Rashi Phalalu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. అక్టోబర్ 28న శనివారం ద్వాదశ రాశులపై రేవతి నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే రోజు చంద్రగ్రహణం కారణంగా మిథునం, వృశ్చిక, కుంభరాశి వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి. సింహ, తుల, మీన రాశి వారికి మధ్యస్తం, మేష, వృషభ, కన్య, మకర రాశుల వారికి ప్రతికూల ఫలితాలు ఉంటాయి. నేటి 12 రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి:
మేష రాశి కలిగిన వారి పై చంద్రగ్రహణ ప్రభావం ఉండే అవకాశం ఉంది. వీరికి ఈరోజు మానసిక సమస్యలు ఉండే అవకాశం ఉంది. ఆరోగ్యంలో కొన్ని మార్పులతో ఆందోళన చెందుతారు. అనవసర ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారులకు సానుకూల పరిణామాలు.
వృషభం:
నేటి సాయంత్రం శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సోదరులు, మిత్రుల సలహా తో కొన్ని పనులు పూర్తి చేయగలుగుతారు. దూరపు బంధువుల నుంచి అందిన ఓ సమాచారం సంతోషాన్ని కలిగిస్తుంది.
మిథునం:
ఇతరుల నుంచి ఒక శుభవార్త వింటారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి అనుకూల సమయం. కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆస్తి గురించి ఓ ముఖ్యమైన సమాచారం అందుతుంది.
కర్కాటకం:
ఈ రాశివారికి ఆకస్మికంగా పెద్ద మొత్తంలో డబ్బు అందుతుంది. తల్లిదండ్రలతో సంతోషంగా ఉంటారు. అప్పులు ఈరోజు వసూలవుతాయి. సాయంత్రం ఒక శుభ కార్యక్రమంలో పాల్గొంటారు.
సింహం:
ఇతరులు తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తారు. తెలివిగా ప్రవర్తించాలి. రాజకీయాల్లో ఉండే వారికి మద్దతు లభిస్తుంది. విదేశాలకు వెళ్లే వారికి ప్రతికూల వాతావరణం.
కన్య:
బంధువుల సహాయంతో పెండింగులో ఉన్న సమస్యలను పూర్తి చేస్తారు. కొన్ని సమస్యలు కొత్తగా ఎదురైనా వాటిని పరిష్కరించుకోగలుతారు. ఖర్చులు తగ్గించే ప్రయత్నం చేయాలి.
తుల:
జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు ఉంటుంది. విదేశాలకు వెళ్లాలనుకుంటే ఆలోచించండి. విలువైన వస్తువులు చేజారిపోయే అవకాశం. జాగ్రత్తగా ఉండాలి. సమాజంలో గౌరవం పొందుతారు.
వృశ్చికం:
ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. స్నేహితులలో ఒకరు మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు.
ధనస్సు:
ఆదాయంతో పాటు ఖర్చులు ఉంటాయి. ఇతరుల సలహాలు పాటించడం మంచిదే. అవసరాలకు ఖర్చులు పెరుగుతాయి. దూరపు బంధువులతో వాగ్వాదం ఏర్పడుతుంది. కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
మకరం:
వ్యాపారులు తెలివిగా ప్రవర్తించాలి. లేదంటే నష్టపోయే అవకాశం. పెండింగులో ఉన్న వివాదం ఈరోజు పరిష్కారం అవుతుంది. కొన్ని విషయాలు ఇతరులతో పంచుకోకుండా ఉండడమే మంచిది.
కుంభం:
ప్రభుత్వ ఉద్యోగులకు అనుకూల సమయం. సాధారణ ఉద్యోగులతో ఉన్నతాధికారులతో వాగ్వాదం. ఆస్తిని కొనుగోలు చేసేవారు అప్రమత్తంగా వ్యవహరించాలి. లేకుంటే సమస్యలు రావొచ్చు.
మీనం:
పిల్లల విషయంలో కొన్ని శుభవార్తలు వింటారు. భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి. సంపాదించిన దాంట్లో ఆదా చేయాలి. డబ్బు పొదుపు పై ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి.