Yoga Satsanga Sadhanaalayam : మనిషి జీవనశైలి మారింది. ఆహారపు అలవాట్లు మారాయి. వ్యసనాల బారిన పడిన వారు ఉన్నారు. అయితే కోవిడ్ తర్వాత పరిస్థితి మారింది. అందరికీ ఆరోగ్యం పై అవగాహన పెరిగింది. తీసుకునే ఆహారం నుంచి వర్కౌట్ల వరకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే చాలామంది యోగాను తమ జీవితంలో భాగం చేసుకున్నారు. జిమ్ లకు వెళ్లాల్సిన అవసరం లేకుండా.. కొద్దిపాటి సమయంతో.. అతి సులువుగా యోగ ప్రక్రియను చేపట్టి ఆరోగ్యాన్ని పొందుతున్నారు. అందుకే యోగాకు ఆదరణ పెరిగింది. దీనికి వయస్సుతో సంబంధం లేదు. నాలుగు పదుల వయసులోనూ కూడా యోగా చేయడంప్రారంభించవచ్చు. యోగాతో ఫిట్నెస్ తో పాటు ఆనందం పొందవచ్చు. ఇటువంటి వారి కోసం రాజమండ్రిలో కొత్తగా యోగదా సత్సంగ సాధనాలయం ఏర్పాటయింది. ఈ ఏడాది ఆగస్టు 24న ప్రారంభించబడింది. ఎకరా 30 సెంట్ల విస్తీర్ణంలో.. ప్రశాంత గోదావరి చెంతన ఏర్పాటైన ఈ యోగా శిక్షణ కేంద్రం అనతి కాలంలోనే ఎంతో ప్రాచుర్యం పొందింది. ఇక్కడ రోజు వారి వ్యాయామాలు, ధ్యానం, యోగాసనాలపై శిక్షణ ఇస్తున్నారు. ఆధ్యాత్మిక కేంద్రంగా కూడా విరాలజిల్లుతోంది. శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు స్వామి స్మరణానంద, స్వామి ప్రజ్ఞానానంద, స్వామి శంకరానంద తదితరుల పర్యవేక్షణలో ఈ జానకంద్ర ప్రారంభమైంది.
* పెరుగుతున్న భక్తులు
నెలరోజుల వ్యవధిలోనే ఇక్కడికి భక్తుల రాక ప్రారంభమైంది.యోగ శిక్షణార్థం 450 మంది భక్తులు నమోదు చేసుకున్నారు.దాదాపు 550 మంది ఈ కేంద్రంలో ప్రస్తుతం సేవలు పొందుతున్నారు. అటు యోగ పై శిక్షణతో పాటు ధ్యానం, వ్యాయామంపై కూడా ఇక్కడ శిక్షణ ఇస్తారు. వ్యాయామం కోసం ప్రత్యేక పరికరాలు అందుబాటులో ఉంటాయి. నడక మార్గాలు సైతం అందుబాటులో ఉన్నాయి. ఇది 32 గదులతో కూడిన నివాస భవనం. భక్తులకు అన్ని రకాల సదుపాయాలు ఇక్కడ కల్పించబడ్డాయి. చుట్టూ ఆహ్లాదకరం, పచ్చని చెట్లతో తివాచీ పరిచినట్టు ఉంటుంది ఈ ప్రాంతం.
* నేత్ర వైద్యశాల
ఒక్క ధ్యానమే కాదు ఆరోగ్యకరంగా కూడా ఎన్నో రకాల అంశాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఈ ధ్యాన కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో పరమహంస యోగానంద కంటి ఆసుపత్రి ఉంటుంది. గ్రామీణ ప్రాంత ప్రజలకు మంచి సేవలు అందిస్తోంది. ఇక్కడ కంటి ఆపరేషన్లు సైతం జరుగుతాయి. ఇక్కడ ఉండేందుకు ముందస్తుగా రిజర్వేషన్ చేసుకునే వెసులుబాటు సైతం ఉంది. వారాంతంలో కానీ, వారం రోజులు పాటు కానీ, నెలరోజులపాటు కానీ ఉండేందుకు ఇక్కడముందస్తు రిజర్వేషన్లు అందుబాటులోకి తెచ్చారు.రిజర్వేషన్లు చేయదలుచుకున్న వారు 93922 85867 నంబర్కు సంప్రదించవచ్చు. ఆన్లైన్లో సంప్రదించాల్సిన వారు.. Rajahmundry.retreat@ysscenters.org వెబ్సైటులో వివరాలు తెలుసుకోవచ్చు.
* రవాణా సేవలు
రాజమండ్రి రైల్వే స్టేషన్ కు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ధ్యాన కేంద్రం. విమానాశ్రయానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కేంద్రానికి వాహన సదుపాయాలు కూడా ఉన్నాయి. ప్రారంభ దశలో ఉన్న ఈ ధ్యానకేంద్రంలో వసతులు మెరుగుపరిచేందుకు చర్యలు చేపడుతున్నారు. దాతల నుంచి విరాళాలు సేకరిస్తున్నారు. విరాళాలు ఇవ్వదలుచుకున్నవారు వెబ్ సైట్ ను సంప్రదించవచ్చు. ఆన్లైన్ ద్వారా కూడా విరాళాలు అందించవచ్చు.