https://oktelugu.com/

Bhogi 2025: భోగి పండుగ రోజు ఈ చిన్న పనిచేస్తే.. ఐశ్వర్యం మీ ఇంటికి వచ్చినట్లే..

మూడు రోజుల సంక్రాంతి వేడుకల్లో భాగంగా మొదటి రోజు జరుపుకునేంది భోగి పండుగ. ఈరోజు భోగి మంటుల ప్రత్యేకం. సాయంత్రం ప్రతి ఒక్కరి ఇళ్లల్లో ఉన్న పాత సామాన్లు అన్నీ కూడళ్ల వద్దకు తీసుకొచ్చి మంటలు వేస్తారు.

Written By:
  • Srinivas
  • , Updated On : January 13, 2025 / 10:26 AM IST

    Bhogi 2025(1)

    Follow us on

    Bhogi 2025: జనవరి వచ్చిందంటే చాలు.. సంక్రాంతి సంబరాలతో తెలుగు ప్రజలు ఆనందంగా ఉంటారు. మూడు రోజుల పాటు పిల్లలు, పెద్దలు అంతా కలిసి ఉల్లాసంగా గడుపుతారు. అందమైన ముగ్గులు, పిండి వంటలు, ప్రత్యేక నోములతో ప్రతి ఇల్లు సందడిగా మారుతుంది. మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించేకునే ఈవేడుకల్లో భాగంగా మొదటగా వచ్చేది భోగి. తెలుగు క్యాలెండర్ ప్రకారం 2025 ఏడాదితో జనవరి 13న భోగి పండుగ నిర్వహించుకోనున్నారు. భోగి పండుగ రోజు ఉదయం నుంచే ప్రతి ఇంటి ముందు అందమైన ముగ్గు కనిపిస్తుంది. ఆ తరువాత చిన్న పిల్లలపై భోగి పండ్లు పోసి వేడుకలు నిర్వహిస్తారు. సాయంత్రం భోగి మంటలు వేసి ఆట పాటలతో సందడి చేస్తారు. అయితే భోగి మంటల సందర్భంగా ఒక పని చేయడం ద్వారా ఇంట్లో ఐశ్వర్యం సిద్ధిస్తుందని కొందరు పండితులు చెబుతున్నారు. అందుకోసం ఏం చేయాలంటే?

    మూడు రోజుల సంక్రాంతి వేడుకల్లో భాగంగా మొదటి రోజు జరుపుకునేంది భోగి పండుగ. ఈరోజు భోగి మంటుల ప్రత్యేకం. సాయంత్రం ప్రతి ఒక్కరి ఇళ్లల్లో ఉన్న పాత సామాన్లు అన్నీ కూడళ్ల వద్దకు తీసుకొచ్చి మంటలు వేస్తారు. అయితే కొందరు ఈ భోగి మంటలను సాంప్రదాయంగా నిర్వహిస్తారు. దక్షిణయానంలో భూమికి సూర్యుడు దూరంగా ఉంటాడు. దీంతో చల్లటి వాతావరణం ఉంటుంది. ఈ వాతావరణం నుంచి తట్టుకునేందకు భోగి మంటలు వేస్తారని అంటారు. అలాగే ఇన్నాళ్లు పడిన కష్టాలు, బాధలను మరిచిపోవడానికి, వాటిని ఈ భోగి మంటల్లో వేసేందుకు భోగి మంటలు కాస్తారని చెబుతారు.

    ఇదిలా ఉండగా భోగి పండుగ వెనుక ఓ కథ ఉంది. పురాణాల ప్రకారం.. రురువు అనే రాక్షసుడు ఘోర తపస్సు చేస్తాడు. బ్రహ్మ ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమ్మంటాడు. అప్పుడు రురువు తనకు మరణం సంబవించకుండా వరం ఇవ్వాలని కోరుకుంటాడు. కానీ ఇది సాధ్యం కాదని చెప్పడంతో.. తాను భోగి మంటల్లో తనని తోసేస్తే మరణించేలా వరం ఇవ్వాలని అడగగా.. అప్పుడు ఒప్పుకుంటాడు. భోగి మంటల్లో రురువును తెలువువారు వేస్తూ ఉంటారు. రురువు అంటే బ్యాక్టీరియా. ధనుర్మాసం ప్రారంభం అయినప్పటి నుంచి కొందరు గొబ్బెమ్మలు పెడుతూ ఉంటారు. వీటన్నింటిని భోగి మంటల్లో వేసి కాలుస్తారు. వీటితో పాటే రురువు చనిపోతాడు. అంటే భోగి మంటల ద్వారా బ్యాక్టీరియా చనిపోయి స్వచ్ఛమైన వాతావరణం ఏర్పడుతుంది.

    అబయితే భోగి పండుగ రోజున చిన్న పని ద్వారా ఇంట్లోకి వద్దన్నా ధనం వస్తుందని కొందరు పండితులు చెబుతున్నారు. ఈరోజున ఎర్రటి వస్త్రంలో కర్పూరం, కొన్ని తెల్ల ఆవాలు, రెండు గోమతి చక్రాలు వేసి మూట గట్టాలి. ఈ మూటను పట్టుకొని భోగి మంటల చుట్టూ ప్రదక్షిణ చేయాలి. ఆ తరువాత ఆ మూటను భోగి మంటల్లో వేయాలి. ఇలా చేయడం ద్వారా జాతక దోషాలు తొలగిపోయిన అదృష్టం వరిస్తుందని అంటున్నారు. అంతేకాకుండా అనుకున్న పనులు నెరవేరుతాయని చెబుతున్నారు.