Karthika Masam 2024: హిందూ పండుగల్లో కార్తీక మాసానికి చాలా ప్రత్యేకత ఉంది. నెల రోజులు పాటు శివుడిని భక్తితో పూజిస్తారు. ఏడాది మొత్తంలో కార్తీక నెలలో ఎక్కువగా పూజలు నిర్వహిస్తారు. ఉదయాన్నే లేచి స్నానాలు చేసి శివుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అయితే కొందరు దీపావళి తర్వాత రోజు నుంచి కార్తీక మాసం ఆచరిస్తే.. మరికొందరు పౌర్ణమి నుంచి కార్తీక పౌర్ణమి వరకు ఆచరిస్తారు. ఏడాది అంతా చేసే పూజలు ఎంత ముఖ్యమో.. కార్తీక మాసంలో నెల రోజులు పూజలు చాలా ముఖ్యమని పండితులు చెబుతుంటారు. అయితే కొందరికి తెలియక కార్తీకంలో కొన్ని తప్పులు చేస్తుంటారు. కార్తీకంలో తెలిసో, తెలియక చేసే చిన్న తప్పులు వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. అసలు ఈ మాసంలో కొన్ని నియమాలు పాటించాలి. అప్పుడే అనుకున్న పనులన్నీ జరుగుతాయని పండితులు అంటున్నారు. అయితే కార్తీక మాసంలో కొన్ని నియమాలు పాటించడం వల్ల శివుడి అనుగ్రహం కలుగుతుంది. మరి ఈ మాసంలో పాటించాల్సిన ఆ నియమాలేంటో తెలియాలంటే ఆలస్యం లేకుండా స్టోరీ చూసేయండి.
కార్తీక మాసంలో ముఖ్యంగా చేయాల్సిన పని నదిలో లేదా సముద్రంలో స్నానం ఆచరించాలి. సూర్యోదయం కాకముందు వేకువ జామున లేచి స్నానం ఆచరించి మొదట గంగమ్మకు పూజలు నిర్వహించాలి. గంగాదేవికి పూజించిన తర్వాతే శివుడిని పూజించాలని పండితులు అంటున్నారు. నదులు, చెరువులు, సముద్రాలు దగ్గర లేని వాళ్లు ఇంట్లో స్నానం చేయవచ్చు. గంగాదేవిని పూజించిన తర్వాత శివుడిని ఆవు పాలతో అభిషేకం చేయించాలి. కార్తీక మాసంలో భక్తులు ఉదయాన్నే స్నానం ఆచరించి రోజూ శివుడిని పూజించడం వల్ల సర్వ పాపాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. ఈ మాసంలో ఉదయం, సాయంత్రం వేళలో చాలా మంది శివుడు లేదా విష్ణుమూర్తి ఆలయాన్ని సందర్శిస్తారు. ఓపిక ఉన్నవారు నెల రోజులు ఉపవాసం ఆచరిస్తే అనారోగ్య సమస్యలు ఉన్నవారు కేవలం ఒక పూట భోజనం చేస్తారు. కానీ ఏకాదశి, కార్తీక పౌర్ణమి రోజు మాత్రం తప్పకుండా ఉపవాసం ఉంటారు.
మిగతా ఏకాదశితో పోలిస్తే కార్తీకంలో వచ్చే ఏకాదశి చాలా ప్రత్యేకమైనది. ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉండి భక్తితో శివుడిని, విష్ణుమూర్తిని పూజిస్తారు. ఏకాదశి రోజు పూర్తిగా కొందరు ఉపవాసం ఉంటారు. అలాగే కార్తీక మాసంలో నెల రోజుల పాటు మాంసం, ఉల్లిపాయలు, మద్యం, సిగరెట్, వెల్లుల్లికి దూరంగా ఉండాలి. కేవలం తాజాగా కూరగాయలనే తింటూ ఒక్క పూట భోజనం చేయాలి. ఈ మాసంలో ఎక్కువగా దాన ధర్మాలు చేయాలి. వేరే ఇతర ఆలోచనలు లేకుండా శివ నామస్మరణ జపించాలి. ముఖ్యంగా కార్తీకంలో వచ్చే సోమవారాలు భక్తితో శివుడిని పూజించాలి. ఈ సమయాల్లో శివుని ఆలయాలు భక్తులతో కిటకిటలాడతాయి. కార్తీక మాసంలో ఈ నియమాలు పాటిస్తే తప్పకుండా శివుని అనుగ్రహం కలుగుతుంది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు పండితుల సలహాలు తీసుకోగలరు.