Maha kumbh Mela 2025: ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్సవాల్లో మహా కుంభమేళా (Maha kumbh Mela) ఒకటి. నేటి నుంచి మహా కుంభమేళా ప్రారంభం అయ్యింది. ఫిబ్రవరి 26 వరకు ఈ మహా కుంభమేళా జరగనుంది. దీన్ని ఘనంగా ఉత్తర ప్రదేశ్‌లోని (Uttar Pradesh) ప్రయాగ్ రాజ్‌లో (Prayagraj) నిర్వహిస్తున్నారు. ఈ మహా కుంభమేళాకి లక్షలాది భక్తులు వెళ్తుంటారు. పవిత్ర నదులు అయిన గంగా, యమునా, సరస్వతి మూడు నదుల సంగమంలో స్నానం చేయడానికి భక్తులు ఎక్కువగా వస్తుంటారు. మొత్తం నాలుగు ప్రదేశాల్లో ఈ మహా కుంభమేళా (Maha kumbh Mela) జరుగుతుంది. అలహాబాద్ ప్రయాగ్‌రాజ్ (Prayagraj), హరిద్వార్ (Haridwar), ఉజ్జయిని (Ujjayini), నాసిక్‌లో(Nasik) జరుగుతుంది. ఎంతో అంగరంగ వైభవంగా జరిగే ఈ మహా కుంభమేళాను 12 ఏళ్లకు ఒకసారి నిర్వహిస్తారు. వివిధ దేశాల నుంచి కూడా ఈ కుంభమేళాకు భక్తులు (Maha kumbh Mela) వెళ్తుంటారు. అయితే కొందరికి ఈ కుంభమేళాకు వెళ్లడానికి వీలు కుదరదు. వ్యక్తిగత సమస్యలు, దూరం వంటి కారణాల వల్ల చాలా మంది కుంభమేళాలో స్నానం చేయలేరు. దీంతో పుణ్యం రాదేమో అని బాధపడుతుంటారు. అయితే మీరు మహా కుంభమేళాకు వెళ్లకపోయిన కూడా స్నానం చేసే ప్రతిఫలం పొందాలంటే మాత్రం కొన్ని నియమాలు పాటించాలని పండితులు చెబుతున్నారు. మరి అవేంటో ఈ స్టోరీలో చూద్దాం.
మహా కుంభమేళాకు వెళ్లడానికి అందరికి కూడా వీలుపడదు. అలాంటి వారు ఎవరైతే వెళ్తారో వారిని నీరు తీసుకురమ్మని చెప్పండి. వారు తీసుకొచ్చిన నీటిలో మీరు కాస్త నీరు కలిపి ఆ నీటితో స్నానం చేయండి. కనీసం చుక్క నీరు అయిన కూడా మీకు పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. మీరు తెలిసిన వారు కూడా ఎవరూ కుంభమేళాకు వెళ్లడం లేదు అనుకుంటే.. కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఇక్కడి నీరు, ప్రసాదాలు పంపుతాయి. వాటిలో మీరు మీ డిటైల్స్ అన్ని కూడా నమోదు చేసుకుంటే మీకు తప్పకుండా అన్ని వస్తాయి. ఇలా చేయడం వల్ల కూడా మీకు పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ పవిత్ర స్నానం చేయడానికి ఎందరో భక్తులు భారీ సంఖ్యలో తరలి వెళ్తుంటారు. 12 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ మహా కుంభమేళాకి తప్పకుండా వెళ్లాలని చాలా మంది ప్లాన్ చేసుకుంటారు.
ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలో ఎక్కువగా పవిత్ర స్నానాలు చేస్తారు. ఇక్కడ స్నానం చేయడం వల్ల పాపాలు అన్ని కూడా తొలగిపోతాయని నమ్ముతారు. అయితే ఈ త్రివేణి సంగమం నుంచి నీరు ఇంటికి తీసుకొచ్చి చల్లితే ఇంట్లో ఉన్న గ్రహ, వాస్తు దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. త్రివేణి ఘాట్ నుంచి తీసుకొచ్చిన నీటిని స్నానం చేసే వాటర్‌లో కలపడం వల్ల మానసిక సమస్యలు అన్ని కూడా క్లియర్ అయి ప్రశాంతంగా ఉంటారు. ఈ మహా కుంభమేళా నీటిలో స్నానం మాత్రమే ఆచరించకుండా.. ఇంటికి తీసుకొచ్చి చల్లితే పాపాలు అన్ని కూడా తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది.