Maha Kumbamela 2025: ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్సవాల్లో మహా కుంభమేళా ఒకటి. ఈ కుంభ మేళా జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరగనుంది. ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో దీన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పా్ట్లు అన్ని కూడా పూర్తి అయ్యాయి. ఈ మహా కుంభమేళాకి లక్షలాది భక్తులు వెళ్తుంటారు. పవిత్ర నదులు అయిన గంగా, యమునా, సరస్వతి మూడు నదుల సంగమంలో స్నానం చేయడానికి భక్తులు ఎక్కువగా వస్తుంటారు. మొత్తం నాలుగు ప్రదేశాల్లో ఈ మహా కుంభమేళా జరుగుతుంది. అలహాబాద్ ప్రయాగ్‌రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్‌లో జరుగుతుంది. ఎంతో అంగరంగవైభవంగా జరిగే ఈ మహా కుంభమేళాను అసలు ఎందుకు 12 ఏళ్లకు ఒకసారి నిర్వహిస్తారు. వివిధ దేశాల నుంచి కూడా ఈ కుంభమేళాకు భక్తులు వెళ్తుంటారు. అయితే ఈ మహా కుంభమేళా మొదటి స్నానం అనేది జనవరి 13వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. దీనికి స్నానానికి వెళ్లిన వారు ప్రయాగ్ రాజ్ నుంచి కొన్ని వస్తువులను ఇంటికి తీసుకురావడం వల్ల శతృ బాధలు అన్ని కూడా తొలగిపోయి.. కుటుంబంలో సంతోషాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. మరి కుంభమేళా నుంచి ఇంటికి తీసుకురావాల్సిన ఆ వస్తువుల ఏంటో తెలియాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.
కనుమల నేల
గంగా ఘాట్ నేల చాలా పవిత్రమైనది. ఈ గంగా ఘాట్ దగ్గర నుంచి కనీసం పిడికిడి మట్టి అయిన ఇంటికి తీసుకురావాలని పండితులు చెబుతున్నారు. ఇలా తీసుకొచ్చిన మట్టిని తులసి మొక్కలో వేయడం వల్ల ఇంట్లో ఉన్న సమస్యలు అన్ని కూడా క్లియర్ అయిపోతాయి. ఎలాంటి గ్రహా దోషాలు, ఆర్థిక సమస్యలు లేకుండా సంతోషంగా ఉంటారని చెబుతున్నారు.
త్రివేణి సంగమం నీరు
ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలో ఎక్కువగా స్నానాలు చేస్తారు. ఇక్కడ స్నానం చేయడం వల్ల పాపాలు అన్ని కూడా తొలగిపోతాయని నమ్ముతారు. అయితే ఈ త్రివేణి సంగమం నుంచి నీరు ఇంటికి తీసుకొచ్చి చల్లితే ఇంట్లో ఉన్న గ్రహ, వాస్తు దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. త్రివేణి ఘాట్ నుంచి తీసుకొచ్చిన నీటిని స్నానం చేసే వాటర్‌లో కలపడం వల్ల మానసిక సమస్యలు అన్ని కూడా క్లియర్ అయి ప్రశాంతంగా ఉంటారు.
తులసి పూసలు, రుద్రాక్ష
హిందూ మతంలో రుద్రాక్ష, తులసి మాలకి ఓ ప్రత్యేకత ఉంది. ఎంతో పవిత్రంగా వీటిని భావిస్తారు. అయితే మహా కుంభమేళాలో స్నానం చేసిన తర్వాత వీటిని ఇంటికి తీసుకు వస్తే.. ప్రతికూలతలు అన్ని కూడా తొలగిపోతాయి. మీ జీవితం కూడా ఇంతకు ముందు కంటే బెటర్‌గా ఉంటుందని పండితులు అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వీటిని మర్చిపోయి రావద్దు.
ప్రసాదం
ప్రయాగ్‌రాజ్‌లో ఎన్నో ఆలయాలు ఉన్నాయి. ఈ మహా కుంభమేళాలో స్నానం చేసిన తర్వాత ఆలయాలను సందర్శించాలి. అలాగే అక్కడి ప్రసాదాలను తప్పకుండా ఇంటికి తీసుకురావాలని పండితులు చెబుతున్నారు. ఇలా ఇంటికి తీసుకురావడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని నమ్ముతారు.
పువ్వులు
మహా కుంభమేళా నుంచి పువ్వులను ఇంటికి తీసుకురావడం వల్ల ఇంటిలో సుఖసంతోషాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. ఏదైనా ఆలయం నుంచి వీటిని తీసుకొస్తే ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఇవి ఇంట్లో ఆనందం, శాంతిని కలిగించడంతో పాటు గ్రహ దోషాలను కూడా తొలగిస్తాయని అంటారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. పూర్తి వివరాలు కోసం పండితులను సంప్రదించగలరు.