదాయం. నాగ సాధువులు ఈ ఆయుధ సంప్రదాయాన్ని ధారణ చేస్తారు. వీరినే మనం మతాన్ని రక్షించే సైనికులుగా భావిస్తారు. అందుకే వీరు ఏదో ఒక ఆయుధాన్ని వెంట పెట్టుకుని మహా కంభమేళాలో కనిపించారు. మన మతాన్ని గౌరవించాలనే సంప్రదాయం వల్ల వారు ఈటెలను తీసుకొస్తారని పండితులు చెబుతున్నారు. దేశాన్ని సైన్యం ఎలా కాపాడుతుందో మతాన్ని నాగ సాధువులు అలా కాపాడతారని పండితులు చెబుతున్నారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది.